news

News June 18, 2024

APలో పట్టాదారు పాసుపుస్తకాల నిలిపివేత

image

రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో పంపిణీ కోసం గత సర్కారు ముద్రించిన పట్టాదారు పాసుపుస్తకాలను నిలిపివేయాలని NDA ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 20 లక్షలమంది రైతులకు పుస్తకాలు అందాల్సి ఉండగా ఎన్నికల వల్ల వేలాదిమందికి అవి రాలేదు. మాజీ సీఎం జగన్ ఫొటో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రీ-సర్వే కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది.

News June 18, 2024

నేడు రైతుల అకౌంట్లలోకి డబ్బులు

image

ప్రధాని మోదీ నేడు 17వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. వారణాసిలో పర్యటించనున్న ఆయన 9.26 కోట్ల మంది రైతుల అకౌంట్లలో రూ.20 వేల కోట్లు జమ చేయనున్నారు. దీంతో పాటు 30వేలకు పైగా స్వయం సహాయక బృందాలకు మోదీ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. కాగా రైతులకు కేంద్రం ఏటా మూడు విడతల్లో రూ.6వేలు నగదు సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే.

News June 18, 2024

మేడిగడ్డలో 93 లక్షల టన్నుల ఇసుక మేట

image

TG: మేడిగడ్డ బ్యారేజీ మునక ప్రాంతంలో దాదాపు 93 లక్షల టన్నుల ఇసుక మేటలు ఉన్నట్లు ఖనిజాభివృద్ధి శాఖ గుర్తించింది. మొత్తం 14 బ్లాకుల్లో ఉన్న ఇసుకను తొలగించి విక్రయించనుంది. త్వరలోనే దీనికి సంబంధించిన టెండర్లను జారీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కుంగిన మేడిగడ్డను రిపేర్ చేసేందుకు ఇసుక మేటలు అడ్డుగా ఉన్నాయని, గోదావరికి వరద నీరు వచ్చేలోపు ఆ ఇసుకను తొలగించనున్నట్లు స్పష్టం చేశాయి.

News June 18, 2024

YSR పేరు తొలగింపు.. ఇక NTR హెల్త్ యూనివర్సిటీ

image

APలోని హెల్త్ యూనివర్సిటీకి YSR పేరును తొలగించనున్నారు. 2019 ముందు నాటి పథకాలకు పాత పేర్లు పెట్టాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు YSR పేరును తొలగిస్తారు. అలాగే హెల్త్ యూనివర్సిటీకి YSR పేరును తీసేసి, గతంలో ఉన్న NTR పేరును పెట్టనున్నారు. దేశంలోనే మొదటి హెల్త్ యూనివర్సిటీగా దీనికి గుర్తింపు ఉంది.

News June 18, 2024

మేడారంలో ప్లాస్టిక్ నిషేధం

image

TG: ఈ ఏడాది జరిగిన మేడారం జాతరలో విపరీతమైన ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయిన నేపథ్యంలో ఆలయ పూజారుల సంఘం చర్యలకు దిగింది. మేడారంలో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులను వినియోగించవద్దని నిర్ణయిస్తూ దుకాణాల యజమానులకు సూచించింది. భూమిలో సులభంగా కరిగిపోయే బయోడిగ్రేడబుల్ సంచులను వాడాలని తెలిపింది. వ్యాపారులు ప్లాస్టిక్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

News June 18, 2024

100 రోజుల్లో 46 లక్షల మందికిపైగా దర్శనం

image

TG: యాదాద్రికి సమీపంలో నిర్మించిన స్వర్ణగిరికి వంద రోజుల్లో రూ.12.49 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఛైర్మన్ రామారావు తెలిపారు. ఆలయ ప్రతిష్ఠ జరిగిన తర్వాత నుంచి 46 లక్షలకు పైగా భక్తులు స్వర్ణగిరిశుడిని దర్శించుకున్నట్లు పేర్కొన్నారు. రోజుకు 70వేల మంది స్వామివారి దర్శనానికి వస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో టైం స్లాట్స్ దర్శనాలు ఏర్పాటు చేస్తామన్నారు.

News June 18, 2024

నేడు పీజీఈసెట్ ఫలితాలు

image

TG: నేడు పీజీఈసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేస్తారు. ఎంఈ, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఈ పరీక్షకు 20,626 మంది హాజరయ్యారు. ఫలితాలను https://pgecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

News June 18, 2024

టాలీవుడ్ నాకు ప్రత్యేకం: పూజా హెగ్డే

image

ఒక ఐడెంటిటీని తీసుకొచ్చిన టాలీవుడ్ అంటే తనకు ప్రత్యేకమని హీరోయిన్ పూజా హెగ్డే చెప్పారు. ఎన్ని భాషల్లో నటించినా తెలుగులో అవకాశం వస్తే ఎక్కువగా సంతోషిస్తానని తెలిపారు. నటనకు ప్రాంతీయ బేధం లేదని, ఏ భాషలోనైనా తనకు కంఫర్ట్‌గానే ఉంటుందని పేర్కొన్నారు. త్వరలోనే తెలుగులో ఓ మంచి సినిమాలో నటిస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ సూర్య సరసన ఓ చిత్రంలో నటిస్తున్నారు.

News June 18, 2024

ఇజ్రాయిల్ ప్రభుత్వానికి నిరసన సెగ

image

ఇజ్రాయిల్‌లో నెతన్యాహు బెంజామిన్ ప్రభుత్వానికి నిరసన సెగ తగిలింది. పాలస్తీనా నుంచి బందీలను విడిపించే చర్చల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వేలాది మంది ఇజ్రాయిల్ వాసులు రోడ్డెక్కారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌కు దిగారు. పీఎం నెతన్యాహు చర్యలతో ఇజ్రాయిల్ నాశనం దిశగా వెళ్తోందని ఆరోపించారు. కాగా హమాస్-ఇజ్రాయిల్ యుద్ధంలో ఈ దేశ వాసులు 1,194 మంది మరణించినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి.

News June 18, 2024

సిక్కోలు ప్రజల కల నిజమైంది: రామ్మోహన్ నాయుడు

image

AP: తాను కేంద్ర మంత్రి కావడంతో సిక్కోలు ప్రజల కల నిజమైందని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. జిల్లా సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పారు. కేంద్ర మంత్రి అయినా తన స్వభావం మారదని శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన ఆత్మీయసభలో ఆయన మాట్లాడారు. కష్టనష్టాల్లో జిల్లా ప్రజలు తనకు అండగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య ఎదురైనా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.