news

News June 7, 2024

PIC OF THE DAY

image

ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని మోదీ రాష్ట్రపతిని కోరారు. ఈ సందర్భంగా మోదీకి అభినందనలు తెలిపిన ద్రౌపదీ ముర్ము.. ఆయనకు తియ్యటి పెరుగు తినిపించారు. సంప్రదాయబద్ధంగా ఈ పద్ధతి కొనసాగుతూ వస్తోంది. ఇది PIC OF THE DAY అని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. గతంలో మోదీకి అప్పటి రాష్ట్రపతి కోవింద్ స్వీట్ తినిపించారు.

News June 7, 2024

ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న గెలుపు

image

TG: నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ బలపరిచిన తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్) విజయం సాధించారు. రెండు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో మల్లన్నకి బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. చివరి దశలో బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్‌తో మల్లన్న, రాకేశ్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. చివరికి BRS అభ్యర్థి ఎలిమినేషన్‌తో మల్లన్న గెలిచారు.

News June 7, 2024

BREAKING: మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

image

దేశ ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. రాష్ట్రపతి భవన్ వేదికగా ఎల్లుండి రాత్రి 7.15 గంటలకు ఆయన ప్రమాణం చేయనున్నారు. పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేస్తారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశీ ప్రముఖులు రానుండటంతో 2,500 మంది పోలీసులతోపాటు 5 కంపెనీల పారామిలిటరీ దళాలు బందోబస్తు నిర్వహించనున్నాయి.

News June 7, 2024

BRSకు చెక్ పెట్టేందుకు TDP ఎత్తుగడ?

image

తెలంగాణలో BRS స్థానాన్ని భర్తీ చేసేందుకు TDP ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓటమితో కారు పార్టీ డీలాపడగా.. తెలంగాణలో బలపడేందుకు చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కార్యకర్తలు TDPతోనే ఉన్నందున BRSలోని కొంతమంది నేతలను తిరిగి పార్టీలోకి రప్పించేందుకు కృషి చేస్తున్నట్లు టాక్. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని TDP నిర్ణయించిన సంగతి తెలిసిందే.

News June 7, 2024

మోదీకి కంగ్రాట్స్.. హిందీలో పీటర్సన్ ట్వీట్

image

ప్రధాని మోదీకి ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ పీటర్సన్ అభినందనలు తెలిపారు. మూడోసారి ప్రధాని కానున్న ఆయనకు కంగ్రాట్స్ చెబుతూ హిందీలో ట్వీట్ చేశారు. ‘భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా అది గమనిస్తున్నా. అద్భుతం’ అంటూ మోదీపై ప్రశంసలు కురిపించారు.

News June 7, 2024

హిందూపురంలో ‘అఖండ 2’ ఓపెనింగ్?

image

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘అఖండ 2’ మూవీపై ఇంట్రెస్టింగ్ రూమర్ వైరల్ అవుతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలను హిందూపురంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తైనట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందట. షూటింగ్ కోసం అరకు, కొచ్చి లాంటి ప్రదేశాలను మూవీ యూనిట్ పరిశీలించినట్లు టాక్. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించనున్నారు.

News June 7, 2024

ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది: YS జగన్

image

ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలు కూలిపోయాయని జగన్ ట్వీట్ చేశారు. ‘చంద్రబాబు కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. వైసీపీ నేతలపై ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు. గత ఐదేళ్లలో సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బ తీశారు. 3 రోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా’ అని తెలిపారు.

News June 7, 2024

BREAKING: ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించగా, పలువురు గాయపడ్డారు. పోలీసులు, మావోల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.

News June 7, 2024

టీచర్ల బదిలీ, పదోన్నతుల షెడ్యూల్ విడుదల

image

TG: రాష్ట్రంలో టీచర్ల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మల్టీ జోన్-1లో ఈనెల 22 వరకు, మల్టీ జోన్-2లో ఈనెల 30 వరకు ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్లు చేపట్టనుంది. పదవీ విరమణకు 3 ఏళ్లలోపు ఉన్నవారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపునిచ్చింది. కోర్టు కేసులతో గతంలో ఆగిపోయిన దగ్గరి నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. TETతో సంబంధం లేకుండానే పదోన్నతులు కల్పించనుంది.

News June 7, 2024

369 మంది పోటీ.. 311 మంది డిపాజిట్ గల్లంతు

image

ఈ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని 29 MP స్థానాలనూ గెలుచుకుని BJP రికార్డు సృష్టించింది. గత 40 ఏళ్లలో ఆ రాష్ట్రంలో ఇలా జరగడం ఇదే తొలిసారి. మొత్తం 369 మంది పోటీ చేయగా 311 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇండోర్‌లో బీజేపీ నేత శంకర్ లల్వానీ రికార్డు స్థాయిలో 11.75 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. మిగిలిన అన్ని చోట్లా నాయకులు లక్ష నుంచి 5 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.