news

News March 19, 2024

మోదీ ప్రచారంలో పిల్లలు.. ఈసీ సీరియస్

image

తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ప్రధాని మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. అయితే, మోదీ ప్రచారంలో రోడ్డుపై విద్యార్థులను మొహరించడంపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. వార్తాపత్రికల్లో దీనిపై కథనాలొచ్చాయని, ఎన్నికల ప్రచారంలో పిల్లలను తీసుకురావడం చట్టరీత్యా నేరమని ఈసీ తెలిపింది. హెడ్ మాస్టర్‌తో పాటు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో జిల్లా విద్యాశాఖ అధికారి వివరణ ఇవ్వాలన్నారు.

News March 19, 2024

మీరు చూపిన ప్రేమ, ఆప్యాయతకు ధన్యవాదాలు: తమిళి సై

image

తెలంగాణ, పుదుచ్చేరి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాలకు మాజీ గవర్నర్ తమిళి సై కృతజ్ఞతలు తెలిపారు. ‘తెలంగాణ & పుదుచ్చేరికి చెందిన సోదర, సోదరీమణులు, తల్లులు, పెద్దలు నాపై చూపిన ప్రేమ, ఆప్యాయతకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని ఆమె ట్వీట్ చేశారు. తమిళి సై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

News March 19, 2024

నేరుగా OTTలోకి భారీ యాక్షన్ చిత్రం

image

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన రెబల్ మూన్-పార్ట్-2: ది స్కార్‌గివర్ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జాక్ స్నైడర్ తెరకెక్కించిన పార్ట్-1 అభిమానులను ఆకట్టుకోగా.. పార్ట్-2ని కూడా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 19న విడుదల చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో కూడా ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.

News March 19, 2024

రూ.వేలకోట్ల నిధులు ఉన్న షిప్పు కోసం వేట మొదలైంది..!

image

‘ఎల్ డొరాడో ఆఫ్ ది సీస్’గా పిలిచే బ్రిటన్ నౌక ‘ది మర్చంట్ రాయల్’ ఆచూకీ కోసం మళ్లీ అన్వేషణ మొదలైంది. బంగారం, వెండి నిధులను తరలిస్తుండగా 1641 సెప్టెంబరు 23న కార్న్‌వాల్ తీరాన ఈ నౌక నీట మునిగింది. అప్పుడు షిప్పులోని నిధుల విలువ రూ.42వేల కోట్లని అంచనా. దీని ఆచూకీ కోసం ఎంతోమంది విఫలయత్నం చేశారు. తాజాగా మల్టీబీమ్ సర్వీసెస్ సంస్థ సోనార్ టెక్నాలజీ, మానవరహిత సబ్‌మెరైన్లతో అన్వేషణ చేపట్టేందుకు సిద్ధమైంది.

News March 19, 2024

VIRAL: కింగ్ కోహ్లీ న్యూలుక్

image

మరో మూడ్రోజుల్లో ఐపీఎల్‌ 17వ సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో ప్లేయర్లు అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆటతోనే కాకుండా తమ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. తాజాగా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ న్యూ లుక్‌ను ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. విరాట్ హాలీవుడ్ హీరోలా ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News March 19, 2024

చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత

image

టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ కోట్ల సుజాతమ్మ అనుచరులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆలూరుపై ఇటీవలి జాబితాలో టీడీపీ స్పష్టతనివ్వలేదు. మాజీ ఇన్‌ఛార్జ్‌లు వీరభద్ర గౌడ్, వైకుంఠం జ్యోతితో పాటు తాజాగా పార్టీలో చేరిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం కూడా ఆశావహుల్లో ఉన్నారు. దీంతో సుజాతమ్మ అనుచరుల్లో ఆందోళన నెలకొంది.

News March 19, 2024

పరువు హత్యా? ప్రియుడే చంపాడా?

image

TG: రంగారెడ్డి(D) దండుమైలారంలో ఇంజినీరింగ్ విద్యార్థిని భార్గవి(19) హత్య సంచలనంగా మారింది. శశి అనే యువకుడిని ప్రేమించినందుకు ఆమెను తల్లి కొట్టి చంపినట్లు భార్గవి సోదరుడు ఫిర్యాదు చేశాడు. మరోవైపు తమ కూతురికి బావతో పెళ్లి చేద్దామని నిర్ణయించడంతో తాము ఇంట్లో లేని సమయంలో శశి వచ్చి చంపేశాడని భార్గవి తండ్రి ఆరోపిస్తున్నాడు. దీంతో అమ్మాయి హత్యపై 2 కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News March 19, 2024

రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ

image

TG: సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. ‘రజాకార్’ సినిమాకు వినోదపు పన్ను రాయితీ ఇచ్చి, ప్రోత్సహించాలని అందులో కోరారు. విద్యార్థుల కోసం ప్రత్యేక షో వేయాలన్నారు. కాగా తెలంగాణలో రజాకార్ల అకృత్యాల ఆధారంగా చిత్రీకరించిన ‘రజాకార్’ ఇటీవల థియేటర్లలో విడుదలైంది.

News March 19, 2024

సాయంత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ అప్డేట్

image

హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ నుంచి ఇవాళ సాయంత్రం 4.45 గంటలకు అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘ఆశ్చర్యపోవడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవల పవన్ డబ్బింగ్ చెబుతున్నట్లుగా ఫొటో బయటికొచ్చిన నేపథ్యంలో.. మూవీ టీజర్ లేదా గ్లింప్స్ రిలీజ్ చేసే అవకాశం ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News March 19, 2024

రెండు రాష్ట్రాలకు DGPలుగా బ్రదర్స్

image

ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఉన్నత ఉద్యోగాలు సాధించడం మనం చూశాం. తాజాగా ఇద్దరు సోదరులు రెండు రాష్ట్రాలకు DGPలుగా ఎంపికై చరిత్ర సృష్టించారు. గుజరాత్‌ డీజీపీగా వికాస్ సాహే ఏడాదిగా పనిచేస్తుండగా, బెంగాల్‌కు వివేక్ సాహేను పోలీస్ బాస్‌గా నిన్న ప్రభుత్వం నియమించింది. కాగా వారి మరో సోదరుడు విక్రమ్ సాహే IRS అధికారిగా పనిచేస్తుండటం విశేషం.

error: Content is protected !!