news

News September 19, 2024

తెలుగు వర్సిటీకి ‘సురవరం’ పేరు.. రేపు ఆమోదం

image

TG: హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చేందుకు రంగం సిద్ధమైంది. ఆ వర్సిటీకి ప్రముఖ కవి, ఉద్యమకారుడు సురవరం ప్రతాప్‌రెడ్డి పేరును ప్రభుత్వం పెట్టనుంది. రేపు జరిగే క్యాబినెట్ భేటీలో ఆమోదం తెలపనుంది. ఈ వర్సిటీ 1985లో ఏర్పడింది. ఇది పదో షెడ్యూల్‌లో ఉండటంతో రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లపాటు ఇదే పేరు కొనసాగింది. గడువు ముగియడంతో పేరు మార్చుతున్నారు.

News September 19, 2024

నేడు మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం

image

AP: రాష్ట్రవ్యాప్తంగా రెండో విడతలో 75 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఇవాళ ప్రారంభించనుంది. ఇందులో విశాఖ పరిధిలోనే 25 క్యాంటీన్లు ఉన్నాయి. మొత్తంగా 203 కేంద్రాలను మొదలుపెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా తొలి విడతలో 100 క్యాంటీన్లను ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ రూ.5కే ఉదయం ఇడ్లీ/పూరి/ఉప్మా/పొంగల్, చట్నీ, సాంబార్, లంచ్- డిన్నర్‌లో అన్నం, కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి అందిస్తారు.

News September 19, 2024

INDvsBAN: నేటి నుంచే తొలి టెస్టు

image

చెన్నై వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు నేడు ప్రారంభం కానుంది. సొంత గడ్డపై 2012 నుంచి టెస్టు సిరీస్ ఓడని IND తన ఖాతాలో మరో సిరీస్‌ను వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. పాక్‌ను వైట్‌వాష్ చేసిన ఊపులో ఉన్న బంగ్లా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలనుకుంటోంది. ఉ.9.30 నుంచి స్పోర్ట్స్18లో వీక్షించవచ్చు.
IND అంచనా టీమ్: రోహిత్, జైస్వాల్, గిల్, కోహ్లీ, రాహుల్, పంత్, జడేజా, అశ్విన్, కుల్దీప్, సిరాజ్, బుమ్రా

News September 19, 2024

బాలికలపై లైంగిక వేధింపులు.. వార్డెన్ సస్పెండ్

image

AP: ఏలూరులోని ఓ ఆశ్రమ హాస్టల్‌లో బాలికలపై లైంగిక వేధింపులకు <<14129113>>పాల్పడిన<<>> గ్రేడ్-2 సంక్షేమాధికారి శశికుమార్‌ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. విద్యార్థినుల ఫిర్యాదుతో ప్రాథమిక దర్యాప్తు చేయించిన అనంతరం ఈ చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. పూర్తి విచారణ అనంతరం శశికుమార్, అతడికి సహకరించిన వారిపై పోక్సో కేసు నమోదుచేస్తామని చెప్పారు.

News September 19, 2024

మద్యం షాపు దరఖాస్తు రుసుం రూ.2 లక్షలు

image

AP: నూతన మద్యం పాలసీలో భాగంగా 3,736 లిక్కర్ షాప్‌లలో 10 శాతం(340) గీత కార్మికులకు రిజర్వ్ చేస్తారు. దరఖాస్తు రుసుం రూ.2 లక్షలు. లాటరీ విధానంలో రెండేళ్ల కాలపరిమితితో షాపులు కేటాయిస్తారు. ఉ.10 నుంచి రా.10 వరకు షాపులకు అనుమతి ఉంటుంది. జనాభా ఆధారంగా లైసెన్స్ ఫీజు రూ.50-85 లక్షలు చెల్లించాలి. 12 ప్రధాన పట్టణాల్లో 12 ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు చేస్తారు. వీటికి అదనంగా ఫీజు నిర్ణయిస్తారు.

News September 19, 2024

T20I నంబర్-1 ఆల్‌రౌండర్‌గా లివింగ్‌స్టోన్

image

ఆస్ట్రేలియాతో T20 సిరీస్‌లో అదరగొట్టిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు. 124 రన్స్, 5 వికెట్లు తీయడంతో 253 పాయింట్లతో టాప్ ప్లేస్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత స్టొయినిస్(211), సికందర్ రజా(208), షకిబ్ అల్ హసన్(206), నబీ(205), హార్దిక్ పాండ్య(199) ఉన్నారు. T20I బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ట్రావిస్ హెడ్, బౌలింగ్‌లో అదిల్ రషీద్ టాప్‌లో ఉన్నారు.

News September 19, 2024

ఈ ఏడాది చివరిలోపు ఐపీఎల్ వేలం?

image

ఐపీఎల్-2025 కోసం చేపట్టే వేలం రానున్న నవంబరు ఆఖర్లో లేదా డిసెంబరు మొదటి వారంలో ఉండొచ్చని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మరో రెండ్రోజుల్లో అందుకు సంబంధించిన నిబంధనల్ని రూపొందించనున్నట్లు పేర్కొన్నాయి. గత రెండు ఆక్షన్లలాగే ఈసారి కూడా వేలం 2 రోజుల పాటు జరుగుతుందని సమాచారం. ఆటగాళ్ల కొనసాగింపు విషయంలో జట్ల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్న నేపథ్యంలో నిబంధనలెలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

News September 19, 2024

Learning English: Synonyms

image

✒ Fast: Quick, Rapid, Hasty
✒ Fat: Stout, Corpulent, Paunchy
✒ Fear: Fright, Dread, Terror, Alarm
✒ Fly: Soar, Hover, Flit, Wing
✒ Funny: Humorous, Amusing
✒ Get: Acquire, Obtain, Secure
✒ Go: Recede, Depart, Fade
✒ Good: Excellent, Apt, Marvelous
✒ Great: Noteworthy, Worthy

News September 19, 2024

5,600 మంది ఉద్యోగులపై ‘సిస్కో’ వేటు

image

ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా 4వేల మంది ఉద్యోగులను తొలగించిన టెక్ దిగ్గజం సిస్కో మరో దశ లేఆఫ్స్‌కు సిద్ధమైంది. మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 7 శాతం(5,600) సిబ్బందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. అయితే ఏయే విభాగాలు ప్రభావితం అవుతాయో వెల్లడించలేదు. కాగా అక్కడ పని వాతావరణం ఏమాత్రం బాగాలేదని పలు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు ఆ కంపెనీ వార్షిక ఆదాయం రికార్డు స్థాయిలో $54 బిలియన్లకు చేరింది.

News September 19, 2024

పాక్ హాకీ ఆటగాళ్లకు రూ.8,366ల బహుమతి

image

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించిన పాక్ హాకీ టీమ్‌కు ఆ దేశ హాకీ ఫెడరేషన్ బహుమతి ప్రకటించింది. ఆటగాళ్లు, సిబ్బందికి 100 డాలర్ల(రూ.8,366) చొప్పున ప్రైజ్ మనీ ఇస్తామని తెలిపింది. ఇంత తక్కువ ఇవ్వడం దారుణమని, అసలు ఇవ్వకపోయి ఉంటే బాగుండేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సెమీస్‌లో చైనా చేతిలో ఓడిన పాక్.. కాంస్య పతక పోరులో కొరియాపై 5-2 తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.