India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కర్ణాటకలో ఎన్నికల వేళ JDSకు షాక్ తగిలింది. JDS నేత, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, హసన్ MP అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్న లైంగిక దాడి కేసులో చిక్కుకున్నారు. మహిళలపై లైంగిక దాడికి పాల్పడుతున్న వీడియో వైరల్‌గా మారటంతో కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ విదేశాలకు వెళ్లటం చర్చనీయాంశంగా మారింది. ప్రజ్వల్ NDA అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

హను-మాన్ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. దానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన వర్మ, ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు సమాచారం. బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కడంతో ఆ సినిమానే ముందు పూర్తిచేద్దామని భావిస్తున్నారట. రణ్‌వీర్ ‘శక్తిమాన్’ సినిమాలో హీరోగా చేయాల్సి ఉంది. ప్రశాంత్‌కు దక్కిన ఛాన్స్ ఆ సినిమాయేనా అన్నది చూడాల్సి ఉంది.

TG: రాష్ట్రంలో ఎండల తీవ్ర పెరిగిపోతోంది. సూర్యాపేటలో వడదెబ్బ తగిలి ఒకరు మృతి చెందారు. అనేక ప్రాంతాల్లో 45డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో 9 జిల్లాల్లో వాతావరణ శాఖ ఈరోజు, రేపు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ములుగు, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, వరంగల్ జిల్లాలు ఇందులో ఉన్నాయి.

గుజరాత్ తీరంలో అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలో దాదాపు 90 కేజీల డ్రగ్స్‌ను ఇండియన్ కోస్ట్ గార్డ్ పట్టుకుంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, గుజరాత్ ATSతో కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహించింది. డ్రగ్స్‌ను తరలిస్తున్న 14 మంది పాకిస్థానీయులను అదుపులోకి తీసుకుంది. పట్టుబడిన డ్రగ్స్ విలువ ₹600కోట్లు ఉంటుందని సమాచారం. గత కొన్ని రోజులుగా ఈ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు.

TG: సీఎం రేవంత్‌రెడ్డి మొనగాడు కాదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన సీఎం సీటు కదులుతుందనే భయంతోనే బీజేపీపై రేవంత్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని తన అజెండాలో లేదని, రేవంత్ మాటలకు స్పందించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. బీఆర్ఎస్‌పై కోపంతోనే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారని కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

భారత మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌ను పాకిస్థాన్ తమ కోచ్‌గా నియమించుకుంది. ఆయన వన్డేలు, టీ20లకు కోచింగ్ చేయనుండగా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు జాసన్ గిలెస్పీ టెస్టులకు పనిచేస్తారు. అజార్ మహమూద్ అన్ని ఫార్మాట్లలో అసిస్టెంట్ కోచ్‌గా కొనసాగనున్నారు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్‌ను కోచ్‌గా తీసుకోవాలని పాక్ తొలుత భావించినా, ఆయన భారీ మొత్తాన్ని డిమాండ్ చేయడంతో కిర్‌స్టెన్‌వైపు మొగ్గుచూపింది.

మతిస్థిమితం సరిగా లేని మహిళల సమ్మతితో చేసే సెక్స్‌ను అత్యాచారంగానే పరిగణించాలని ముంబైలోని సెషన్స్ కోర్టు పేర్కొంది. మతిస్థిమితం లేని వారు ప్రకృతి, పర్యావసానాలు అర్థం చేసుకోలేరని అభిప్రాయపడింది. తన పొరుగింట్లో ఉంటున్న మతిస్థిమితం లేని మహిళ(23)తో ఆమె ఇష్టపూర్వకంగానే ఓ వ్యక్తి(24) సెక్స్ చేశారు. ఆమె గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి రాగా.. ఈ కేసులో అతడికి 10ఏళ్లు జైలు శిక్ష విధించింది.

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ కూల్చేస్తుందని వస్తున్న వార్తలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తమకు అలాంటి ఆలోచనలు లేవని, ఆ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. తమకు ప్రజలు రెండుసార్లు అధికారం కట్టబెట్టారని, ఇప్పుడూ వారి నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పుకొచ్చారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.

ముద్దు సీన్స్ ఉన్న సినిమాల్లో తాను నటించేందుకు తల్లిదండ్రులు అంగీకరించేవారు కాదని నటి మృణాల్ ఠాకూర్ తాజాగా పేర్కొన్నారు. ఆ కారణంగా తాను చాలా అవకాశాల్ని కోల్పోయానని వెల్లడించారు. ‘నటిగా అక్కడ సన్నివేశం, కథ తాలూకు అవసరాన్ని చూడాల్సి ఉంటుంది. ముద్దు సన్నివేశం ఉందని సినిమాలు వదులుకుంటూ వెళ్తే ఇక సినిమాలు చేయడం కష్టం. ఇదే విషయాన్ని మా పేరెంట్స్‌కు అర్థమయ్యేలా చెప్పాల్సి వచ్చింది’ అని తెలిపారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు రేపు విచారించనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. కాగా.. ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈడీ అధికారులు తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తల ధర్మాసనం ఈ కేసును విచారించే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.