news

News November 10, 2024

ఉక్రెయిన్‌లో శాంతి కోసం ట్రంప్ సరికొత్త ప్రతిపాదన!

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత ట్రంప్ సరికొత్త ప్రణాళికను తెరపైకి తీసుకురానున్నారు. ది టెలిగ్రాఫ్ పత్రిక కథనం ప్రకారం.. ఆ రెండు దేశాలకు మధ్య ఐరోపా, బ్రిటిష్ బలగాల రక్షణలో 800 మైళ్ల మేర బఫర్ జోన్‌ను ఏర్పాటు చేస్తారు. రష్యా డిమాండ్‌ను గౌరవిస్తూ ఉక్రెయిన్ 20ఏళ్ల పాటు నాటో సభ్యత్వానికి దూరమవ్వాలి. అలా ఉన్నందుకు కీవ్‌కు అమెరికా భారీగా ఆయుధ సంపత్తిని సమకూరుస్తుంది.

News November 10, 2024

మోదీజీ.. సామాన్యులు సురక్షితంగా ఉండేది ఎప్పుడు?: రాహుల్

image

బిహార్‌లో రైలు ఇంజిన్, బోగీల మధ్య <<14569710>>చిక్కుకొని<<>> ఉద్యోగి చనిపోయిన ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘మోదీజీ.. మీ పాలనలో సామాన్యులు ఎప్పుడు సురక్షితంగా ఉంటారు? మీరేమో అదానీని రక్షించడంలో బిజీగా ఉన్నారు. ఈ భయానక చిత్రం రైల్వేలో సుదీర్ఘకాలంగా తాండవిస్తున్న నిర్లక్ష్యానికి, అంతంతమాత్రంగానే జరుగుతున్న నియామకాలకు నిదర్శనం’ అని ట్వీట్ చేశారు.

News November 9, 2024

28వ బిలియర్డ్స్ టైటిల్ గెలుచుకున్న పంకజ్ అద్వానీ

image

భారత బిలియర్డ్స్ ఆటగాడు పంకజ్ అద్వానీ రికార్డు స్థాయిలో 28వసారి బిలియర్డ్స్ టైటిల్ గెలుచుకున్నారు. దోహాలో జరిగిన IBSF ఛాంపియన్‌షిప్‌లో ఇంగ్లండ్‌కు చెందిన రాబర్ట్ హాల్‌ను 4-2 తేడాతో ఓడించారు. ఈ టైటిల్‌ను ఆయన వరుసగా ఏడోసారి గెలుచుకోవడం విశేషం. 2016లో అద్వానీ విజయ పరంపర మొదలైంది.

News November 9, 2024

ఐదేళ్లలో రెండే సెంచరీలా?: పాంటింగ్

image

టెస్టుల్లో టీమ్ ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో రెండే సెంచరీలు చేశారని గుర్తుచేశారు. ‘2019 నవంబరు తర్వాత విరాట్ కేవలం రెండే టెస్టు సెంచరీలు చేశారు. అది కచ్చితంగా ఆందోళనకరమే. ఇంకెవరైనా ఆటగాడయ్యుంటే అంతర్జాతీయ క్రికెట్ జట్టు దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. AUS పర్యటనలో ఆయన పుంజుకోవాలని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.

News November 9, 2024

చంద్రబాబు, లోకేశ్‌ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?: జగన్

image

AP: రెండేళ్ల క్రితం తన తల్లి విజయమ్మ కారు టైర్‌ బరస్ట్‌ అయితే, లేటెస్ట్‌గా అయినట్లు టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని వైఎస్ జగన్ అన్నారు. ఆమె రాసిన లేఖను ఫేక్ అని ప్రచారం చేశారని మండిపడ్డారు. అందుకే తన తల్లి వీడియో మెసేజ్ ఇచ్చి వారిని దుయ్యబట్టిందని ట్వీట్ చేశారు. ‘ఉద్దేశ పూర్వకంగా వ్యక్తిత్వ హననం చేసిన నిన్ను, నీ కొడుకును ఇదే పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదు?’ అని చంద్రబాబును ప్రశ్నించారు.

News November 9, 2024

డాలర్‌ వాల్యూ పెరిగితే ఏం అవుతుంది?

image

డాలర్ విలువ పెరిగితే రూపాయి విలువ తగ్గుతుంది. దేశాల మధ్య లావాదేవీలు దాదాపు డాలర్లలోనే జరుగుతుంటాయి. అందుకే వస్తువుల ఎగుమతి/దిగుమతుల కోసం భారత్ సహా చాలా దేశాలు డాలర్లను నిల్వ చేసుకుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్లకు డిమాండ్ పెరిగితే మనం ఎక్కువ రూపాయలు చెల్లించి వాటిని కొనుక్కోవాల్సి వస్తుంది. మన ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువగా ఉంటే రూపాయి పడిపోతుంది. డాలర్ నిల్వలు ఖర్చవుతాయి.

News November 9, 2024

ప్రభాస్.. 3 సినిమాలకు రూ.650 కోట్లు?

image

కన్నడ నిర్మాణ సంస్థ హోంబలేతో ప్రభాస్ 3 సినిమాలకు అగ్రిమెంట్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందానికి గాను ఆయన రూ.650 కోట్లు తీసుకోనున్నట్లు సినీ ఇండస్ట్రీలో ప్రచారం నడుస్తోంది. సలార్ 2, ప్రశాంత్ వర్మ, లోకేశ్ కనగరాజ్‌లతో తీసే సినిమాలకుగాను ఈ డీల్ ఓకే అయినట్లు సమాచారం. కాగా రెబల్ స్టార్ రాజాసాబ్ చిత్రీకరణ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. తదనంతరం సలార్ 2 షూట్ ప్రారంభించనున్నారు.

News November 9, 2024

తెలుగు టైటాన్స్ మరో విజయం

image

ప్రో కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచుల్లో ఐదు విజయాలు నమోదు చేసింది. ఇవాళ పుణెరి పల్టాన్స్‌తో జరిగిన మ్యాచులో 34-33 తేడాతో విజయం సాధించింది. TTలో విజయ్ మాలిక్ 13, కెప్టెన్ పవన్ షెరావత్ 12 పాయింట్లు సాధించారు.

News November 9, 2024

సీఎం రేవంత్, కోమటిరెడ్డిపై BRS ఫిర్యాదు

image

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ కుక్క చావు చస్తారని సీఎం రేవంత్, KCRను ముక్కలు చేసి మూసీలో వేస్తామని వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. వారిని మంత్రి పదవుల నుంచి తొలగించి, అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందజేశారు.

News November 9, 2024

సంజూ.. మరో రోహిత్ శర్మ!

image

బోలెడంత టాలెంట్. అరకొర అవకాశాలు. ఛాన్స్ వచ్చినప్పుడు పేలవ ప్రదర్శన. మొన్నటి వరకు సంజూ శాంసన్ తీరిది. మిడిల్, లోయర్ ఆర్డర్‌లో ఫెయిల్ అయిన ఈ కేరళ స్టార్.. ఓపెనర్‌గా మారి పరుగుల వరద పారిస్తున్నారు. టీ20ల్లో వరుసగా 2 సెంచరీలతో సత్తా చాటారు. రోహిత్ కూడా కెరీర్ ప్రారంభంలో ఇబ్బంది పడినా.. 2013లో ఓపెనర్ అవతారం ఎత్తి వరల్డ్ క్లాస్ బ్యాటర్ అయ్యారు. మరి భవిష్యత్తులో సంజూ రోహిత్ స్థానాన్ని భర్తీ చేస్తారా?