news

News March 30, 2024

ఎల్లో అలర్ట్: అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

image

తెలంగాణలో ఎండ బెంబేలెత్తిస్తోంది. నిత్యం సాధారణం కంటే 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. బయటికి వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

News March 30, 2024

జమ్మూ కశ్మీర్‌లో సీఎం రేవంత్ ప్రచారం

image

TG: సీఎం రేవంత్ రెడ్డి జమ్మూ కశ్మీర్‌లో ప్రచారం చేయనున్నారు. ఇండియా కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు ఆయన అక్కడికి వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. కాంగ్రెస్ ఇప్పటికే 27 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. కాగా రేవంత్ ఇటీవల ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. విశాఖపట్నంలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో పాల్గొన్నారు.

News March 30, 2024

రాజకీయాలకు TDP మాజీ మంత్రి వీడ్కోలు

image

AP: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ రాజకీయాలకు వీడ్కోలు పలికారు. విశాఖపట్నం జిల్లా పరవాడ మండలం వెన్నెల పాలెంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ ప్రకటన చేశారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదన్న ఆయన, రాజకీయంగా తనకు ఇదే చివరి సమావేశం అన్నారు. సాటి కార్యకర్తలకు అండగా నిలబడతానన్నారు.

News March 30, 2024

కాసేపట్లో కేశవరావు ఇంటికి సీఎం రేవంత్

image

TG: కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించిన బీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి మరికాసేపట్లో వెళ్లనున్నారు. ఆయనను లాంఛనంగా పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇదిలా ఉంటే కేకే కూతురు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మీ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు.

News March 30, 2024

రాహుల్‌కి ఏమైంది? కెప్టెన్సీ మార్పు ఎందుకు?

image

పంజాబ్‌తో మ్యాచ్‌లో లక్నో కెప్టెన్సీ బాధ్యతలు నికోలస్ పూరన్ నిర్వర్తిస్తున్నారు. అకస్మాత్తుగా కెప్టెన్సీ మార్పుపై అందరిలో సందేహలు నెలకొన్నాయి. అయితే ఈ విషయంలో పూరన్ క్లారిటీ ఇచ్చారు. ‘రాహుల్ గాయం నుంచి కోలుకొని దాదాపు రెండు నెలల తర్వాత క్రికెట్ ఆడుతున్నారు. ఆయనకు కొంచెం విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించాం. రాహుల్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా అందుబాటులో ఉంటారు’ అని పూరన్ వెల్లడించారు.

News March 30, 2024

DK శివకుమార్‌కు ఐటీ నోటీసులు

image

కర్ణాటక డిప్యూటీ CM డికె.శివకుమార్‌కు ITశాఖ నోటీసులు ఇచ్చింది. తనకు నిన్న రాత్రి ఇన్‌కం ట్యాక్స్ ఆఫీస్ నుంచి నోటీసులు వచ్చాయని ఆయన వెల్లడించారు. ‘కేంద్రంలోని BJP ప్రతిపక్షాలను ఎందుకు ఇలా వేధిస్తోంది? ఈ ఎన్నికల్లో తాము ఓడిపోతామనే భయంతో ఇవన్నీ చేస్తోంది. చివరికి కమ్యూనిస్టు పార్టీ నేతలను కూడా బీజేపీ టార్గెట్ చేసింది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు’ అని మండిపడ్డారు.

News March 30, 2024

అందుకే అతడితో కెమిస్ట్రీ కుదిరింది: శ్రుతి హాసన్

image

డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తన స్నేహితుడని.. అందుకే ‘ఇనిమేల్’ పాటలో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ అన్నారు. ‘లోకేశ్ గొప్ప దర్శకుడే కాకుండా నటుడు కూడా. ఈ పాట చేయడానికి ఆయన అంగీకరించినప్పుడు ఎగిరి గంతేశా. కెమెరా ముందు ఆయన బాగా నటించారు. తొలుత ఈ పాటను ఇంగ్లిష్‌లో రాశాం. ఆ తర్వాత నాన్న (కమల్ హాసన్) సాయంతో తమిళంలో చేశాం’ అని ఆమె చెప్పారు.

News March 30, 2024

తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడండి: సీఎం

image

TG: వేసవి నేపథ్యంలో విద్యుత్, తాగునీటి అవసరాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రిజర్వాయర్లలో సరిపడా నీరుందని, నిరంతర నీటి సరఫరాపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని, వృథాపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం సూచించారు.

News March 30, 2024

IPL: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో

image

పంజాబ్‌తో మ్యాచులో లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో నికోలస్ పూరన్ లక్నో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. రాహుల్‌కు రెస్ట్ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
PBKS: ధావన్, బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, కరన్, జితేష్, శశాంక్, బ్రార్, హర్షల్, రబడా, చాహర్, అర్ష్‌దీప్
LSG: డీకాక్, రాహుల్, పడిక్కల్, బదోనీ, పూరన్, స్టోయినిస్, కృనాల్, బిష్ణోయ్, మొహ్సిన్, మయాంక్ యాదవ్, మణిమారన్

News March 30, 2024

పెళ్లైన కొన్ని గంటల్లోనే వధువు మృతి

image

AP: పెళ్లైన కొన్ని గంటల్లోనే ఓ నవ వధువు మృతిచెందారు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దబ్బగడ్డలో జరిగింది. నిన్న రాత్రి 10 గంటలకు ఓ యువకుడితో అఖిల (20) వివాహం జరిగింది. ఆ తర్వాత నీరసంగా ఉందంటూ నిద్రపోయారు. కాసేపటి తర్వాత కుటుంబసభ్యులు పిలిచినా స్పందించకపోవడంతో వెంటనే ఆమెను సాలూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మరణించినట్లు తెలిపారు.