India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈరోజు AP CM చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. అయితే 2004 మే 14న LB స్టేడియంలో ఉమ్మడి AP CMగా YSR ప్రమాణ స్వీకారం చేసి ఆ వేదికపైనే రైతులకు ఫ్రీ కరెంట్‌పై తొలి సంతకం చేశారు. అప్పట్నుంచి ఈ ‘తొలి సంతకం’ ట్రెండ్ నడుస్తోంది. అంతకు ముందు ఇప్పుడున్నంత క్రేజ్ ఉండేది కాదు. కాగా మొన్న PM మోదీ ‘PM కిసాన్ నిధి’పై, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల అమలుపై తొలి సంతకం చేశారు.
AP: మంత్రులకు శాఖల కేటాయింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మంత్రుల శాఖలను ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఎవరికి ఏ శాఖ ఇస్తారోనని టీడీపీ, జనసేన, బీజేపీ కేడర్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ శాఖలపై జోరుగా చర్చ జరుగుతోంది. వీటన్నింటికి కాసేపట్లో తెరపడనుంది.
తన 17ఏళ్ల అనుభవం కనిపెట్టలేని వ్యాధిని పనిమనిషి 10 సెకన్లలో గుర్తించిందని కేరళ వైద్యుడు డా.ఫిలిప్స్ తనకు ఎదురైన వింత అనుభవాన్ని పంచుకున్నారు. ‘వైరల్ హెపటైటిస్ నుంచి డెంగీ వరకు అన్ని టెస్టులు చేసినా ఫలితం లేకపోయింది. ఇంతలో మా పనిమనిషి వచ్చి అది ‘అంజామ్‌పనీ’ (5th డిసీజ్) అని, తన మనుమళ్లలో ఆ లక్షణాలు చూశానని చెప్పింది. వెంటనే పార్వోవైరస్ B19 టెస్ట్ చేస్తే పాజిటివ్ అని తేలింది’ అని Xలో పోస్ట్ చేశారు.
TG: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో మనీలాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది. మొత్తం రూ.700 కోట్ల అవినీతి జరిగిందని ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ కేసులో 10 మంది నిందితులను గుర్తించింది. దీంతో ఆ సంస్థ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. కాగా ఈ కేసు నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
AP: మంత్రి పదవి రాకపోవడంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. గత ప్రభుత్వంలో కొందరు అధికారులు ఓవర్ యాక్షన్ చేశారని మండిపడ్డారు. వారిని చంద్రబాబు క్షమించినా తాను క్షమించనని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలకోసం అనేక ఇబ్బందులు పడ్డానని తెలిపారు. ఏపీకి మంచి రోజులు వచ్చాయన్నారు.
భారత్-చైనా సరిహద్దు సమస్య జిన్‌పింగ్ సర్కారు ధోరణి కారణంగానే అపరిష్కృతంగా ఉండిపోయిందని అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి కర్ట్ క్యాంప్‌బెల్ అన్నారు. ఇరు దేశాలూ ఎప్పటికైనా వాటి ఉమ్మడి ప్రయోజనాలను గుర్తిస్తాయని, ఆ రోజున కలిసి పనిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాంటి సమయంలో తాము కచ్చితంగా మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు. ప్రాదేశిక అంశాల్లో చైనా పట్టువిడుపుతో ఉండాలని ఈ సందర్భంగా కర్ట్ సూచించారు.
తన కాలికి నెల రోజుల క్రితమే గాయమైందని, ఇప్పటికీ తగ్గలేదని వరుణ్ సతీమణి లావణ్య త్రిపాఠి చెప్పారు. అయితే ఎలాంటి ఆందోళన అవసరం లేదని అభిమానులకు తెలిపారు. నిన్న కాలుకు గాయమైందని ఆమె <<13425501>>పోస్ట్<<>> చేయగా ఏమైందని మెగా ఫ్యాన్స్ కామెంట్ల రూపంలో ప్రశ్నించారు. మెట్లు ఎక్కుతుండగా చీలమండ మడత పడిందని, తాజాగా వైద్యపరీక్షల్లో ఈ విషయం తేలినట్లు మెగా కోడలు పేర్కొన్నారు. విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలిపారు.
పంచ్.ఈవీ, నెక్సాన్.ఈవీ మోడల్స్ భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (భారత్-NCAP) సేఫ్టీ రేటింగ్‌లో ఫైవ్ స్టార్ సాధించినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. ఈవీ కేటగిరీలో తొలి ఫైవ్ స్టార్ రెటింగ్ అందుకున్న మోడల్స్‌గా పంచ్, నెక్సాన్ నిలిచాయని తెలిపింది. పెద్దల సేఫ్టీలో పంచ్ 32కి 31.46 పాయింట్లు, నెక్సాన్ 29.86/32 సాధించాయి. ఇక చైల్డ్ సేఫ్టీలో పంచ్ 45/49, నెక్సాన్ 44.95/49 నమోదు చేశాయి.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న ‘దేవర’ మూవీ రిలీజ్ డేట్ మారింది. తొలుత అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్ తాజాగా రెండు వారాలు ముందుగానే సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ నుంచి వాయిదా పడటం దాదాపు ఖాయమవడంతో ‘దేవర’ మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కర్ణాటక మాజీ సీఎం <<13432369>>యడియూరప్ప<<>>కు బెంగళూరు కోర్టు షాక్ ఇచ్చింది. పోక్సో కేసులో ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.