India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: వైసీపీ హయాంలో చాలా టూరిజం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంతో పనులు నిలిచిపోయాయని మంత్రి కందుల దుర్గేశ్ విమర్శించారు. పర్యాటక రంగం పూర్తిగా నిర్వీర్యమైందని, భారీగా ఆదాయం కోల్పోయే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. విశాఖలో యాత్రి నివాస్ నిర్మాణాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. తీరంలో MV MAA Shipను త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

ఫారిన్ ఇన్వెస్టర్లు చివరి 3 సెషన్లలోనే రూ.27,142 కోట్లను వెనక్కి తీసుకున్నారు. వెస్ట్ ఏషియాలో వార్, క్రూడాయిల్ ధరలు, చైనా మార్కెట్లు పుంజుకోవడమే ఇందుకు కారణాలు. స్టిమ్యులస్ ప్యాకేజీ, మానిటరీ పాలసీతో చైనా మార్కెట్లు గత నెల్లో 26% ఎగిశాయి. అక్కడి షేర్ల విలువ తక్కువగా ఉండటంతో FPIలు డబ్బును అక్కడికి మళ్లిస్తున్నారని నిపుణులు చెప్తున్నారు. CY24 SEP నాటికి వీరి పెట్టుబడులు రూ.57,724 కోట్లకు చేరాయి.

ఒక మెంబర్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం వల్లే సార్క్ ప్రోగ్రెస్ ఆగిపోయిందని EAM జైశంకర్ అన్నారు. ఈ నెల్లోనే SCO మీటింగ్ కోసం పాక్ వెళ్తుండటంతో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘టెర్రరిజాన్ని సహించేది లేదు. మాలో ఒకరు మరొకరిపై అలా చేస్తే దాన్ని ఆపాల్సిందే. అందుకే సార్క్ మీటింగ్స్ జరగడం లేదు. అయితే గత ఐదారేళ్లలో బంగ్లా, నేపాల్, భూటాన్, మయన్మార్, శ్రీలంకతో భారత్ బంధం మెరుగైంది’ అని వివరించారు.

‘శివ’ సినిమా విడుదలై 35 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా హీరో అక్కినేని నాగార్జున చేసిన ట్వీట్‌కు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ‘నా లైఫ్‌కి బ్రేక్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మీ అచంచలమైన మద్దతు, నాపై సంపూర్ణ విశ్వాసం లేకపోతే శివతో పాటు నేనూ ఉండేవాడినికాదు’ అని ట్వీట్ చేశారు. వర్మ తన కెరీర్‌ను ‘శివ’తో మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నారాయణపేట, వనపర్తి, వికారాబాద్, సంగారెడ్డి, జనగాం, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో వానలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ తెలిపారు.

దొంగలు పలు రకాలు! ఇంట్లోవాళ్లను చంపిమరీ దోచుకెళ్లే వారు కొందరు. బట్టలు ఉతికి, మొక్కలకు నీళ్లుపోసి, ఫ్లోర్ తుడిచి, ఇల్లు సర్ది, వంటచేసి, భోజనం తిని ‘ఫీల్ ఎట్ హోమ్’ అన్నట్టుగా ప్రవర్తించేవారు ఇంకొందరు. UKలో వోజ్నిలోవిక్ ఇదే కోవకు చెందుతాడు. ఓ మహిళ ఇంట్లోకి చొరబడి వైన్ తాగి ‘డోన్ట్ వర్రీ, బీ హ్యాపీ, బాగా తినండి’ అని రాసిపెట్టాడు. మరో ఇంటికెళ్లి పట్టుబడ్డాడు. కోర్టు అతడికి 22 నెలల జైలుశిక్ష వేసింది.

TG: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఉచితంగా నాణ్యమైన విద్య కోసం ప్రతి నియోజకవర్గంలో ఈ స్కూళ్లను కట్టాలని నిర్ణయించామన్నారు. దసరా కంటే ముందే వీటికి భూమిపూజ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం 1023 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉంటే 600కు పైగా పాఠశాలలకు సొంత భవనాలు లేవని భట్టి తెలిపారు.

విమానాలు ఎక్కువగా తెలుపు రంగులోనే ఉంటాయి. దీనికో కారణం ఉంది. ‘వైట్ పెయింట్ సూర్యరశ్మిని గ్రహించదు. గాల్లో ఉన్నప్పుడు, నేలపై పార్క్ చేసి ఉంచినప్పుడు తెలుపు రంగు క్యాబిన్‌లో వేడిని తగ్గిస్తుంది’ అని నిపుణులు చెబుతున్నారు. డార్క్ పెయింట్‌తో పోల్చితే వైట్ తేలికైనది. డార్క్ కలర్ వేయడం వల్ల విమానం 8 మంది ప్రయాణికులంత బరువు ఎక్కువవుతుంది. తెలుపు రంగు వల్ల గాల్లో పక్షులు ఢీ కొట్టడం తగ్గుతుంది.

తమ హిందూత్వ ఇంట్లో పొయ్యి వెలిగిస్తే BJP హిందూత్వ ఏకంగా ఇంటికే నిప్పు పెడుతుందని శివసేన UBT నేత ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు. అందుకే శివసేనను ఫినిష్ చేయాలనుకున్నారని ఆరోపించారు. మరో నెలలోనే మహారాష్ట్రలో తమ కూటమి అధికారంలోకి వచ్చాక ద్రోహులకు ఉద్యోగాలు ఉండవన్నారు. ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఇలా మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో లూటీ చేసిన తీరును ప్రజల ముందు ఉంచుతామన్నారు.

సికింద్రాబాద్-వాస్కోడగామా-సికింద్రాబాద్ రైలు(17039)ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ రైలు ప్రతి బుధవారం, శుక్రవారం సికింద్రాబాద్ నుంచి.. ప్రతి గురువారం, శనివారం వాస్కోడగామా నుంచి బయల్దేరుతుంది. కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, MBNR, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట్, కొప్పల్, హుబ్బలి, లోండా, కులేం, మడ్గాన్ తదితర స్టేషన్లలో ఆగుతుంది. పూర్తి షెడ్యూల్ పై ఫొటోలో చూడండి.
Sorry, no posts matched your criteria.