India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్రంలోని 1,497 గ్రామాలకు RTC బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రద్దు చేసిన బస్సుల్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. 2014-15 నాటికి RTCలో 10,479 బస్సులు ఉండగా, 2024 నాటికి 8,574 మాత్రమే ఉన్నాయి. బస్సులు తక్కువగా ఉండడం, అనూహ్యంగా ప్రయాణికులు పెరగడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో కొత్త బస్సుల్ని తీసుకొస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని పలువురు సూచిస్తున్నారు.
T20 WCలో నేడు కెనడాతో జరిగే మ్యాచులో టీమ్‌ఇండియా పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు బెంచ్‌కే పరిమితమైన జైస్వాల్, శాంసన్, కుల్దీప్, చాహల్‌లో ఎవరైనా ముగ్గురిని ఆడించొచ్చని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓపెనర్‌గా జైస్వాల్‌ను, మూడో స్థానంలో కోహ్లీని, జడేజా స్థానంలో కుల్దీప్, దూబే స్థానంలో శాంసన్, సిరాజ్ స్థానంలో చాహల్‌ను ఆడించే అవకాశం ఉందని అంటున్నారు.
AP: అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. వైసీపీకి అంటకాగి కళంకితులుగా పేరు తెచ్చుకున్న అధికారులను దూరంగా పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమర్థ అధికారులు, నిబంధనల ప్రకారం పనిచేసే వారికే కీలక పోస్టింగ్స్ ఇచ్చే యోచనలో ఉన్నారు. అన్ని విభాగాల్లో పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలని CBN భావిస్తున్నారు.
న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌతీ అరుదైన ఘనత సాధించారు. టీ20 వరల్డ్ కప్‌లో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన తొలి బౌలర్‌గా ఆయన రికార్డులకెక్కారు. ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో సౌతీ 3/4 రాణించారు. అతడి తర్వాత ఉగాండా స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా (2/4) ఉన్నారు. పపువా న్యూగినియాపై ఆయన ఈ ఘనత సాధించారు. కాగా టీ20 ప్రపంచ కప్‌లో అత్యధిక మెయిడెన్ ఓవర్లు వేసిన బౌలర్‌గానూ సౌతీ (3) నిలిచారు.
సౌతాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో నేపాల్ ఓడిపోయింది. ఈక్రమంలో స్టేడియంలో ప్లకార్డుతో ఉన్న ఓ నేపాల్ అభిమాని ఫొటో వైరలవుతోంది. ‘ప్యాషన్ ఎంతటి దూరాన్నైనా దగ్గర చేస్తుంది. నేపాల్‌కు సపోర్ట్ చేసేందుకు 16,287 కిలో మీటర్లు ప్రయాణించా. ఎందుకంటే కొన్ని కలలకు ప్రతి మైలు విలువైనదే’ అని ప్లకార్డులో ఉంది. ‘నేపాల్ టీమ్ పోరాటం చూసి ప్రపంచం గర్విస్తోంది’ అని రాజస్థాన్ రాయల్స్ టీమ్ ట్వీట్ చేసింది.
టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజీ నుంచి సూపర్-8కు చేరిన ఏడో అసోసియేట్ జట్టుగా USA చరిత్ర సృష్టించింది. వర్షం కారణంగా ఐర్లాండ్‌తో మ్యాచ్ రద్దవడంతో USA నేరుగా సూపర్-8కు చేరుకుంది. అంతకుముందు ఐర్లాండ్ (2009), నెదర్లాండ్స్ (2014), అఫ్గానిస్థాన్ (2016), నమీబియా (2021), స్కాట్లాండ్ (2021), నెదర్లాండ్స్ (2022) ఉన్నాయి. కాగా 2026లో ఇండియా, శ్రీలంకలో జరిగే T20 WCకు కూడా USA అర్హత సాధించినట్లు తెలుస్తోంది.
AP: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణకు తీసుకొచ్చిన ‘స్పందన’ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్పందన పేరు తొలగించి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ పేరుతో ఫిర్యాదులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2024-25 ఎగ్జామినేషన్ <
తిరుమల శ్రీవారి ఆలయంలోని ఏర్పాట్లపై భక్తులు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్, అన్నప్రసాదం, లడ్డూల నాణ్యత సరిగా లేకపోవడం ఎంతో ఇబ్బందికరంగా ఉందంటున్నారు. ఏడుకొండలపై అన్యమతస్థులు పెరిగిపోయారని వారిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్నిసార్లు క్యూకాంప్లెక్సుల్లో ఉచిత భోజనాలు ఇవ్వట్లేదని వాపోతున్నారు. మరి తిరుమలలో మీకెదురైన సమస్య ఏంటో కామెంట్ చేయండి.
ఈనెల 18న జరిగే UGC NET 2024 అడ్మిట్ కార్డులను NTA విడుదల చేసింది. https://ugcnet.nta.ac.in/లో అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి హాల్ టికెట్లను <
Sorry, no posts matched your criteria.