India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: మలివిడత ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా సీఎం జగన్ రేపు మూడు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో జరిగే సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్న ఆయన.. ఆ తర్వాత వెంకటగిరిలో త్రిభువని సర్కిల్‌లో జరిగే సభలో, అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరులో కేఎంసీ సర్కిల్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.

తెలంగాణలో మరో 3-4 రోజులు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపు ADB, ASF, మంచిర్యాల, నిర్మల్, NZB, JGTL, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, KTDM, KMM, NLG, SRPT, MBNR, WNP, గద్వాల్, NRPTలో వేడి మరియు తేమతో కూడిన పరిస్థితులుంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలోని 58 మండలాల్లో తీవ్ర వడగాలులు, 148 మండలాల్లో రేపు వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటించిన ‘హరోం హర’ మూవీ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ కృష్ణ జయంతి రోజు మే 31న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా తెలిపారు. జ్ఞానసాగర్ ద్వారక డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా కథ 1989 బ్యాక్‌డ్రాప్‌లో కుప్పం నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది.

TG: BRS పాలనలో రెప్పపాటు కూడా కరెంట్ పోలేదని KCR చెప్పారు. నాగర్‌కర్నూలులో ప్రసంగించిన ఆయన.. ‘నేను దిగిపోగానే కరెంట్ ఎందుకు పోతోంది? ఇవాళ అన్నం తింటుంటే 2 సార్లు కరెంట్ పోయింది. సీఎం కరెంట్ పోవడం లేదంటున్నారు. ప్రధాని మోదీ వంద నినాదాలు చేశారు. ఒక్కటైనా జరిగిందా? పదేళ్లలో రైతుల ఆదాయం పెరిగిందా? గ్యాస్ ధరలు తగ్గాయా? తెలంగాణకు ఒక్క నవోదయ స్కూలు, ఒక్క మెడికల్ కాలేజీ అయినా ఇచ్చారా?’ అని ప్రశ్నించారు.

దేశ ప్రజలందరూ ప్రధాని మోదీ కారణంగానే బతికున్నామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ తాజాగా అన్నారు. అందరూ బీజేపీకి ఓటేసి ఆయన రుణం తీర్చుకోవాలని కోరారు. ‘మనందరికీ ప్రధాని సకాలంలో వ్యాక్సిన్ అందించడం వల్లే ఈరోజున బతికున్నాం. టీకా లేకపోతే బతికేవాళ్లం కాదు. శాస్త్రవేత్తలకు అన్ని సదుపాయాలను కల్పించి భారత్‌లోనే టీకాల తయారీకి కృషి చేశారు. 100 దేశాలకు టీకాలు సరఫరా చేశారు’ అని తెలిపారు.

క్రికెట్‌లో పసికూన నేపాల్ సంచలనం సృష్టించింది. జాన్సన్ ఛార్ల్స్, ఆండ్రే ఫ్లెచర్, రోస్టన్ ఛేజ్ వంటి ఆటగాళ్లున్న విండీస్ జట్టును ఓడించింది. వెస్టిండీస్-ఏ జట్టు ప్రస్తుతం 5 టీ20 మ్యాచుల సిరీస్ కోసం నేపాల్‌లో పర్యటిస్తోంది. ఈరోజు తొలి మ్యాచ్ జరగగా విండీస్ 204 పరుగులు(రోస్టన్-74 రన్స్) చేసింది. ఛేదనలో మరో 2 బంతులు మిగిలుండగానే నేపాల్ ఆ స్కోరును దాటేసింది. రోహిత్ పౌడెల్ 54 బంతుల్లో సెంచరీ చేశారు.

TG: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీల్లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు ప్రకటన చేసింది. మే 24 జూన్ 1 వరకు ఉన్న పరీక్షల తేదీలను మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు మార్చింది. మే 27న నల్గొండ-ఖమ్మం-వరంగల్ MLC ఉప ఎన్నిక నేపథ్యంలో షెడ్యూల్‌లో మార్పులు చేసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తారు.

☞ మే 24- సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1/పేపర్-2
☞ మే 25- ఇంగ్లిష్ పేపర్-1,2
☞ మే 28- మ్యాథ్స్ 1A,2A/బోటనీ/PS పేపర్-1, 2
☞ మే 29- మ్యాథ్స్ 1B,2B/జువాలజీ/హిస్టరీ పేపర్-1,2
☞ మే 30- ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్-1,2
☞ మే 31- కెమిస్ట్రీ, కామర్స్ పేపర్-1,2
☞ జూన్ 1- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-1,2
☞ జూన్ 3- మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ పేపర్-1, 2

ఒకానొక సమయంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నానని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘1972లో ఓ కారు ప్రమాదంలో నా భార్య, కుమార్తె కన్నుమూశారు. దాంతో మద్యానికి పూర్తిగా బానిసైపోయాను. నదిలోకి దూకాలన్న పిచ్చి ఆలోచనలు వచ్చేవి. కానీ నా ఇద్దరు కుమారులు గుర్తొచ్చి ఆగిపోయేవాడిని’ అని వెల్లడించారు. 1977లో జిల్ బైడెన్‌ను పెళ్లి చేసుకున్న జో, అప్పటి నుంచి ఆమెతో వైవాహిక బంధంలో కొనసాగుతున్నారు.

BJP నేత, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఓటు వేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆయన కేరళలోని తిరువనంతపురం నుంచి MPగా పోటీ చేస్తున్నారు. ఆయనకు బెంగళూరులో ఓటు హక్కు ఉంది. ఈ రెండుచోట్లా నిన్న పోలింగ్ జరిగింది. కాగా తాను తిరువనంతపురంలో ఉండటానికే ప్రాధాన్యం ఇచ్చానని, ఓటు వేయలేదని చెప్పారు. దీంతో బాధ్యత గల పదవిలో ఉండి ఓటు వేయకపోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Sorry, no posts matched your criteria.