India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని YS జగన్ నిర్ణయించడంతో గతంలో NTR, YSR, CBN కూడా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారని రాజకీయ వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. NTR 1993లో, 1995లో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. 1999-2004 మధ్య YSR కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చివరి రెండేళ్లు సమావేశాలకు వెళ్లలేదు. 2014 తర్వాత జగన్, 2021లో చంద్రబాబు CM అయ్యాకే సభకు వస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఫిన్‌టెక్ సంస్థలు కస్టమర్ల ప్రొఫైల్‌ను రూపొందించడం కోసం పాన్ సమాచారాన్ని వాడుతుండటంతో ఆర్థిక మోసాల కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాన్‌కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని కేంద్రం సూచించింది. ఇందుకు డిసెంబర్ 31 వరకు గడువునిచ్చింది. లింక్ చేయని పక్షంలో పాన్ కార్డు డీయాక్టివేట్ అవుతుంది. మళ్లీ యాక్టివేట్ చేయడం కూడా కష్టమవుతుంది. ఇన్‌కం ట్యాక్స్ వెబ్‌సైట్‌లో ఆధార్ లింక్ చేసుకోవచ్చు.

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ లీక్ కావడంపై దర్శకుడు తీవ్రంగా స్పందించారు. తన మూవీ టైటిల్‌ను లీక్ చేసినది తన టీమ్ వారు కాదన్నారు. తన సినిమానే అని కాకుండా ఎవరి మూవీలో ఏ లీక్ జరిగినా సినిమా కోసం కష్టపడే టీమ్‌పై నిందలు వేయడం మానేయాలన్నారు. యూనిట్‌ను నిందించే అలవాటు మానుకోవాలన్నారు. ఈ మూవీ టైటిల్ ‘ది ప్యారడైజ్’గా ఖరారైనట్లు గతంలో సినీ వర్గాలు పేర్కొన్నాయి.

భారత బ్యాటర్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నారు. ఇవాళ SAతో మ్యాచులో శతకం బాదితే T20Iల్లో హ్యాట్రిక్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలవనున్నారు. ఇప్పటివరకు 34 టీ20లు ఆడిన శాంసన్ 701 పరుగులు చేశారు. ఓపెనర్‌గా అవతారమెత్తాక గేర్ మార్చి పరుగుల వరద పారిస్తున్నారు.

చలికాలం దృష్ట్యా అయోధ్యలోని రామ్ లల్లాను వెచ్చని దుస్తులతో కప్పి ఉంచాలని ఆలయ నిర్వాహకులు భావించారు. ప్రత్యేక శాలువాలు, ఉన్ని దుస్తులతో ఆయనను అలంకరించాలని నిర్ణయించారు. వీటిని ఢిల్లీకి చెందిన ఓ డిజైనర్ రూపొందిస్తున్నారు. అలాగే వాతావరణంలో మార్పుల వల్ల ఆయనకు నివేదించే ప్రసాదంలోనూ మార్పులు చేస్తున్నారు. బాలరాముడికి డ్రై ఫ్రూట్స్, పూరీ, హల్వాను నివేదిస్తారు.

AP: అమరావతికి వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరల్డ్ బ్యాంకు, ఏడీబీ కలిపి రూ.15,000కోట్ల రుణం ఇస్తాయని పేర్కొంది. ఆర్థిక సాయం పొందేందుకు CRDAకు అధికారం కల్పించింది. బ్యాంకుల నుంచి దశలవారీగా నిధుల సమీకరణ కోసం ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయనుంది. ఈ నిధులతో రాజధాని అభివృద్ధి ప్రణాళికను అమలు చేయాలని CRDAను ఆదేశించింది.

అల్లు అర్జున్, రష్మిక జంటగా తెరకెక్కుతోన్న ‘పుష్ప-2’ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో ప్రత్యేక గీతం ‘కిస్సిక్’లో శ్రీలీల కనిపించనున్నట్లు పేర్కొంది. ఆమెకు స్వాగతం చెబుతూ ట్వీట్ చేసింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఈ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కానుంది.

AP: రాష్ట్రంలో గత 4 నెలల్లో 177 హత్యలు, 500కు పైగా హత్యాయత్నాలు జరిగాయని వైసీపీ ట్వీట్ చేసింది. 110 మందిపై అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయని, బాధితుల్లో 11 మంది హత్యకు గురయ్యారని పేర్కొంది. రాష్ట్రం రావణకాష్ఠంగా మారుతున్నా కూటమి ప్రభుత్వం కుంభ కర్ణుడిలా నిద్రపోతోందని విమర్శించింది.

పర్సనల్ లా చట్టాన్ని సవరించేందుకు ఇరాక్ పార్లమెంటు సిద్ధమవ్వడంపై హక్కుల సంఘాలు భగ్గుమన్నాయి. సవరణకు ఆమోదం లభిస్తే అమ్మాయిల పెళ్లి వయసు 9ఏళ్లకు తగ్గిపోతుంది. విడాకులు, పిల్లల కస్టడీ, వారసత్వ ఆస్తిపై మహిళలు హక్కులు కోల్పోతారు. ఇది చైల్డ్ సెక్స్‌ను చట్టబద్ధం చేయడమేనని, స్త్రీల పరిస్థితి అత్యంత దారుణంగా మారుతుందని దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అయినా షియా ప్రభుత్వం తగ్గేలా లేదు.

భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. చివరి 5 సెషన్లలోనే FPIలు రూ.20,000 కోట్లను వెనక్కి తీసుకున్నారు. ఈ డబ్బును ఎక్కువగా చైనా స్టాక్స్, US బాండ్స్, బిట్‌కాయిన్లలో పెడుతున్నారు. భారత స్టాక్స్ విలువలు గణనీయంగా పెరగడం, ప్రస్తుతం కన్సాలిడేషన్ దశకు చేరుకోవడం, చైనాలో స్టిములేషన్ స్కీమ్స్ అమలు ఇందుకు కారణాలు. Q3 రిజల్ట్స్ టైమ్‌లోFPIలు మళ్లీ తిరిగొస్తారని నిపుణుల అంచనా.
Sorry, no posts matched your criteria.