news

News October 4, 2024

రేవంత్ మొనగాడు కాదు.. మోసగాడు: హరీశ్

image

TG: దేవుళ్లపై ఒట్లు వేసి మాట తప్పిన సీఎం రేవంత్ మొనగాడు కాదు, మోసగాడని BRS మాజీ మంత్రి, MLA హరీశ్‌రావు విమర్శించారు. కుంటిసాకుతో రుణమాఫీ ఎగ్గొట్టి, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. దసరాలోపు రైతుబంధు పడకపోతే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. దసరా తర్వాత రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని అన్నారు.

News October 4, 2024

జగన్‌తో దీక్ష చేయించగలరా?: భూమనకు బీజేపీ నేత సవాల్

image

AP: పవన్ కళ్యాణ్ దీక్షపై విమర్శలు చేయడం సరికాదని బీజేపీ నేత భాను ప్రకాశ్ ఫైర్ అయ్యారు. పవన్‌ను స్వామి అని సంభోధించిన భూమన కరుణాకర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన పార్టీ అధినేతతో భూమన దీక్ష చేయించగలరా? అని సవాల్ విసిరారు. హిందూ సంప్రదాయాల ప్రకారం జగన్‌తో ఇంట్లో పూజలు చేయించగలిగే సత్తా భూమనకు ఉందా అని ప్రశ్నించారు. హిందూ మత విశ్వాసాలను గౌరవించని వ్యక్తి జగన్ అని విమర్శించారు.

News October 4, 2024

అక్రమమైతే నా ఫామ్‌హౌస్‌ను నేనే కూలుస్తా: కేవీపీ

image

TG: సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. తన ఫామ్ హౌస్‌కు అధికారులను పంపించాలని, FTL, బఫర్ జోన్‌లో నిర్మాణం ఉంటే మార్క్ చేయాలని కోరారు. అది అక్రమ నిర్మాణమైతే సొంత ఖర్చులతో కూల్చేస్తానన్నారు. తనకు చట్టం నుంచి ఎలాంటి మినహాయింపులు వద్దని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డపేరు రాకూడదని, అలా వస్తే తన కాంగ్రెస్ రక్తం సహించదు అని అన్నారు.

News October 4, 2024

జాబులు పోవాలంటే చంద్రబాబే కదా రావాలి: VSR

image

AP: జాబులు పోవాలంటే ఎవరు రావాలి? చంద్రబాబే కదా? అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్‌లో తొలి విడతగా 4వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని అన్నారు. సంపద సృష్టి? బాబు వస్తే జాబు? అంటే ఇదేనా తెలుగు తమ్ముళ్లూ అంటూ Xలో పోస్ట్ చేశారు. ఇది ప్రైవేటీకరణకు మొదటి మెట్టు కాదా చంద్రబాబు? అని ప్రశ్నించారు.

News October 4, 2024

హార్దిక్ బౌలింగ్‌పై కోచ్ మోర్కెల్ అసంతృప్తి!

image

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ కోసం ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తిరిగి భారత జట్టులో చేరనున్నారు. అయితే ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా నెట్స్‌లో హార్దిక్ పాండ్య బౌలింగ్ చేసిన తీరుపై బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రతి డెలివరీ తర్వాత హార్దిక్ దగ్గరికి వెళ్లి సలహాలు ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. అక్టోబర్ 6న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

News October 4, 2024

ఇండియాలో మరో నాలుగు యాపిల్ రిటైల్ స్టోర్స్

image

ఇండియాలో మరో 4 రిటైల్ స్టోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. ఇప్పటివరకూ ముంబై, ఢిల్లీలోనే యాపిల్‌కు చెందిన రిటైల్ స్టోర్స్ ఉన్నాయి. వచ్చే ఏడాది బెంగళూరు, పుణే, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబైలో మరో నాలుగు స్టోర్స్ ఓపెన్ చేయనున్నట్లు పేర్కొంది. ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లో తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. మేడ్-ఇన్-ఇండియా iPhone 16 Pro, Pro Maxల సరఫరా ఈనెల నుంచి ప్రారంభంకానుంది.

News October 4, 2024

తండ్రి ప్రేమ.. ప్రాణాలకు తెగించి కూతురి కోసం..!

image

తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ప్రత్యేక బంధం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. కూతురి సంతోషం కోసం తండ్రి ఎంతైనా కష్టపడుతుంటాడు. అలాంటి ఓ తండ్రి తన కూతురి పెళ్లి కోసం ఏకంగా 50kms నడిచారు. హెలెన్ హరికేన్ USలో విధ్వంసం సృష్టించింది. వరదలు ముంచెత్తి రాకపోకలు నిలిచిపోయాయి. అలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోనూ తండ్రి జోన్స్ సౌత్ కరోలినా నుంచి కూతురు ఎలిజబెత్ పెళ్లి జరిగే జాన్సన్ సిటీకి 12 గంటల్లో చేరుకున్నారు.

News October 4, 2024

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

image

TG: హైడ్రా కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలంటూ KA పాల్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. కూల్చివేతలను ఇప్పటికిప్పుడు నిలిపివేయలేమంది. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, హైడ్రాకు నోటీసులు ఇచ్చింది. పిటిషన్‌లో G.O.99పై స్టే విధించాలని, కూల్చివేతలకు 30రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని, హైడ్రాకు చట్టబద్ధత కల్పించాకే కూల్చివేతలు చేపట్టాలని పాల్ కోరారు. తదుపరి విచారణ ఈనెల 14న జరగనుంది.

News October 4, 2024

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం: వైవీ, భూమన

image

AP: తిరుపతి లడ్డూ వివాదంపై స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని TTD మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నామని చెప్పారు. సిట్ దర్యాప్తుతో నిర్దోషులను దోషులుగా చూపించే అవకాశం ఉందనే అనుమానాలతో దానిని వ్యతిరేకించామన్నారు. తాను ఛైర్మన్‌గా ఉన్నప్పుడు AR కంపెనీ నెయ్యి సప్లై చేయలేదని వైవీ స్పష్టం చేశారు.

News October 4, 2024

ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్న Stock Markets

image

బెంచ్‌మార్క్ సూచీలు ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. అప్పటికప్పుడు పెరుగుతూ తగ్గుతూ వణుకు పుట్టిస్తున్నాయి. ఉదయం స్వల్ప నష్టాల్లో ట్రేడైన సూచీలు మధ్యాహ్నం భారీగా పుంజుకున్నాయి. 12.30PM తర్వాత మళ్లీ తగ్గాయి. 160 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ ప్రస్తుతం 26 పాయింట్ల నష్టంలో ఉంది. 800 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ -160కి వెళ్లింది. ఇంట్రాడే గరిష్ఠాల నమోదుకు ఇన్ఫీ, యాక్సిస్ బ్యాంకు షేర్లు తోడ్పడ్డాయి.