India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టిన ‘ఓపెన్ హైమర్’ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవల జియో సినిమాలో హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనే స్ట్రీమింగ్ అవ్వగా.. తాజాగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. జియో సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారు సినిమాను ఉచితంగా చూడవచ్చు. అణు బాంబు సృష్టికర్త ఓపెన్ హైమర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఏడు ఆస్కార్ అవార్డులు వచ్చాయి.
F2, F3 చిత్రాల తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వెంకటేశ్ మరో సినిమా చేయనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ మూవీ షూటింగ్ మే చివర్లో లేదా జూన్ మొదటి వారంలో ప్రారంభం కానుందని సమాచారం. హీరోయిన్‌గా త్రిష, మృణాల్ ఠాకూర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తారని, వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుందని టాక్.
బార్లీ నీళ్లు తాగితే మలబద్దకం, గ్యాస్, తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గ్లాస్ బార్లీ నీళ్లలో ఉప్పు, చక్కర కలుపుకుని తాగితే శరీరంలో నీటి నిల్వలు కోల్పోకుండా ఉంటాయని, వడదెబ్బ తగలదని తెలిపారు. బార్లీలోని పీచు చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి బరువును తగ్గిస్తుందని పేర్కొన్నారు. మూత్ర నాళ ఇన్ఫెక్షన్లు, గర్భిణుల్లో కాళ్ల వాపు సమస్యలను ఇది దూరం చేస్తుందని అంటున్నారు.
AP: ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీజీఈసెట్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు ఏప్రిల్ 20లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 29, 30 తేదీల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. పూర్తి వివరాల కోసం <
AP: NTR(D) పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయంలో చిన తిరునాళ్లు రేపటి నుంచి నిర్వహించనున్నారు. 29వ తేదీ వరకు జరిగే ఈ వేడుకకు ఏపీ, తెలంగాణ నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. రేపు ఉదయం 6 గంటలకు అఖండజ్యోతి స్థాపనతో తిరునాళ్లు ప్రారంభం కానుండగా.. 26న రథోత్సవం, తిరుపతమ్మ, గోపయ్య స్వాములను గ్రామంలో ఊరేగిస్తారు. 27న దివ్యప్రభోత్సవం, 28న పసుపు కుంకుమ బండ్ల ఉత్సవం, 29న బోనాల సమర్పణతో తిరునాళ్లు ముగుస్తాయి.
TG: 8,180 గ్రూప్-4 భర్తీలో రోస్టర్ విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త రోస్టర్ విధానం, మహిళలకు రోస్టర్ పాయింట్ లేకుండా ఖాళీల వివరాలను TSPSC వెబ్‌సైటులో పొందుపరిచారు. గతంలో విధించిన రోస్టర్ విధానాన్ని ఉపసంహరించారు. ఏ జిల్లాలో ఏ కేటగిరీకి ఎన్ని ఉద్యోగాలు దక్కుతాయి? వంటి వివరాలను విడుదల చేశారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ <
యూపీ మదర్సా చట్టం(2004) రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. మదర్సా బోర్డు అధికారాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదోపవాదాల అనంతరం కోర్టు తాజా తీర్పుచెప్పింది. ‘ఈ చట్టం లౌకికవాదానికి విరుద్ధం. మదర్సాల్లో చదివే పిల్లల్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. అందుకు తగిన చర్యల్ని ప్రభుత్వం తీసుకోవాలి. అవసరమైతే పాఠశాలల్లో సీట్ల సంఖ్యను పెంచాలి’ అని ఆదేశించింది.
వచ్చే విద్యా సంవత్సరంలో(2024-25) 3, 6 తరగతులకు సిలబస్ మారనుందని సీబీఎస్ఈ వెల్లడించింది. మిగిలిన తరగతుల సిలబస్‌లో మార్పులు ఉండవని స్పష్టం చేసింది. కొత్త సిలబస్‌తో పాటు పాఠ్య పుస్తకాలను త్వరలో విడుదల చేస్తామని NCERT సమాచారమిచ్చినట్లు పేర్కొంది. ఆరో తరగతిలో అదనంగా బ్రిడ్జి కోర్సు ఉంటుందని, స్కూళ్లన్నీ కొత్త సిలబస్‌ను అనుసరించాలని సూచించింది.
AP: విశాఖలో జరిగే IPL మ్యాచ్‌ల టికెట్లు ఇవాళ్టి నుంచి విక్రయించనున్నారు. ఈ నెల 31న CSK-DC, 3న KKR-DC మ్యాచ్‌లు జరగనుండగా.. ఏప్రిల్ 3 మ్యాచ్‌కు నేటి నుంచి, 31వ తేదీ మ్యాచ్‌కు ఈ నెల 27 నుంచి టికెట్లు లభ్యమవుతాయి. పేటీఎం, ఏటీఎం ఇన్‌సైడర్ వెబ్‌సైట్ల నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేయవచ్చు. ఇలా కొన్న వాటిని పీఎం పాలెంలోని వైఎస్ఆర్ స్టేడియం బి గ్రౌండ్‌లో రీడిమ్ చేసి టికెట్లు పొందవచ్చు.
అక్కినేని నాగార్జున మరో మల్టీస్టారర్ సినిమా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తమిళ డైరెక్టర్ నవీన్‌తో ఆయన ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నారని, ఇందులో నాగ్‌తో పాటు మరో హీరో నటిస్తారని సినీవర్గాలు తెలిపాయి. జ్ఞానవేల్ రాజా నిర్మించనున్న ఈ మూవీ షూటింగ్ జులై నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌తో కలిసి ‘కుబేర’ అనే సినిమా చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.