news

News March 21, 2024

రైలు టికెట్లు కొనడానికీ మా వద్ద డబ్బుల్లేవ్: రాహుల్

image

కాంగ్రెస్ పార్టీ ప్రధాన బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ కావడంతో ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితి తలెత్తిందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నేతలను ఎక్కడికీ పంపించలేకపోతున్నామని తెలిపారు. విమాన ప్రయాణాల సంగతి తర్వాత.. కనీసం రైలు టికెట్లు కొనడానికీ తమ వద్ద డబ్బుల్లేవని చెప్పారు. దేశంలో 20శాతం ఓటర్లు తమకు మద్దతుగా ఉన్నారని.. కానీ రెండు రూపాయలు కూడా ఖర్చు చేయలేకపోతున్నామన్నారు.

News March 21, 2024

సచిన్ వల్లే ఆ రోజు పుంజుకున్నాను: ఆరోన్

image

తన అరంగేట్ర టెస్టులో సచిన్ వల్లే పుంజుకున్నానని పేస్ బౌలర్ వరుణ్ ఆరోన్ వెల్లడించారు. ‘వాంఖడేలో నా డెబ్యూ మ్యాచ్ అది. 21 ఓవర్లు వేసినా నాకు వికెట్ రాలేదు. దీంతో బాగా డీలా పడ్డాను. సచిన్ నన్ను చూసి దగ్గరికి వచ్చారు. తాను వరల్డ్ కప్‌ కోసం 21 ఏళ్లు వెయిట్ చేశానని గుర్తు చేసి నన్ను ప్రోత్సహించారు. ఆ తర్వాతి బంతికే వికెట్‌ తీశాను. ఇన్నింగ్స్‌లో మరో రెండు వికెట్లు దక్కాయి’ అని గుర్తుచేసుకున్నారు.

News March 21, 2024

కేంద్రానికి షాకిచ్చిన ఎన్నికల సంఘం

image

వాట్సాప్‌లో ‘వికసిత్ భారత్’ సందేశాలను పంపడం ఆపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గత పదేళ్లలో కేంద్రం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ‘వికసిత్ భారత్ సంపర్క్’ పేరిట కేంద్రం WhatsAppలో ఓ <<12863874>>మెసేజ్<<>> పంపుతోన్న సంగతి తెలిసిందే. ఈ సందేశాలు ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే పంపామని, నెట్‌వర్క్ సమస్య వల్ల ఇప్పుడు వస్తున్నాయని ఈసీకి కేంద్రం వివరణ ఇచ్చింది.

News March 21, 2024

వైసీపీ నేతలతో సంబంధాల్లేవు: బోడె ప్రసాద్

image

AP: వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ విషయంపై కొందరు టీడీపీ అధిష్ఠానానికి తప్పుడు ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. ‘టీడీపీ టికెట్ నాకే వస్తుందని నమ్ముతున్నా. అధిష్ఠానం తీసుకునే నిర్ణయాన్ని బట్టి నేను పోటీ చేసే విషయం ఆధారపడి ఉంటుంది’ అని తెలిపారు. పెనమలూరు టికెట్‌ రాకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు.

News March 21, 2024

అయోధ్య రాముడిని దర్శించుకున్న దక్షిణాఫ్రికా క్రికెటర్

image

దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహారాజ్ వీలు చిక్కినప్పుడల్లా దైవ దర్శనానికి వెళ్తుంటారు. తాజాగా ఆయన అయోధ్య రామ మందిరానికి వెళ్లారు. భారత ప్లేయర్ రవి బిష్ణోయ్‌తో కలిసి బాలరాముడిని దర్శించుకున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో వీరిద్దరు లక్నో జట్టు తరఫున ఆడనున్నారు.

News March 21, 2024

పవన్‌ను లక్ష మెజార్టీతో గెలిపించుకుంటాం: TDP

image

AP: ‘పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించేవాళ్లలో మొదటి వరసలో ఉండేది టీడీపీ’నే అంటూ వైసీపీ చేసిన <<12895964>>విమర్శలకు<<>> తెలుగు దేశం Xలో కౌంటర్ ఇచ్చింది. ‘పవన్‌ను పిఠాపురంలో లక్ష మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మాది. కొంపలో కుంపటితో నీ పులివెందులలో బొక్క పడింది.. అది పూడ్చుకో ముందు. సీఎం సీటుతో పాటు ఎమ్మెల్యేగా కూడా ఓడిపోతున్నావ్’ అని మండిపడింది.

News March 21, 2024

మహిళా ప్రధాని డీప్‌ఫేక్ పోర్న్ వీడియోలు.. కోర్టులో దావా

image

డీప్‌ఫేక్ వీడియోలు సినీ తారలనే కాదు.. దేశాధినేతలనూ వదలడం లేదు. ఇటీవల ఇటలీ PM జార్జియా మెలోని డీప్‌ఫేక్ పోర్న్ వీడియోలు ఆన్‌లైన్‌లో వైరలయ్యాయి. మెలోని ఫేస్‌తో వీడియోలు సృష్టించిన తండ్రీకొడుకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై PM రూ.91 లక్షల పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో ఆమె జులై 2న కోర్టు ముందు సాక్ష్యం చెప్పనున్నారు. కాగా మన దేశంలో రష్మిక డీప్‌ఫేక్ వీడియో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

News March 21, 2024

ఏపీ ఎన్నికల ఇన్‌ఛార్జులను ప్రకటించిన బీజేపీ

image

ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏపీ, రాజస్థాన్, హరియాణాకు బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జి, కో-ఇన్‌ఛార్జీలను నియమించింది. ఏపీ ఎన్నికల ఇన్‌ఛార్జిగా బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, కో-ఇన్‌ఛార్జిగా యూపీ మాజీ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్‌ను నియమించింది. రాజస్థాన్‌కు వినయ్, విజయా, ప్రవేశ్ వర్మను, హరియాణాకు సతీశ్ పూనియా, సురేంద్ర సింహ్ నాగర్‌ను నియమించింది.

News March 21, 2024

వాలంటీర్లపై APCEO పేరుతో ఫేక్ న్యూస్..

image

AP: ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రచారాల్లో పాల్గొంటున్న వాలంటీర్లపై ఉన్నతాధికారులు వేటు వేస్తున్నారు. మరోవైపు ఇదే అంశంపై ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పేరుతో ఓ న్యూస్ వైరలవుతోంది. ‘ఎన్నికల కమిషనర్ నిర్ణయం.. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాలంటీర్లు కనబడితే వెంటనే ఫొటో లేదా వీడియో తీసి 9676692888కు వాట్సాప్ చేయండి’ అని అందులో ఉంది. అయితే ఇది ఫేక్ న్యూస్ అని APCEO ట్వీట్ చేశారు.

News March 21, 2024

కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న హీరోయిన్?

image

హీరోయిన్ అమలాపాల్ కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘2 హ్యాపీ కిడ్స్’ అని పేర్కొంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె రెండు లవ్ సింబల్స్ పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఓ పాపను ఎత్తుకుని తీసుకున్న ఫొటోను కూడా ఆమె షేర్ చేశారు. జగత్ దేశాయ్‌ను రెండో పెళ్లి చేసుకున్న ఆమె.. తాను తల్లి కాబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు.