India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 10 రోజులుగా హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో 9 ఏళ్లు జైలు జీవితం గడిపిన సాయిబాబా ఈ ఏడాది మార్చిలో విడుదల అయ్యారు. తూ.గో. జిల్లా అమలాపురంలో జన్మించిన సాయిబాబా పోలియో కారణంగా ఐదేళ్ల వయసు నుంచి వీల్ చైర్ ఉపయోగిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్‌లో రామ్ పోతినేని ఓ సినిమా చేయనున్నారు. విజయదశమి సందర్భంగా ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీ డైరెక్టర్ మహేశ్ బాబు చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రామ్‌కు ఇది 22వ చిత్రం కాగా నవంబర్ నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నారు. హై ఎనర్జీతో న్యూ ఏజ్ స్టోరీ టెల్లింగ్‌తో మూవీ ఉంటుందని నిర్మాణ సంస్థ తెలిపింది.

అత్యంత తక్కువ విమాన ప్రయాణ సమయమెంతో తెలుసా..? కేవలం ఒకటిన్నర నిమిషమే! స్కాట్లాండ్‌లోని ఓర్క్నీ దీవుల నుంచి పాపా వెస్ట్రే దీవుల మధ్య 1.7 మైళ్ల దూరం తిరిగే లోగన్‌ఎయిర్ విమానం ఆలోపే ప్రయాణికుల్ని గమ్యం చేరుస్తుంటుంది. ఈ రూట్‌లో స్టువర్ట్ లింక్‌లేటర్ అనే పైలట్ 53 సెకన్లలోనే ప్రయాణించి రికార్డ్ క్రియేట్ చేశారు. అయితే ఈ ఫ్లైట్స్‌లో 10మంది మాత్రమే ప్రయాణించేందుకు వీలుంటుంది.

ఈ నెల 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పల్లెపండుగ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించే వారోత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. మొత్తం 13,324 పంచాయతీల్లో రూ.4,500 కోట్లతో ప్రభుత్వం పనులు చేపట్టనుంది. ఇంకుడు గుంతలు, పశువుల శాలలు, రోడ్లు ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

అది యూపీలోని ఘజియాబాద్. పాపం ఇంకా కళ్లు కూడా తెరవని ఓ పసిగుడ్డును ఎవరో కఠినాత్ములు పొదల్లో వదిలేశారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ పుష్పేంద్ర సింగ్ అక్కడికి చేరుకున్నారు. ఆ బుజ్జాయిని చూసి చలించిపోయారు. పెళ్లై ఆరేళ్లైనా ఆయనకు పిల్లలు కలగలేదు. దీంతో దశమి రోజు దేవుడిచ్చిన వరంగా భావించి భార్యతో కలిసి ఆ చంటిదాన్ని దత్తత తీసుకున్నారు. ఆయన నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

35 బాల్స్- రోహిత్ శర్మ vs శ్రీలంక
40- సంజూ శాంసన్ vs బంగ్లాదేశ్
45- సూర్య కుమార్ యాదవ్ vs శ్రీలంక
46*- అభిషేక్ శర్మ vs జింబాబ్వే
46- కేఎల్ రాహుల్ vs వెస్టిండీస్

ప్రేమలో ఉన్న కూతురిని హత్య చేయించాలనుకుందో తల్లి. అందుకోసం ఓ కాంట్రాక్ట్ కిల్లర్‌కి సుపారీ ఇచ్చింది. అయితే ఆ కిల్లర్ తల్లినే చంపేశాడు. మతిపోయే ట్విస్ట్ ఏంటంటే.. కూతురి లవర్ ఆ కిల్లరే! ఈ నేరకథా చిత్రం యూపీలో చోటుచేసుకుంది. ఈ నెల 6న మృతురాలి శవాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా విషయం వెలుగుచూసింది. మృతురాలి కూతురు, ఆమె లవర్ కమ్ కిల్లర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంట విజయ దశమి వేడుకలు ఘనంగా జరిగాయి. సతీమణి, కుమారుడు, కోడలు, మనుమరాలుతో గులాబీ దళపతి వేడుకల్లో పాల్గొన్నారు. విదేశాల్లో ఉన్న ఆయన మనుమడు హిమాన్షు అందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. తొలిసారిగా కుటుంబం దగ్గర లేకుండా దసరా చేసుకుంటున్నానని తెలిపారు. చాలా రోజుల తర్వాత బయటికొచ్చిన తమ అధినేత ఫొటోను బీఆర్ఎస్ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి.

ఉప్పల్‌లో బంగ్లాదేశ్‌పై సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. కేవలం 40 బంతుల్లోనే సూపర్ సెంచరీ చేశారు. రిషాద్ హొస్సేన్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో 5 సిక్సులు బాదారు. మొత్తంగా 8 సిక్సులు, 9 ఫోర్లు కొట్టారు. మరోవైపు కెప్టెన్ సూర్య కూడా 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో టీమ్ ఇండియా 12.1 ఓవర్లు ముగిసేసరికి 183 రన్స్ చేసింది. మరో 8 ఓవర్లు మిగిలున్న నేపథ్యంలో స్కోర్ ఎంత చేయొచ్చో కామెంట్ చేయండి.

AP: బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఈ నెల 14, 15, 16 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత సూచించారు. పోలీసులు, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. బలహీనంగా ఉన్న కాలువ, చెరువు గట్లను పటిష్ఠ పర్చాలని అన్నారు.
Sorry, no posts matched your criteria.