news

News April 28, 2024

పెళ్లి పత్రికపై పెంపుడు శునకాల పేర్లు

image

పెంపుడు శునకాలపై తనకున్న అమితమైన ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడో వ్యక్తి. తన పెళ్లి పత్రికపై వాటి పేర్లను ముద్రించాడు. మధ్యప్రదేశ్‌లోని రాణిపురలో ఈ ఘటన జరిగింది. ఐదేళ్ల క్రితం యశ్వంత్ స్కూటర్ కింద కుక్కపిల్ల పడగా దాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత శునకాలపై ఇష్టం ఏర్పడి మరో మూడింటిని పెంచుకుంటున్నాడు. ఇటీవల తన వివాహం జరగ్గా హల్దీ, సంగీత్, పెళ్లి ఊరేగింపులోనూ వాటిని భాగం చేశాడు.

News April 28, 2024

IPL: రిషభ్ పంత్‌పై ఒక మ్యాచ్ బ్యాన్?

image

రేపు KKRతో ఆడే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ పంత్ ఇప్పటికే రెండుసార్లు జరిమానా చెల్లించారు. నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మరోసారి అదే తప్పు రిపీట్ అయింది. ఈ నేపథ్యంలో పంత్‌కు రూ.30 లక్షల వరకు జరిమానాతో పాటు తర్వాతి మ్యాచ్‌కు వేటు పడే ఛాన్స్ ఉంది. అదే జరిగితే, రేపు కేకేఆర్‌తో ఆడే మ్యాచ్‌లో పంత్ లేనట్లే.

News April 28, 2024

పాలిసెట్‌ దరఖాస్తుకు నేడే ఆఖరు

image

TG: పాలిటెక్నిక్, డిప్లొమా, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్-2024కు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. కాగా ఆలస్య రుసుము రూ.100తో ఈ నెల 30 వరకు, రూ.300తో మే 20 వరకు అప్లై చేసుకోవచ్చని సాంకేతిక విద్యాశిక్షణ మండలి అధికారులు తెలిపారు. వచ్చే నెల 24న పరీక్షలు నిర్వహించి, పది రోజుల తర్వాత ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.

News April 28, 2024

కాంగ్రెస్ ట్విటర్ ఖాతాను బ్లాక్ చేయాలి: బీజేపీ

image

AP: కాంగ్రెస్ అధికారిక ట్విటర్ ఖాతాను బ్లాక్ చేయాలని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణ రాజు ఈసీని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్‌కు లేఖ రాశారు. షా ప్రసంగానికి తప్పుడు ఆడియోను జత చేసి కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని అందులో పేర్కొన్నారు. రిజర్వేషన్లను తొలగిస్తామని షా చెప్పినట్లుగా ఆడియో ఎడిటింగ్ చేస్తున్నారని, తక్షణం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

News April 28, 2024

నాగోల్-చాంద్రాయణగుట్ట రూట్‌లో 13 స్టేషన్లు

image

HYD నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించే మెట్రో మార్గంలో 13 స్టేషన్లు రానున్నాయి. న్యూ నాగోల్, నాగోల్ చౌరస్తా, అల్కాపురి చౌరస్తా, కామినేని ఆస్పత్రి, LBనగర్, సాగర్ రింగ్ రోడ్డు, మైత్రీనగర్, కర్మన్‌ఘాట్, చంపాపేట, ఒవైసీ ఆస్పత్రి, DRDO, హఫీజ్ బాబానగర్, చాంద్రాయణగుట్ట స్టేషన్లు రానున్నాయి. నాగోల్‌లో ఇప్పుడున్న స్టేషన్ నుంచి కొత్తగా నిర్మించే రూట్‌లోని స్టేషన్‌ను కలిపేలా స్కైవాక్‌ను నిర్మిస్తారు.

News April 28, 2024

టీడీపీలోకి కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు

image

AP: కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు టీడీపీలో చేరారు. ముమ్మిడివరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి బుచ్చిబాబు సమక్షంలో శ్రీను తండ్రి జనిపల్లి తాతారావు, తల్లి సావిత్రి, అన్నయ్య సుబ్బరాజు, చిన్నాన్న వెంకటేశ్వరావు TDP కండువా కప్పుకున్నారు. CM జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనుకి బెయిల్ రాకుండా సీఎం అడ్డుకున్నారని వారు ఆరోపించారు. ఐదేళ్లుగా తమకు కూటమి పార్టీల నేతలు, ప్రజా, దళిత సంఘాలు అండగా నిలిచాయన్నారు.

News April 28, 2024

GOOD NEWS.. తెలంగాణలో మళ్లీ వర్షాలు

image

తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయంది. కొన్ని చోట్ల వేడి, తేమతో కూడిన పరిస్థితులు ఉంటాయంది.

News April 28, 2024

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

image

TG: అధికార దుర్వినియోగంతో గెలిచిన BRS MLAల సభ్యత్వం రద్దు చేస్తామని కాంగ్రెస్ MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో BRS నేతలు పోలీసుల జీపుల్లో డబ్బులు తరలించి గెలిచారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ పూర్తైతే అలా గెలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి సహా 30 మంది MLAల సభ్యత్వం రద్దవుతుంది. కాళేశ్వరం విచారణ పూర్తైతే KCR, హరీశ్ కూడా జైలుకెళ్లక తప్పదు’ అని వ్యాఖ్యానించారు.

News April 28, 2024

నేడు నెల్లూరు, కర్నూలుకు చంద్రబాబు

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబు నేడు నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నెల్లూరులోని కోటమిట్ట వద్ద ఓ ఫంక్షన్ హాల్‌లో ముస్లింలతో ఆత్మీయ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు కర్నూల్ జిల్లా కౌతాళంలో, రాత్రి 7 గంటలకు గూడూరులో బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. రాత్రికి గూడూరులోనే ఆయన బస చేయనున్నట్లు సమాచారం.

News April 28, 2024

క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారికి అండగా మంత్రి

image

TG: అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతున్న ఎనిమిదేళ్ల చిన్నారి వేదవల్లికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అండగా నిలిచారు. మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు సహకరిస్తామని తెలిపారు. ప్రభుత్వం తరఫున ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎల్బీనగర్‌కు చెందిన వేదవల్లి వైద్యానికి ఇప్పటికే రూ.40 లక్షలు ఖర్చవగా.. మరో రూ.20 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు.