news

News March 20, 2024

గ్రీన్ జెర్సీని రివీల్ చేసిన ఆర్సీబీ ప్లేయర్లు

image

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2011 నుంచి ప్రతి ఐపీఎల్ సీజన్‌లో గ్రీన్ జెర్సీలో ఒక మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఐపీఎల్-17కు సంబంధించి జెర్సీని ఆ టీమ్ రివీల్ చేసింది. చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌కి విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రజత్ పాటీదార్, మహిపాల్ లోమ్రోర్‌ గ్రీన్ జెర్సీలో హాజరయ్యారు.

News March 20, 2024

ప్రతి మహిళకు ₹1000: DMK

image

తమిళనాడులో అధికార పార్టీ DMK లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది. NHలపై టోల్ బూత్‌ల తొలగింపు, ప్రతి మహిళకు ₹1000, విద్యార్థులకు NEET నుంచి మినహాయింపు, మహిళలకు 33% రిజర్వేషన్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను ₹75, ₹65, ₹500గా ఖరారు చేస్తామని పేర్కొంది. స్టూడెంట్స్‌కు ఫ్రీ సిమ్ కార్డు, నెలకు 1GB డేటా, స్వయం సహాయక మహిళా గ్రూపులకు ₹10లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపింది.

News March 20, 2024

చంద్రబాబు రాజకీయ వికలాంగుడు: పెద్దిరెడ్డి

image

AP: టీడీపీ చీఫ్ చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రాజకీయ వికలాంగుడని అన్నారు. ‘చంద్రబాబుకు బీజేపీ, జనసేన ఊతకర్రలా నిలబడ్డాయి. పొత్తులు ఉంటేనే ఆయన నిలదొక్కుంటారు. బాబుది అందితే జుట్టు.. లేకుంటే కాళ్లు అనే నైజం. ఈ మూడు పార్టీల పొత్తు ముందే ఊహించాం’ అని దుయ్యబట్టారు.

News March 20, 2024

ఆ వ్యాఖ్యలను పెద్దిరెడ్డి వెనక్కి తీసుకోవాలి: అచ్చెన్నాయుడు

image

AP: చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను మంత్రి పెద్దిరెడ్డి వెనక్కి తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. మాఫియాలతో పొత్తులేకుండా పెద్దిరెడ్డి ఎన్నికల్లో నిలబడాలన్నారు. స్వేచ్ఛగా పోలింగ్ జరిగితే పుంగనూరులో పెద్దిరెడ్డి ఓటమి ఖాయమని చెప్పారు. టీడీపీ పొత్తులు బహిరంగమేనని.. జగన్‌వి చీకటి పొత్తులని విమర్శించారు. ఓటమి భయంతోనే పెద్దిరెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు.

News March 20, 2024

అయోధ్య రామయ్య సేవలో ప్రియాంక చోప్రా

image

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అయోధ్యలో బాలరాముడిని దర్శించుకున్నారు. భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్టీ మేరీ జోనాస్‌తో కలిసి బాలరామయ్య సేవలో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రామజన్మభూమిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఆమె తొలిసారి దర్శించుకున్నారు.

News March 20, 2024

5,348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

image

TG: వైద్యారోగ్య శాఖలో 5,348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యారోగ్య సర్వీసుల నియామక బోర్డు ద్వారా ఐపీఎం, డీఎంఈ, వైద్యవిధాన పరిషత్ విభాగాల్లో ఈ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.

News March 20, 2024

ఇంజెక్షన్లు ప్రాణాల మీదకు తెచ్చాయి!

image

అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన అలీసియా హల్లోక్ బోటాక్స్ ఇంజెక్షన్లు తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మైగ్రేన్ నుంచి రిలీఫ్ పొందేందుకు ఆమె ఈ ఇంజెక్షన్లు తీసుకోగా అవి వికటించి పక్షవాతం బారిన పడేలా చేశాయి. అంతేకాదు కంటిచూపు మందగించడం, మాట్లాడలేకపోవడం, ఆహారాన్ని తీసుకోలేకపోవడం మొదలైన సమస్యలు కూడా వచ్చాయట. దీనిపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె తాను ఇక బతకనేమోనని అనుకున్నానని వాపోయారు.

News March 20, 2024

నా ఫోన్ కాల్ రికార్డ్ చేశాడు: పొన్నం

image

TG: హనుమకొండ ఆర్డీవో తన ఫోన్ కాల్ రికార్డ్ చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పంపించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆయనపై సీఎస్‌ శాంతికుమారికి ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌తో కరవు వచ్చిందంటూ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని పొన్నం మండిపడ్డారు. పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

News March 20, 2024

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి కిడ్నాప్!

image

చదువు కోసం USలోని ఓహియో రాష్ట్రానికి వెళ్లిన అబ్దుల్ మహ్మద్ అనే హైదరాబాద్ విద్యార్థిని దుండగులు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్ మాఫియాకి చెందిన కొందరు అబ్దుల్‌ను కిడ్నాప్ చేశారని గుర్తుతెలియని వ్యక్తుల నుంచి గతవారం అబ్దుల్ తల్లిదండ్రులకు ఫోన్ వచ్చిందట. $1200 (రూ.99,750) ఇవ్వాలని లేదంటే బాధితుడి కిడ్నీ అమ్మేస్తామని బెదిరించారని సమాచారం. దీనిపై అక్కడున్న అబ్దుల్ బంధువులు పోలీసులను ఆశ్రయించారు.

News March 20, 2024

SRH కెప్టెన్సీ మార్పుతో షాకయ్యా: అశ్విన్

image

SA20లో సన్‌రైజర్స్ జట్టును రెండుసార్లు విజేతగా నిలిపారు కెప్టెన్ మార్క్రమ్. అలాంటి ఆటగాడిని ఐపీఎల్‌లో SRH కెప్టెన్‌గా తప్పించడం షాక్ గురిచేసిందని భారత బౌలర్ అశ్విన్ అన్నారు. ‘మళ్లీ మార్క్రమ్‌నే కొనసాగిస్తారని నేను భావించా. అలాంటిది వాళ్లు కెప్టెన్‌ను మార్చడం నాకు షాకింగ్‌గా అనిపించింది. కమిన్స్‌ను కెప్టెన్‌ చేయడం కచ్చితంగా సన్‌రైజర్స్‌ తుది జట్టు కూర్పును ఇబ్బంది పెడుతుంది’ అని స్పష్టం చేశారు.