news

News October 17, 2024

‘హైడ్రా’పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

image

TG: చెరువుల్లో అక్రమంగా నిర్మించుకున్న భవనాలనే హైడ్రా కూలుస్తోందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మూసీ పరీవాహకంలో ఎవరి ఇళ్లను హైడ్రా కూల్చలేదన్నారు. కొందరు మెదడులో మూసీ మురికి కంటే ఎక్కువ విషం నింపుకొని దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. తాము ఉన్నపళంగా, నిర్దయగా ఎవరినీ ఖాళీ చేయించడం లేదని, నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించి, రూ.25వేలు ఇచ్చామని వెల్లడించారు.

News October 17, 2024

వైసీపీ నేతలను టార్గెట్ చేశారు: సజ్జల

image

AP: కూటమి ప్రభుత్వం తమ పార్టీ నేతలను టార్గెట్ చేసిందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వైసీపీ వాళ్లపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని అన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనను పోలీసులు గంటన్నర పాటు విచారించారు. అయితే విచారణ పేరుతో అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. దాడి జరిగిన రోజు తాను మంగళగిరిలోనే లేనని వెల్లడించారు.

News October 17, 2024

టీమ్ ఇండియాకు మరో షాక్!

image

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయపడ్డారు. మోకాలికి బంతి తాకడంతో నొప్పి భరించలేక మైదానం వీడారు. అతడి స్థానంలో ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్‌కు వచ్చారు. గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై జట్టు నుంచి అప్డేట్ రావాల్సి ఉంది. ఒకవేళ పంత్ గాయంతో దూరమైతే సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత బ్యాటింగ్ లైనప్ కాస్త బలహీన పడే ఛాన్స్ ఉంది.

News October 17, 2024

మూసీ పరీవాహకంలో దుర్భర జీవితం గడుపుతున్నారు: రేవంత్

image

TG: రాష్ట్ర భవిష్యత్‌ను నిర్దేశించే ‘మూసీ’ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం చేపట్టిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘33 బృందాలు మూసీ పరీవాహకంపై అధ్యయనం చేశాయి. అక్కడ నివసిస్తున్నవారు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. వారికి మెరుగైన జీవితం అందించాలని మేం భావిస్తున్నాం. విద్యావంతుల నుంచి నిరక్షరాస్యుల వరకు అందరికీ హైదరాబాద్ ఉపాధి కల్పించాలి అన్నదే మా లక్ష్యం’ అని మూసీ ప్రాజెక్ట్ ప్రణాళిక సందర్భంగా అన్నారు.

News October 17, 2024

ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా హేమాంగ్ బదానీ

image

ఢిల్లీ క్యాపిటల్స్ తమ హెడ్ కోచ్‌గా హేమాంగ్ బదానీని, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా మాజీ క్రికెటర్ వేణుగోపాల్ రావును నియమించింది. ట్విటర్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. ఆ జట్టుకు 2018 నుంచి రికీ పాంటింగ్ హెడ్ కోచ్‌గా ఉండగా ఈ ఏడాది ఆయన స్థానంలో బదానీకి అవకాశం దక్కింది. బదానీ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచింగ్ స్టాఫ్‌లో పనిచేశారు.

News October 17, 2024

సెక్షన్6Aపై సుప్రీం తీర్పు: NRCకి గ్రీన్ సిగ్నల్ అన్నట్టే!

image

సిటిజన్‌షిప్ యాక్ట్‌లోని <<14380027>>సెక్షన్6A<<>>కు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పునివ్వడంతో NRCకి మార్గం సుగమమైంది. ఈ సెక్షన్ ప్రకారం 1971, MAR 24 తర్వాత అస్సాం వచ్చిన బంగ్లా వలసదారుల్ని గుర్తించి వెనక్కి పంపొచ్చు. పైగా ఈ ప్రక్రియను SCI స్వయంగా పర్యవేక్షిస్తుంది. ఫారినర్స్ యాక్ట్, అదే తరహా చట్టాలను అమలు చేసే పవర్ స్టేట్స్‌కు ఉందన్న కోర్టు అబ్జర్వేషన్స్ బోర్డర్ స్టేట్స్‌కు మార్గదర్శకంగా మారాయి.>comment

News October 17, 2024

రిటైర్డ్ పోలీస్ అధికారులతో టీమ్ ఏర్పాటు: KTR

image

TG: BRS కార్యకర్తలు, నాయకులు ఎవరూ భయపడొద్దని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ కొందరు పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా మారిపోయారని, అయినా భయపడొద్దన్నారు. RS.ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో రిటైర్డ్ పోలీస్ అధికారులతో ఒక టీమ్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

News October 17, 2024

ఆ ప్లాంట్‌లో కోటి కార్లు ఉత్పత్తి చేశాం: మారుతి

image

హరియాణాలోని మానేసర్ ప్లాంట్‌ మొదలైనప్పటి నుంచి తమ సంస్థ అక్కడ కోటి కార్లను ఉత్పత్తి చేసిందని మారుతీ సుజుకీ ఓ ప్రకటనలో తెలిపింది. కేవలం 18 ఏళ్లలోనే ఈ ఘనత సాధించినట్లు పేర్కొంది. గురుగ్రామ్, మానేసర్, గుజరాత్‌లో మారుతికి ఉత్పత్తి ప్లాంట్లున్నాయి. మానేసర్‌లో బ్రెజా, ఎర్టిగా, ఎక్స్‌ఎల్ 6, సియాజ్, డిజైర్, వాగన్ ఆర్, ఎస్ ప్రెస్సో కార్లను తయారు చేసి భారత్‌తో పాటు విదేశాలకూ ఎగుమతి చేస్తోంది.

News October 17, 2024

కాసేపట్లో వర్షం

image

తెలంగాణలోని చాలా జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, భూపాలపల్లి, గద్వాల, కామారెడ్డి, యాదాద్రి, WGL, సూర్యాపేట, సిద్దిపేట, RR, కరీంనగర్, నల్గొండ, మెదక్, ఖమ్మం, నిర్మల్, పెద్దపల్లి, సిరిసిల్ల తదితర జిల్లాల్లో మోస్తరు వాన పడొచ్చని పేర్కొంది. కాగా ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

News October 17, 2024

గ్రూప్-1 మెయిన్స్ ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

image

TG: గ్రూప్-1 పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సీఎస్ శాంతకుమారి సూచించారు. గ్రూప్-1 పరీక్షకు ఏర్పాట్లను సమీక్షించారు. మెయిన్స్‌కు 34,383 మంది అభ్యర్థులు హాజరవుతారని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ఆదేశించారు. మెయిన్స్ నిర్వహణకు 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద పటిష్ఠ బందోబస్తుతో పాటు విస్తృత పర్యవేక్షణ ఉండాలన్నారు.