India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లిక్కర్ స్కాం కేసులో ఈడీ రిమాండ్‌లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆ పదవిలో కొనసాగడం సరికాదని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. వీటిని చెత్త రాజకీయాలు అని ఆయన అభివర్ణించారు. ఇదిలా ఉంటే ఆయన స్థానంలో సీఎం బాధ్యతలు చేపట్టేందుకు ఆప్ లీడర్లు పోటీ పడుతున్నారని, కానీ.. ఈ రేసులోకి కేజ్రీవాల్ భార్య కూడా చేరారని బీజేపీ మంత్రి అన్నారు.
TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు చోటుచేసుకుంది. భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావు, SIBలో పనిచేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని 8 గంటలపాటు విచారించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీరిద్దరి పాత్రపై ఆరా తీస్తున్నారు. ప్రణీత్ రావుతో కలిసి వీరిద్దరూ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
మన శరీరంలోని 20 రకాల అమైనో యాసిడ్స్‌లో ఒకటైన ఐసోలియూసిన్ వినియోగం తగ్గిస్తే వృద్ధాప్యం త్వరగా దరిచేరదని పరిశోధకులు కనుగొన్నారు. తమ పరిశోధనలో ఎలుకల ఆయుష్షు 33% పెరిగిందని తెలిపారు. ఆరోగ్యానికి సంబంధించిన 26 అంశాల్లో ఇవి వృద్ధి సాధించాయట. మనుషులకు ఇది వర్తించొచ్చని దీనిపై సమగ్ర పరిశోధన చేయనున్నట్లు వెల్లడించారు. కాగా ఐసోలియూసిన్ గుడ్లు, మాంసం, డైరీ ఉత్పత్తులు మొదలైన పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది.
‘సలార్’లో వరదరాజ మన్నార్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన పృథ్వీరాజ్ సుకుమారన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. HYD వచ్చిన ఆయన ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. సైరా నరసింహారెడ్డిలో నటించాలని, గాడ్ ఫాదర్‌కి దర్శకత్వం వహించాలని మెగాస్టార్ తనను కోరారని చెప్పారు. ఆ రెండుసార్లు తాను ‘ఆడుజీవితం’లో బిజీగా ఉండటంతో చిరంజీవికి క్షమాపణ చెప్పినట్లు వెల్లడించారు.
రష్యా రాజధాని మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 150 మంది చనిపోయారు. మరికొంత మంది ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. కాగా ఇప్పటికే 11 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులకు ఉక్రెయిన్‌తో సంబంధం ఉందని అందుకే వారు ఆ దేశంలోకి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారని రష్యా సెక్యూరిటీ సర్వీస్ పేర్కొంది.
ఉల్లి ఎగుమతిపై నిషేధాన్ని నిరవధికంగా పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. నిషేధంపై గతంలో విధించిన గడవు ఈనెల 31న ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి ప్రకటన వచ్చే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. కాగా ఈ నిర్ణయాన్ని పలువురు నిపుణులు తప్పుపడుతున్నారు. ఈ నిర్ణయం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని.. నిజానికి ఇప్పుడు బ్యాన్ పొడగించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
TS: ప్రభుత్వ వెటర్నరీ&ఏనిమల్ హస్బెండరీ విభాగంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. TSPSCలో పరీక్షకు హాజరైన అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాలను అందుబాటులో ఉంచారు. ఎంపికైన వారికి త్వరలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉండనుంది. డిసెంబర్ 22, 2022లో ఈ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 185 పోస్టులు ఉన్నాయి. ఫలితాల కోసం ఇక్కడ <
TG: ఎమ్మెల్సీ కవిత ఆడపడుచు ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. మాదాపూర్‌లోని కవిత బంధువుల ఇళ్లలో ఇవాళ ఉదయం నుంచి ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. దాదాపు 11 గంటలపాటు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత మేనల్లుడు శరణ్ పాత్రపై ఆరా తీస్తున్నారు.
లిక్కర్ స్కాం కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ CM కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో అత్యవసర విచారణ జరపాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. కాగా లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆయనకు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది.
AP: రాష్ట్రాన్ని డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారని షర్మిల విమర్శించారు. ‘ఇండియాలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఏపీ వైపే. కేంద్ర, రాష్ట్ర నిఘా వ్యవస్థ మద్దుతు లేకుండా 25వేల కేజీల డ్రగ్స్ బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి ఎలా చేరుతాయి? డ్రగ్స్ మాఫియాతో వైసీపీ, టీడీపీ, బీజేపీలకు లింకులు లేకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా? దీని తెర వెనుక ఎంతటి వాళ్లున్నా CBI నిగ్గు తేల్చాలి’ అని ఆమె ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.