news

News April 5, 2024

ఇన్‌స్టా కలిపింది ఇద్దరినీ.. 80 వెడ్స్ 34!

image

మధ్యప్రదేశ్‌లోని సుస్నేర్‌లో బాలూరామ్ (80) అనే వృద్ధుడు మహారాష్ట్రకు చెందిన షీలా (34)ను వివాహమాడారు. బాలూరామ్‌తో ఫన్నీ రీల్స్‌ చేసి స్నేహితుడు విష్ణుగుజ్జార్‌ ఇన్‌స్టాలో షేర్ చేసేవారు. ఇవి చూసి షీలా బాలూరామ్‌తో పరిచయం పెంచుకున్నారు. ప్రేమ చిగురించడంతో ఈనెల 1న పెళ్లి చేసుకున్నారు. భార్యను కోల్పోవడం, ఆర్థిక సమస్యలతో డిప్రెషన్‌కు గురైన బాలూరామ్‌ కోలుకునేందుకు విష్ణు ఈ రీల్స్ చేయడం స్టార్ట్ చేశారట.

News April 5, 2024

జగన్‌పై వైఎస్ వివేకా భార్య పోటీ?

image

AP: పులివెందులలో సీఎం వైఎస్ జగన్‌పై దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. కాగా వైఎస్ వివేకా హత్యలో జగన్ హస్తం ఉందని వివేకా కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయనను గద్దె దించేందుకు పోటీకి సిద్ధమైనట్లు సమాచారం.

News April 5, 2024

ఫ్యాన్స్ మధ్య బ్రహ్మి సందడి

image

హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం సందడి చేశారు. హైదరాబాద్ – చెన్నై మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. బ్రహ్మానందంను చూసిన క్రికెట్ అభిమానులు బ్రహ్మి.. బ్రహ్మి అంటూ కేరింతలు కొడుతున్నారు. అలాగే, సీఎం రేవంత్, ప్రముఖ సినీ నటులు చిరంజీవి, వెంకటేశ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మ్యాచ్‌ను తిలకిస్తున్నారు.

News April 5, 2024

YCPని తుంగలో తొక్కుతాం: నాగబాబు

image

AP: వైసీపీ ప్రభుత్వం మధ్యతరగతి కుటుంబాలను నిర్లక్ష్యం చేసిందని జనసేన నేత నాగబాబు విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి లేదని CM జగన్ చెప్పడం అతి పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. సానుభూతితో ప్రజలు ఒక్కసారి ఓటు వేసినందుకు సుసంపన్నమైన ఏపీని నాశనం చేశారని మండిపడ్డారు. ప్రజలను పీడిస్తోన్న వైసీపీని వచ్చే ఎన్నికల్లో తుంగలో తొక్కుతామని, కూటమి గెలవబోతోందని జోస్యం చెప్పారు.

News April 5, 2024

ఇంటి అద్దె కట్టలేక బాధపడ్డాం: రష్మిక

image

తన బాల్యంలో ఆర్థిక కష్టాల కారణంగా ఇంటి అద్దె కట్టలేకపోయామని నేషనల్ క్రష్ రష్మిక మందన్న తెలిపారు. ‘నా చిన్నప్పుడు సొంత ఇల్లు లేదు. ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇల్లు మారేవాళ్లం. అద్దె కట్టలేక రోడ్డున పడ్డ సందర్భాలు ఉన్నాయి. నా తల్లిదండ్రులు నేను ఆడుకోవడానికి బొమ్మను కూడా కొనలేకపోయారు. అందుకే ఇప్పుడు నేను డబ్బుకు విలువిస్తాను. సక్సెస్‌ను అంత ఈజీగా తీసుకోను’ అని ఆమె చెప్పారు.

News April 5, 2024

1912 నాటి టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ

image

112ఏళ్ల నాటి టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ తాజాగా బయటపడింది. ప్రయాణికుల కోసం రూపొందించిన ఈ మెనూ వైరలవుతోంది. అల్పాహారం నుంచి లంచ్ వరకు కన్సోమ్ ఫెర్మియర్, ఫిల్లెట్ ఆఫ్ బ్రిల్, చికెన్ ఎలా మేరీల్యాండ్, కార్న్డ్ బీఫ్, బంగాళాదుంపలు, సీతాఫలం పుడ్డింగ్, యాపిల్ మెరింగ్యూ, పేస్ట్రీ వంటివి మెనూలో ఉన్నాయి. 1912 APR14న ఈ మెనూ రూపొందించగా మరుసటి రోజు షిప్ సముద్రంలో మునిగిపోయి 1500 మంది జలసమాధి అయిన విషయం తెలిసిందే.

News April 5, 2024

రూ.100 కోట్లకు చేరువలో ‘టిల్లు స్క్వేర్’

image

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘టిల్లు స్క్వేర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా మొదటి వారంలో రూ.94 కోట్ల గ్రాస్ రాబట్టి రూ.100 కోట్ల క్లబ్‌కు చేరువైంది. డైరెక్టర్ మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించారు. నేహా శెట్టి కీలకపాత్రలో నటించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు.

News April 5, 2024

పొలంలో కేసీఆర్.. స్టేడియంలో రేవంత్: BRS

image

TG: మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న CSK, HYD మ్యాచును వీక్షిస్తున్నారు. దీంతో ఇద్దరి ఫొటోలను నెట్టింట షేర్ చేస్తున్న బీఆర్ఎస్ నేతలు.. కేసీఆర్ రైతుల సమస్యలు తెలుసుకుంటుంటే, రేవంత్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని మండిపడుతున్నారు.

News April 5, 2024

MIతో మ్యాచ్‌కు ఢిల్లీ స్టార్ ప్లేయర్ దూరం?

image

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ కుల్దీప్ యాదవ్ మరో మ్యాచ్‌కు దూరమవుతున్నట్లు తెలుస్తోంది. అతడు గాయం నుంచి ఇంకా కోలుకోలేదని సమాచారం. దీంతో వచ్చే ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌కు కుల్దీప్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన NCA పర్యవేక్షణలో ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ ద‌ృష్ట్యా అతడి గాయం పూర్తిగా మానితేనే బరిలోకి దించాలని బీసీసీఐ కూడా భావిస్తున్నట్లు సమాచారం.

News April 5, 2024

భారత్.. బంగారు కొండ

image

కొన్ని నెలలుగా బంగారం ధర రికార్డు స్థాయిలో పెరుగుతుండగా, భారత్ కూడా భారీగా కొనుగోలు చేస్తోంది. రెండేళ్లలోనే అత్యధికంగా ఈ జనవరిలో ఏకంగా 8.7 టన్నుల పసిడిని RBI కొనడంతో నిల్వ 812.3 టన్నులకు చేరింది. ఫారెక్స్ నిల్వలను పెంచుకోవడంలో భాగంగానే గోల్డ్ కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు RBI గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.