news

News May 2, 2024

ఎన్నికలంటేనే ఇన్ని హామీలు ఉండాల్సిందేనా?

image

ఎన్నికలంటేనే హామీల వర్షాలు. ఒక పార్టీని మించి మరో పార్టీ ప్రజలకు విచ్చలవిడిగా హామీలు ఇచ్చేస్తుంటాయి. ఒక్కోసారి హామీల అమలుకు రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోని పరిస్థితి ఉంటుంది. వాస్తవానికి ప్రజలే ఇన్ని హామీలు అడుగుతున్నారా? పార్టీలే ప్రజలను హామీల ఉచ్చులో పడేస్తున్నాయా? అంటే ఎవరూ దానికి సమాధానం చెప్పలేరు. రాష్ట్రాలను సంక్షోభంలోకి నెట్టే ఈ హామీలపై మీరేమంటారు? ప్రజలకు ఏమి అవసరమో కామెంట్ చేయండి.

News May 2, 2024

ఆ సర్టిఫికెట్లపై మోదీ ఫొటో తొలగించండి

image

కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలను తొలగించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల వేళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండటంతో ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2022లో ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపుర్, గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇలాంటి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.

News May 2, 2024

తిరుమలలో పెరిగిన రద్దీ

image

వేసవి సెలవుల కారణంగా తిరుమలలో రద్దీ పెరిగింది. 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 72,510 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,441 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.62 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

News May 2, 2024

అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్

image

TG: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ మన్నె సతీశ్, నవీన్, తస్లీమాను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఢిల్లీ పోలీసుల కంటే ముందుగానే హైదరాబాద్ పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు.

News May 2, 2024

వామ్మో.. ఒక్కో ఎపిసోడ్‌కు రూ.5కోట్లు?

image

ఇండియాలో మోస్ట్ పాపులర్ కమెడియన్ కపిల్‌శర్మ కామెడీ టైమింగే కాదు.. రెమ్యునరేషన్‌ కూడా ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఆయన హోస్ట్ చేస్తున్న ‘గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇందులో టాప్ ఇండియన్ సెలబ్రిటీలు పాల్గొంటున్నారు. అయితే.. కపిల్ ఈ షో కోసం ఒక్కో ఎపిసోడ్‌కు ఏకంగా రూ.5కోట్లు ఛార్జ్ చేస్తున్నారట. ఆడియన్స్‌లో కూర్చొని నవ్వే నటి అర్చన‌సింగ్ రూ.10లక్షలు తీసుకోవడం విశేషం.

News May 2, 2024

రేపు మేనిఫెస్టో విడుదల చేయనున్న రేవంత్

image

తెలంగాణ కోసం ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ రేపు విడుదల చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం.11గంటలకు మేనిఫెస్టో విడుదల చేయనుండగా.. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తామనే విషయాన్ని వెల్లడించనున్నారు. విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లకు మేనిఫెస్టోలో చోటు కల్పించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

News May 2, 2024

జగన్‌పై ఈసీ నిషేధం విధించాలి: ప్రత్తిపాటి

image

AP: సీఎం జగన్‌పై ఈసీ నిషేధం విధించాలని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. ‘జగన్ పదే పదే కోడ్ ఉల్లంఘిస్తున్నారు. విపక్ష నేతల వ్యక్తిగత జీవితాలపై ఆరోపణలు చేస్తున్నారు. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలతో ప్రతిపక్ష నేతలపై బురద జల్లుతున్నారు. పవన్, చంద్రబాబును అసభ్యంగా తిడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్‌లాగే ఏపీలో జగన్‌పైనా నిషేధం విధించాలి’ అని ఆయన పేర్కొన్నారు.

News May 2, 2024

‘టిల్లూ క్యూబ్‌’లో పూజా హెగ్డే?

image

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించనున్న ‘టిల్లూ క్యూబ్‌’ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే బుట్టబొమ్మను మేకర్స్ సంప్రదించగా ఆమె అంగీకరించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. ఇటీవల విడుదలైన టిల్లు స్క్వేర్ మూవీ సిద్ధు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.125 కోట్లకుపైగా కలెక్షన్లు (గ్రాస్) రాబట్టింది.

News May 2, 2024

అక్కడ శివసేన VS శివసేన

image

ముంబైలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ముంబైలో మొత్తం 6 LS నియోజకవర్గాలుండగా అందులో 3చోట్ల శివసేన పార్టీల మధ్య పోటీ నెలకొంది. దక్షిణ ముంబై, దక్షిణ మధ్య ముంబై, వాయవ్య ముంబైలో ఏక్‌నాథ్ శిండే శివసేన, ఉద్ధవ్ శివసేనకు చెందిన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. శివసేనలో కీలక నేతగా ఉన్న ఏక్‌నాథ్ పార్టీని చీల్చి BJPతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ ఎన్నికల్లో ఉద్ధవ్.. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తున్నారు.

News May 2, 2024

ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్

image

TG: ఇంటర్ పరీక్షలలో ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించేందుకు గడువు నేటితో ముగియనుంది. విద్యార్థులు తమ కాలేజీలోనే ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు. మరోవైపు ప్రిన్సిపల్స్ ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు గడువు రేపటి వరకు ఉంది. కాగా ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి.