India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యెమెన్ తీర ప్రాంతంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. వలసదారుల పడవ మునిగి 49 మంది సోమాలియన్లు, ఇథియోపియన్లు మరణించినట్లు యూఎన్ అంతర్జాతీయ శరణార్థుల సంస్థ తెలిపింది. మరో 140 మంది గల్లంతవగా, 71 మందిని కాపాడినట్లు పేర్కొంది. మరణించిన వారిలో 31 మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారని వెల్లడించింది.
ఫుట్‌బాల్, NFLతో సహా స్పోర్ట్స్ ఈవెంట్స్‌లో భారీ మొత్తంలో బెట్టింగ్ పెట్టే కెనడియన్ రాపర్ డ్రేక్ మొన్న జరిగిన INDvsPAK మ్యాచ్‌పై ఆసక్తి చూపారు. పాకిస్థాన్‌పై భారత్ గెలుస్తుందని £510,000 పందెం వేసినట్లు డ్రేక్ ఇన్‌స్టాలో వెల్లడించారు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపొందడంతో అతడికి £715,000 (రూ. 7.58 కోట్లు) వచ్చాయని, రూ. 2.16 కోట్ల లాభం పొందినట్లు స్థానిక మీడియా తెలిపింది.
ఒడిశాలో మరికొద్ది గంటల్లో BJP ప్రభుత్వం కొలువుదీరనుంది. అయితే నూతన సీఎం ఉండేందుకు నివాసం లేదు. గత 24ఏళ్లు సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ తన ఇంటి నుంచే కార్యకలాపాలు సాగించారు. అంతకు ముందు సీఎంలు సైతం భువనేశ్వర్ క్లబ్ సమీపంలోని ఓ చిన్న భవనంలో కార్యకలాపాలు సాగించారు. దీంతో నూతన సీఎం తాత్కాలికంగా ఉండేందుకు స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంది.
దేశీయ మార్కెట్‌లో 2030 కల్లా 18-20% వాటాను దక్కించుకోవాలని టాటా మోటార్స్ ఆకాంక్షిస్తోంది. 2023-24 FYలో 14 శాతం మార్కెట్ వాటాతో దేశంలో మూడో అతిపెద్ద ప్రయాణికుల వాహనాల అమ్మకందారుగా టాటా మోటార్స్ నిలిచింది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. నూతన మోడళ్లను తీసుకురావడం, వ్యూహాత్మక వాణిజ్య ప్రణాళికలు, EV మార్కెట్ విస్తరణ ద్వారా తన లక్ష్యాలను చేరుకోవాలని సంస్థ భావిస్తోంది.
AP: విజయవాడలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. రేపు ఉదయం 11.27 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలిశారు. అలాగే కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేసే వారి వివరాలను కూడా గవర్నర్‌కు CBN అందించినట్లు సమాచారం.
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తోన్న ‘సరిపోదా శనివారం’ నుంచి అప్డేట్ వచ్చింది. సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘గరం గరం’ సాంగ్‌ను ఈనెల 15న శనివారం రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పాన్ ఇండియా ఫిల్మ్‌లో సూర్య పాత్రలో మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ పవర్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో నాని కనిపించనున్నారు. ఆగస్టు 29న సినిమా రిలీజ్ కానుంది.
క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ, మరో ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ తమ కుటుంబాలతో కలిసి పారిస్‌లో విహరిస్తున్నారు. వారు ఈఫిల్ టవర్ వద్ద దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లోనూ ధోనీ మెరిశారు. కాగా టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యుల భారత జట్టులో అశ్విన్‌కు చోటు దక్కలేదు.
ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా <<13417665>>విమాన<<>> ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ అధ్యక్షుడు లజరాస్ చెఖ్వీరా టీవీ ప్రకటనలో తెలిపారు. పర్వత శ్రేణుల్లో విమానం కుప్పకూలినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో 9 మంది మరణించినట్లు పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.
నటుడు అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య, కోలీవుడ్ హీరో ఉమాపతి వివాహబంధంతో ఒక్కటయ్యారు. చెన్నైలో ఇవాళ వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలను వారు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. కాగా వీరిద్దరూ కొన్నాళ్లు ప్రేమించుకున్న తర్వాత గతేడాది అక్టోబర్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు ఏడడుగులు నడిచారు.
AP EAPCET ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో గుంటూరుకు చెందిన మాకినేని జిష్ణుసాయి తొలి ర్యాంక్ సాధించారు. కర్నూలుకు చెందిన మురసాని యశ్వంత్ రెడ్డి 2వ ర్యాంక్, ఆదోనికి చెందిన బోగాలపల్లి సందేశ్ 3, అనంతపురానికి చెందిన సతీశ్ రెడ్డి 4, గుంటూరుకు చెందిన కోమటినేని మనీశ్ 5వ ర్యాంక్ సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,95,092 మంది, అగ్రికల్చర్ విభాగంలో 70,352 మంది అర్హత సాధించారు.
Sorry, no posts matched your criteria.