India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP:ప్రముఖ విద్యావేత్త, రత్నం విద్యాసంస్థల అధినేత కొర్రపాటి వెంకటరత్నం(82) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు. APలోనే తొలిసారిగా కోచింగ్ సెంటర్లను నెల్లూరులో ఏర్పాటు చేసిన ఘనత ఆయనది. పేద విద్యార్థులకు తమ సంస్థల్లో ఉచిత బోధన అందించిన ఆయన.. గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు సొంత డబ్బుతో శస్త్రచికిత్సలు చేయించారు. ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
AP: రాష్ట్రంలోని అన్ని సెట్‌టాప్ బాక్సుల సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు APSFL వెల్లడించింది. ఎన్నికల కోడ్‌కు అనుగుణంగా డేటాను మార్చుతున్నామని, 48 గంటల్లో సేవలను పునరుద్ధరిస్తామని తెలిపింది. ప్రభుత్వ ప్రకటనలు, అభివృద్ధి కార్యక్రమాల సమాచారం సెట్‌టాప్‌లలో ప్రసారం కావడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
AP: జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 27 నుంచి ఆయన ఉత్తరాంధ్రలో తొలివిడత పర్యటన ప్రారంభిస్తారని జనసేన పార్టీ తెలిపింది. కీలక నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని పేర్కొంది. పవన్ వారాహి యాత్ర కొన్ని నెలల క్రితం అర్ధాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్ని కొనసాగిస్తారని, ఈ మేరకు హైదరాబాద్ నుంచి మంగళగిరికి వారాహి వాహనం బయలుదేరిందని జనసేన వర్గాలు వెల్లడించాయి.
రేపటి నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. రెండున్నర నెలలపాటు క్రికెట్ ప్రేమికులను అలరించనుంది. 10 జట్లు టైటిల్ కోసం బరిలోకి దిగనున్నాయి. తొలి మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సీఎస్కే-ఆర్సీబీ మధ్య జరగనుంది. అలాగే ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీ వేడుకలు అదిరిపోనున్నాయి. ఏఆర్ రెహమాన్, అక్షయ్ కుమార్, సోనూ నిగమ్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్లు తమ ప్రదర్శనలతో అలరించనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఇవాళ ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, PDPL, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, KMM, NLG, SRPT, MHBD, WL, JN జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని IMD హెచ్చరించింది. ఏపీలోని అల్లూరి, కోనసీమ, తూ.గో, ELR, GNT, బాపట్ల, OGL జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది.
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘RC16’ మరో స్థాయిలో ఉంటుందని కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ తెలిపారు. ఆ మూవీలో ఆయన ప్రత్యేక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ‘బుచ్చిబాబు విజన్ ఉన్న దర్శకుడు. స్క్రిప్ట్ చెప్పేందుకు వచ్చినప్పుడు ఆయనకు అరగంటే టైమ్ ఇచ్చాను. కానీ గంటన్నర పాటు వింటూ ఉండిపోయాను. స్టోరీ అంత బాగుంది’ అని తెలిపారు. చరణ్ అద్భుతమైన నటుడే కాక చాలా మంచి మనిషని ఆయన కొనియాడారు.
సీఎస్కే కెప్టెన్ ధోనీ కనీసం మరో ఐదేళ్లు ఆడాలని ఆ జట్టు మాజీ ఆటగాడు సురేశ్ రైనా అభిప్రాయపడ్డారు. ‘ధోనీకి ఇప్పుడు 42ఏళ్లు. కానీ తన ఫిట్‌నెస్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఆయన మరో ఐదేళ్లు, కాదంటే కనీసం రెండుమూడేళ్లు ఆడాలి. తర్వాతి కెప్టెన్‌ను ఎంపిక చేసేందుకు ఈ సీజన్ సీఎస్కేకు అత్యంత కీలకం. ధోనీ కన్ను ఎవరి మీద పడుతుందో చూడాలి. కెప్టెన్సీకి రుతురాజ్ ఒక మంచి ఆప్షన్’ అని రైనా పేర్కొన్నారు.
TG: సికింద్రాబాద్ BRS MP అభ్యర్థిగా మాజీ మంత్రి పద్మారావు గౌడ్ పేరు ఖరారైనట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీసీ అభ్యర్థిని బరిలోకి దించనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా బీసీకే ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తొలుత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడిని పోటీ చేయించాలని ప్రయత్నించగా ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. దీంతో పద్మారావును అభ్యర్థిగా నిర్ణయించినట్లు టాక్.
TG: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలుకు ఈసీ పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. దీంతో పథకాలు, కార్యక్రమాలపై ప్రభావం పడుతోంది. మంత్రులను కలిసేందుకు వచ్చే ప్రజలు, సందర్శకులను సచివాలయంలోకి అనుమతించడం లేదు. అత్యవసర పనులు ఉంటే తప్ప సెక్రటేరియట్‌లోకి అనుమతిపై ఆంక్షలు విధించారు. మరోవైపు కోడ్ రాకతో పోలీస్, ఈసీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. సరైన పత్రాలు లేకుండా తరలించే నగదును పట్టుకుని సీజ్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2024 ప్రారంభానికి కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. మార్చి 22న సీఎస్‌కే, ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ సంగ్రామానికి తెరలేవనుంది. ఈ క్రమంలో ఆయా జట్ల బలాబలాలపై చర్చ జరుగుతోంది. టీ20 ఫార్మాట్ కావడంతో ప్రతి జట్టుకూ ఓపెనర్లే కీలకం. పవర్ ప్లేలో వారు చేసే పరుగులే గెలుపోటములను నిర్ణయిస్తాయి. మరి ఈ సీజన్‌లో ఏ జట్టు ఓపెనింగ్ పెయిర్ బలంగా ఉంది? కామెంట్ చేయండి..
Sorry, no posts matched your criteria.