India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు డొనాల్డ్ ట్రంప్ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో తెలిపే ఘటన ఒకటి బయటపడింది. అమెరికా ఎన్నికల ఫలితాల రోజున ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ చేసిన కాల్‌లో మస్క్‌నూ జాయిన్ కావాలని ట్రంప్ కోరినట్టు తెలిసింది. అరగంటకు పైగా వీరు మాట్లాడుకున్నట్టు సమాచారం. ఏయే అంశాలపై వీరు చర్చించారో మాత్రం తెలియలేదు. దీనిని బట్టి అమెరికా పాలసీ మేకింగ్‌లో మస్క్ ఎంత కీలకం కానున్నారో అర్థమవుతోంది.

AP: గత ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మార్చిందని, ఇదే ఇప్పుడు పెనుముప్పుగా మారిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. కేంద్ర హోంశాఖ స్పందించి డ్రగ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ‘విశాఖలో సీజ్ చేసిన డ్రగ్స్ లింకులు విజయవాడలోని ఓ కంపెనీలో తేలాయి. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. నేరగాళ్లను కట్టడి చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలి’ అని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఏపీ-తెలంగాణలను అనుసంధానించేలా కల్వకుర్తి-మాచర్ల రైల్వే లైన్ పనులు ప్రారంభించాలని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి SCR GM అరుణ్‌కుమార్‌ను కోరారు. డోర్నకల్ నుంచి సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల్ వరకు నూతన రైల్వే లైన్ సర్వే పనులు పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే సర్వే పూర్తి చేసిన జడ్చర్ల-నాగర్‌కర్నూల్-కల్హాపూర్-నంద్యాల వరకు రైల్వే లైన్ పనులు ప్రారంభించాలని లేఖ ఇచ్చారు.

తొలి టీ20లో సౌతాఫ్రికాపై గెలిచిన టీమ్ ఇండియా పలు రికార్డులను సొంతం చేసుకుంది. డర్బన్ గ్రౌండ్‌లో 100 శాతం విజయాలను సాధించిన జట్టుగా నిలిచింది. అక్కడ భారత్ ఆడిన 8 T20లలో ఓ మ్యాచ్ ఫలితం తేలలేదు. మరొకటి రద్దయ్యింది. పూర్తయిన 6 మ్యాచ్‌లలోనూ గెలిచింది. అలాగే ఈ ఏడాది అత్యధిక విజయాలు(22) సాధించిన జట్టుగానూ నిలిచింది. టీమ్ విన్నింగ్ పర్సంటేజ్ 95.6. T20 చరిత్రలో ఒక ఏడాదిలో ఇదే అత్యధికం.

ఎవరు పడితే వాళ్లొచ్చి సెటిలవ్వడానికి దేశమేమీ ధర్మసత్రం కాదని కేంద్రమంత్రి శివరాజ్ చౌహాన్ అన్నారు. ‘ఝార్ఖండ్లో చొరబాటు దారుల్ని JMM ప్రభుత్వం కీర్తిస్తోంది. ఓటు బ్యాంకుగా చూస్తోంది. వారు ఆధార్, రేషన్ కార్డులు పొందేలా సాయపడుతోంది. దాంతో సంతాల్ పరగణాలో గిరిజనుల జనాభా 44 నుంచి 28%కి పడిపోయింది. ఈ దేశం మనది. ఈ నేల, నీరు, అడవులు, కొండలు, పొలాలు మనవి. వీటిని మన నుంచి లాగేసుకోనివ్వొద్దు’ అని అన్నారు.

AP: వైసీపీ నేతలు ఇవాళ డీజీపీ ద్వారకా తిరుమలరావును కలవనున్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని వారు డీజీపీని కోరతారు. మరోవైపు అవసరమైతే తాము కూడా ప్రైవేట్ కేసులు వేస్తామని వారు హెచ్చరించారు. తమ కార్యకర్తల తరఫున నిలబడి పోరాటం చేస్తామని ప్రకటించారు.

TG: నిన్న CM రేవంత్ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులకు బండ్ల గణేశ్ ధన్యవాదాలు తెలిపారు. విషెస్ చెప్పడానికి సమయం లేనివారికి ‘పెద్ద నమస్కారం’ అంటూ Xలో సెటైర్లు వేశారు. టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే CM కావలెను అంటూ రాసుకొచ్చారు. INC అగ్రనేతలు రాహుల్, ఖర్గే, ప్రియాంక ఎందుకు శుభాకాంక్షలు తెలపలేదని కొందరు, విషెస్ అడుక్కోవడం ఏందన్నా అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

HYDలోని సచివాలయంలో 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. సచివాలయానికి వచ్చే ప్రతి ఒక్కరికి కనిపించేలా, ఎత్తైన పీఠం, దానిపై 20 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించనుంది. విగ్రహం ముందు గ్రీనరీ, భారీ ఫౌంటేన్, ఆకట్టుకునేలా లైటింగ్ వంటి సుందరీకరణ పనులు చేస్తున్నారు. డిసెంబర్ 9న విగ్రహావిష్కరణ చేయనుండటంతో చకచకా పనులు జరుగుతున్నాయి. సచివాలయ ప్రధాన ద్వారం ముందే విగ్రహాం ఏర్పాటవుతోంది.

కార్తీకమాసంలో ఏ వారమైతే శ్రవణ నక్షత్రంతో వస్తుందో దాన్ని కోటి సోమవారంగా పేర్కొంటారని పండితులు చెబుతున్నారు. అదే ఈరోజు. శ్రవణ నక్షత్రం వేంకటేశ్వరస్వామి జన్మనక్షత్రం. ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంటుంది. ఈరోజు ఉదయాన్నే దీపారాధాన చేస్తే తెలిసీతెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి. కోటి శివలింగాలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఈరోజు చేసే దానం, ఉపవాసాలకు కోటి రెట్ల అధిక ఫలం ఉంటుందని శాస్త్రవచనం.

AP: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణల్లో నిజాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటైంది. CBI తరఫున HYD జోన్ JD వీరేశ్ ప్రభు, విశాఖ SP మురళి రాంబా పేర్లను సంస్థ ప్రకటించింది. FSSAI నుంచి డా.సత్యేన్ కుమార్, రాష్ట్రం తరఫున గుంటూరు రేంజి IG సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజి DIG గోపీనాథ్ జెట్టీలు సిట్‌లో ఉంటారు. త్వరలోనే పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభమవుతుంది.
Sorry, no posts matched your criteria.