news

News November 16, 2024

హీరో ధనుష్‌పై నయనతార సంచలన ఆరోపణలు

image

హీరో ధనుష్‌ తనకు రూ.10కోట్లకు లీగల్ నోటీసులు పంపడంపై హీరోయిన్ నయనతార మండిపడ్డారు. ‘మీరు మీ తండ్రి, సోదరుడి సాయంతో హీరో అయ్యారు. నేను నా రెక్కల కష్టంతో పైకొచ్చాను. నా జీవితంపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీస్తోంది. అందులో మీరు నిర్మించిన ‘నానుమ్ రౌడీ దాన్’ క్లిప్స్ వాడుకునేందుకు NOC అడిగితే రెండేళ్ల నుంచి తిప్పించుకుంటున్నారు. 3 సెకన్ల ఫొటోలకు రూ.10 కోట్లు కట్టాలా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News November 16, 2024

‘బ్రాండ్ ఇండియా’ను ప్రపంచానికి పరిచయం చేసిన మోదీ: CM చంద్రబాబు

image

PM నరేంద్రమోదీ ‘బ్రాండ్‌ ఇండియా’ను ప్రపంచానికి పరిచయం చేశారని AP CM చంద్రబాబు నాయుడు అన్నారు. బ్రాండ్ బలంగా ఉంటేనే అద్భుతాలు చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మోదీ చేసింది అదేనన్నారు. ఇప్పుడాయన స్పష్టమైన విజన్, పాలసీ, డైరెక్షన్, ప్రాసెస్‌తో వికసిత్ భారత్ 2047 వైపు వెళ్తున్నారని వెల్లడించారు. ఆయన నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే నం.1 ఎకానమీ అవుతుందనడంలో సందేహం లేదని HTLS 2024లో అన్నారు.

News November 16, 2024

ఆకాంక్షల రెక్కలపై అభివృద్ధి వైపునకు దేశం: మోదీ

image

భారత్ స్వతంత్ర ఉద్యమ కష్టాల నుంచి ఆకాంక్షల రెక్కలపై అభివృద్ధివైపు దూసుకెళ్తోందని PM మోదీ అన్నారు. ‘పదేళ్ల క్రితం వరకు ఈ జర్నీ ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు అంతా నమ్ముతున్నారు. భారతీయ ప్రమాణాలను ప్రపంచం గుర్తిస్తోంది. బ్రిటిషర్లు వెళ్లాక, ఎమర్జెన్సీ టైమ్, సంస్థలు ప్రభుత్వాలకు దాసోహమైనప్పుడు ప్రజలే ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు. పదేళ్లలో దేశ బడ్జెట్ రూ.16L Cr నుంచి రూ.48L Crకు పెరిగింది’ అని అన్నారు.

News November 16, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో BRS మాజీ MLAకు నోటీసులు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ MLA చిరుమర్తి లింగయ్యతో పాటు నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల నేతలకు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు పలువురిని అరెస్ట్ చేయగా, ప్రధాన సూత్రధారుల కోసం వేట కొనసాగుతోంది.

News November 16, 2024

అమెరికాతో స్నేహంగా ఉండాలనుకుంటున్నాం: చైనా

image

USతో చైనా భాగస్వామిగా, మిత్రదేశంగా ఉండాలనుకుంటున్నట్లు చైనా రాయబారి షీ ఫెంగ్ తెలిపారు. హాంకాంగ్‌లో చైనా, అమెరికా అధికారులు పాల్గొన్న ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అమెరికాను దాటాలనో లేక అంతర్జాతీయంగా ఆ స్థానంలోకి రావాలనో చైనా భావించడం లేదు. ఈ రెండు దేశాలు కలిసి పనిచేస్తే అపరిమిత ప్రయోజనాలుంటాయి. మన మధ్య ఉన్న సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకుందాం’ అని పేర్కొన్నారు.

News November 16, 2024

ఎన్‌కౌంటర్.. నలుగురు మావోల మృతి

image

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ సరిహద్దు ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లాయి. భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృత్యువాతపడ్డారు. అక్కడ పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

News November 16, 2024

పవన్ కళ్యాణ్ ‘OG’పై క్రేజీ అప్డేట్

image

సుజీత్ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘OG’ మూవీ షూటింగ్ 80% పూర్తయిందని తమన్ వెల్లడించారు. ఈ చిత్రంలో <<14602023>>రమణ గోగులతో<<>> ఓ పాట పాడించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అలాగే పవర్ స్టార్ తనయుడు అకీరా నందన్ పియానో ట్యూన్ వర్క్ అందిస్తాడన్నారు. ఈ సినిమాకు ఇండియాలోనే అత్యధిక ఓపెనింగ్స్ వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాగా పవన్-గోగుల కాంబోలో వచ్చిన అన్ని పాటలు సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

News November 16, 2024

దయచేసి చావండి.. గూగుల్ ఏఐ సమాధానం

image

వృద్ధులకు ఎదురయ్యే సవాళ్లపై ప్రశ్న అడిగిన విధయ్‌రెడ్డి అనే విద్యార్థికి గూగుల్ AI బెదిరింపు సమాధానమివ్వడం చర్చనీయాంశంగా మారింది. ‘ఓ మనిషీ.. నువ్వేమీ స్పెషల్ కాదు. టైమ్, వనరులను వృథా చేస్తావు. సమాజానికి భారం. దయచేసి చావండి’ అని రిప్లై ఇచ్చింది. షాకైన అతను ఫిర్యాదుచేయగా ‘కొన్నిసార్లు నాన్ సెన్సికల్ రెస్పాన్స్‌లతో AIలు ప్రతిస్పందిస్తాయి. ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటాం’ అని గూగుల్ పేర్కొంది.

News November 16, 2024

తిరుమలలో రేపు కార్తీక వనభోజనం.. పటిష్ఠ ఏర్పాట్లు

image

AP: తిరుమలలో రేపు కార్తీక వన భోజన కార్యక్రమం సందర్భంగా పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. వర్ష సూచనల నేపథ్యంలో వన భోజనం నిర్వహణ వేదికను పార్వేట మండపం నుంచి వైభవోత్సవం మండపానికి మార్చినట్లు తెలిపింది. రేపు ఉ.11 గంటలకు గజ వాహనంపై ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి మలయప్పస్వామి రానున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు.

News November 16, 2024

ఆధార్ ఉన్నవారికి అలర్ట్

image

మీ ఆధార్ దుర్వినియోగమైందా? లేదా? తెలుసుకోవాలంటే..
* <>uidai.gov.in<<>> పోర్టల్‌లోకి మీ ఆధార్ నంబర్, క్యాప్చా, మొబైల్‌కి వచ్చే OTPతో లాగిన్ అవ్వాలి.
* తర్వాత అథెంటికేషన్ హిస్టరీపై క్లిక్ చేయండి.
* అక్కడ ‘ఆల్’ని సెలెక్ట్ చేసి ‘ఫెచ్ అథెంటికేషన్ హిస్టరీ’పై క్లిక్ చేస్తే మీ ఆధార్ ఎక్కడెక్కడ ఉపయోగించారనే వివరాలు తెలిసిపోతాయి. మీ ఆధార్‌ దుర్వినియోగమైనట్లు తెలిస్తే 1947కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.