India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: రైతులు, చేతివృత్తిదారులకు అండగా నిలుస్తూ కేంద్ర ప్రభుత్వ ‘స్ఫూర్తి’ పథకాన్ని రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కేంద్రంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలుత 11 జిల్లాల్లో క్లస్టర్లు ఏర్పాటుచేస్తారు. ఒక్కో క్లస్టర్‌లో 1,000-1,500మంది మహిళలుంటారు. ఒక్కో ప్రాజెక్టుకు కేంద్రం రూ.5కోట్లు(ఇందులో 90% రాయితీ) ఇస్తుంది. రైతులు, చేతివృత్తిదారుల నుంచి ధాన్యం, వస్తువులను సేకరించి అమ్మకాలు చేపడతారు.

APకి NCC అకాడమీ లేకపోవడంతో విద్యార్థులకు అవకాశాలు తగ్గుతున్నాయని ఎన్‌సీసీ తెలుగు రాష్ట్రాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మధుసూదనరెడ్డి తెలిపారు. అకాడమీ ఏర్పాటుకు స్థలం కోసం వెతుకుతున్నామన్నారు. ‘ఉమ్మడి APలో ప్రీ రిపబ్లిక్ డే క్యాంపుల్లో 124 మందిని ఎంపిక చేసేవాళ్లం. అకాడమీలు లేకపోవడంతో అదే సంఖ్యను కొనసాగిస్తున్నాం. కొత్తవి ఏర్పాటైతే ఆయుధ శిక్షణ, పరేడ్ గ్రౌండ్ సౌకర్యాలు సమకూరుతాయి’ అని పేర్కొన్నారు.

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోగా బాట గంగమ్మ ఆలయం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామి వారిని 75,552 మంది భక్తులు దర్శించుకోగా 35,885 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.54 కోట్లు సమకూరింది.

AP: శ్రీశైలం ప్రాజెక్టులో 1976లో 308.06TMCల నీటి నిల్వ సామర్థ్యం ఉండేది. ప్రాజెక్టులో పూడిక పెరిగిపోవడంతో 2021 నాటికి కెపాసిటీ 205.95TMCలకు పడిపోయింది. 45 ఏళ్లలో 102TMCల సామర్థ్యం తగ్గిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర జలసంఘం కలిసి రిమోట్ సెన్సింగ్, హైడ్రో గ్రాఫిక్ సర్వేల ద్వారా ఈ అధ్యయనం చేశాయి. ప్రాజెక్టులో నిల్వ సామర్థ్యం పెంపునకు చర్యలు తీసుకోవాలని సాగునీటి నిపుణులు కోరుతున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్వల్ప తేడాతో విజయం సాధించే అవకాశం ఉందని ‘Polymarket’ అంచనా వేసింది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం ట్రంప్‌కు 50.1%, కమలా హారిస్‌కు 48.9% ఛాన్సెస్ ఉన్నాయని పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రెడిక్షన్ మార్కెట్ గా ‘Polymarket’ కంపెనీ గుర్తింపు పొందింది. కాగా, అమెరికా ఎన్నికలకు ఇంకా 31 రోజులు మిగిలి ఉన్నాయి.

TG: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, వికారాబాద్, మల్కాజిగిరి, సంగారెడ్డి, కామారెడ్డి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఇవాళ మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఆసక్తికర పోరు జరగనుంది. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. తొలి మ్యాచులో న్యూజిలాండ్ చేతిలో ఓటమితో భారత్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే భారీ విజయం నమోదు చేయాల్సి ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 15 టీ20లు జరగ్గా భారత్ 12, పాక్ 3 మ్యాచుల్లో విజయం సాధించాయి. కాగా మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది.

AP: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజైన ఇవాళ ఉ.8 నుంచి 10 గంటల వరకు స్వామివారు సింహవాహనంపై ఊరేగుతారు. రా.7 నుంచి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంలో వేణుగోపాలుడి అలంకారంలో ఊరేగనున్నారు.

ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. నవంబర్ 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28, 29, డిసెంబర్ 4, 5, 9, 10, 11, 14, 15, 16 తేదీల్లో కళ్యాణ ఘడియలు ఉన్నాయన్నారు. ఈ సుముహూర్తాల్లో దాదాపు 48 లక్షల వివాహాలు జరుగుతాయని, దాదాపు రూ.6 లక్షల కోట్లను ఖర్చు చేయబోతున్నారని CAIT అంచనా వేస్తోంది.

తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. తీవ్రవాద నిరోధంపై కేంద్ర హోం శాఖ నిర్వహించే సమావేశానికి వీరివురు హాజరు కానున్నారు. మరోవైపు వరద పరిహారం విషయమై సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. ఈ పర్యటనలోనే కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం కలవొచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి.
Sorry, no posts matched your criteria.