India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరును పెంచారు. ఇప్పటికే చెన్నై, కేరళలో ఈవెంట్స్ నిర్వహించగా ఇప్పుడు హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. మల్లారెడ్డి కాలేజీలో డిసెంబర్ 1న ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇచ్చినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. సుకుమార్‌తో సహా చిత్ర బృందం పాల్గొంటుందని వెల్లడించాయి.

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేడు విపత్తు నిర్వహణ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడతారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏయే అధికారులకు ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి, ఎవరినెక్కడ మోహరించాలి, బాధితుల భద్రత, పునరావాసం, కేంద్ర రాష్ట్రాల బాధ్యతల్లో విభజన వంటివి ఇందులో నిర్వచిస్తారు. మరోవైపు రాజ్యసభలో ఇంట్రడక్షన్‌కు 44, ఆమోదం కోసం 5 బిల్లులను ప్రవేశపెడతారు.

సోషల్ మీడియాపై నియంత్రణ లేకపోవడంతో సెన్సిటివ్, అసభ్యకర పోస్టులనూ పిల్లలు చూసేస్తున్నారు. దీంతో వారి మానసిక స్థితి పూర్తిగా మారిపోతోంది. ఈక్రమంలో <<14737992>>ఆస్ట్రేలియా<<>> ప్రభుత్వం 16ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించొద్దని చట్టం తీసుకొచ్చింది. ఇండియాలోనూ ఇలాంటి చట్టం తీసుకురావాలని డిమాండ్ ఏర్పడింది. మొబైల్స్, సోషల్ మీడియా వల్ల పిల్లలు చదవట్లేదని, చెడు ఆలోచనలు వస్తున్నాయని నెట్టింట చర్చ జరుగుతోంది.

PM మోదీ పక్కన ఉన్న మహిళా కమాండో ఫొటో వైరల్ అయింది. BJP MP కంగన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పోస్ట్ చేయగా, ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకున్న SPG అంటూ నెట్టింట చర్చ జరిగింది. దీనిపై భద్రతా వర్గాలు స్పందించాయి. కొందరు మహిళా SPG కమాండోలు క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్‌లో ఉంటారని, ఈ లేడీ కమాండో SPG కాదంది. ఆమె రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అని, అలాగే CRPF అసిస్టెంట్ కమాండెంట్ అని వివరించింది.

IPL మెగా వేలంలో కొందరు స్టార్ ఆటగాళ్లు అమ్ముడుపోలేదు. వారితో ప్లేయింగ్ 11 క్రియేట్ చేస్తే బెస్ట్ టీమ్ ఇలా ఉంటుంది.
జట్టు: వార్నర్ (C), పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, బెయిర్‌స్టో, డారిల్ మిచెల్, సర్ఫరాజ్ ఖాన్, సికందర్ రజా, శార్దుల్ ఠాకూర్, పీయూష్ చావ్లా, ఉమేశ్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్.
>>మరి ఈ జట్టులో ఇంకా ఎవరు ఉంటే బాగుంటుందో కామెంట్ చేయండి.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.700 పెరిగి రూ.71,600కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.760 పెరగడంతో రూ.78,110 పలుకుతోంది. కేజీ సిల్వర్ రేట్ రూ.2,000 పెరిగి రూ.లక్షకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రూ.428కోట్లతో అభివృద్ధి చేసిన ఈ స్టేషన్‌లోని కొత్త శాటిలైట్ టెర్మినల్‌లో ఆధునిక సౌకర్యాలు, అన్ని ప్లాట్‌ఫారమ్‌లను కలుపుతూ 5 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు ఉంటాయన్నారు. మొత్తం 19 లైన్లలో 25 రైళ్ల జతలు రాకపోకలు కొనసాగించనున్నాయి. దీని వల్ల కాచిగూడ, HYD, SEC స్టేషన్లలో రద్దీ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందినా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు సూచీలకు అండగా నిలిచాయి. నిఫ్టీ 113 (24,038), సెన్సెక్స్ 325 (79,372) పాయింట్ల మేర ఎగిశాయి. మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల్లో కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. పవర్ గ్రిడ్, శ్రీరామ్ ఫిన్, ITC, TCS, TECH M టాప్ లూజర్స్. CIPLA, సన్ ఫార్మా, ADANI PORTS, M&M, BEL టాప్ గెయినర్స్.

ఐస్‌ల్యాండ్‌లోని సుంధున్‌కర్‌లో ఇటీవల బద్దలైన అగ్నిపర్వతం దృశ్యాలను అంతరిక్షం నుంచి నాసా చిత్రీకరించింది. సముద్రం పక్కన కొండపై ఎగిసి పడుతున్న ఎర్రటి లావా, పొగ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫొటో అద్భుతంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘NOV 24న తీసిన ఈ చిత్రం ఉష్ణ తీవ్రతను గుర్తించడానికి సహాయపడుతుంది. లావా నుంచి సల్ఫర్ డయాక్సైడ్ వాయువులు వెలువడ్డాయి’ అని నాసా పేర్కొంది.

TG: గుండెపోటుతో పదేళ్ల బాలిక మృతిచెందిన ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో చోటుచేసుకుంది. రోటిగూడ గ్రామానికి చెందిన నాగరాజు, అనూష దంపతులకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. నాలుగో తరగతి చదువుతున్న కూతురు సమన్విత(10) గురువారం ఉదయం ఛాతీ నొప్పితో కుప్పకూలింది. తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
Sorry, no posts matched your criteria.