India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏపీలో జరగబోయే ఎన్నికలపై తెలంగాణ సీఎం రేవంత్ స్పందించారు. ‘దేశంలో ఎక్కడైనా ప్రస్తుత ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల ప్రతికూల వాతావరణం ఏర్పడింది. APలో మేం(కాంగ్రెస్) షర్మిల నాయకత్వంలో ఇన్నింగ్స్ ప్రారంభించాం. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకురావాలనేదే మా ప్రణాళిక. పార్టీకి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంపై మా దృష్టి ఉంది’ అని రేవంత్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

తెలుగు రాష్ట్రాల ఎన్నికల సమరంలో అంతిమంగా నిలిచేదెవరో ఇవాళ తేలిపోనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు మినహా గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థుల్లో చాలా మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకునే ఛాన్సుంది. ఇప్పటికే స్క్రూటినీలో కొందరి నామినేషన్లు తిరస్కరణకు గురికాగా.. తెరవెనుక చర్చలు, బుజ్జగింపులు, బేరసారాల అనంతరం అసంతృప్తులు, టికెట్లు దక్కక నామినేషన్లు వేసిన వారు వెనక్కి తగ్గే ఛాన్సుంది.

గుజరాత్‌తో మ్యాచులో ఆర్సీబీ సంచలనం సృష్టించింది. 24 బంతులు మిగిలి ఉండగానే 200 పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన తొలి జట్టుగా నిలిచింది. నిన్న 201 పరుగుల లక్ష్యాన్ని RCB 16 ఓవర్లలోనే ఛేదించిన సంగతి తెలిసిందే. అంతకుముందు 2023లో ఆర్సీబీపై ముంబై 21 బంతులు మిగిలి ఉండగానే 200పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని అందుకుంది.

AP: రాష్ట్రంలో ఉమ్మడి మేనిఫెస్టోను ఎన్డీయే కూటమి రేపు విడుదల చేయనుంది. వైసీపీ మేనిఫెస్టో ఇప్పటికే విడుదలైంది. టీడీపీ సూపర్ సిక్స్, జనసేన షణ్ముఖ వ్యూహం పేర్లతో చూచాయగా తమ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ప్రధానంగా పెన్షన్‌పై కూటమి దృష్టి పెడుతున్నట్లు సమాచారం. క్రమంగా పెన్షన్‌ను పెంచుకుంటూ వెళ్తామని వైసీపీ అంటుండగా.. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రూ.4 వేల పెన్షన్ ఇస్తామని కూటమి హామీ ఇస్తోంది.

TG: రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగింది. BJP, BRS ఒక్కటేనని అధికార కాంగ్రెస్ అంటుంటే.. కాంగ్రెస్, BRS ఏకమయ్యాయని BJP ఆరోపిస్తోంది. లేదులేదు రెండు జాతీయ పార్టీలు కలిసి తెలంగాణను నాశనం చేయాలని చూస్తున్నాయని BRS విమర్శిస్తోంది. ఇటీవల పదేపదే ఇవే మాటలు వినిపిస్తుండటంతో ఏయే పార్టీలు కలిసి ఉన్నాయి? అసలు ఈ మాటల్లో కొంతైనా నిజం ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మీ కామెంట్? <<-se>>#ELECTIONS2024<<>>

AP: 2014లో తునిలో జరిగిన రైలు దహనం వెనుక YCP కుట్ర ఉందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ‘YCP నేతలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, భూమన కరుణాకరరెడ్డి తదితర నాయకులంతా కాపు యువతను ఎగదోశారు. కిరాయిమూకలతో తునిలో రైలు తగలబెట్టారు. ఆ కేసుల్లో అమాయకులైన యువత నలిగిపోయారు. నేను ఆవేశంతో మాట్లాడతాను. విధ్వంసం వైపు వెళ్లను. ఏ ఉద్యమమైనా సరిగా చేయకపోతే అమాయకులు బలవుతారు. ఇదే నిదర్శనం’ అని వ్యాఖ్యానించారు.

ఎన్నికల ముంగిట పార్టీలు మారిన అభ్యర్థులకు గడ్డుకాలం నడుస్తోంది. వాళ్లు మొన్నటి వరకూ విమర్శలు గుప్పిస్తూ, ప్రశ్నలు సంధించిన పార్టీలోనే ఇప్పుడు చేరారు. దీంతో గతంలో వారు వేసిన ప్రశ్నలకు సమాధానం దొరికిందా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. పాత వీడియోలను సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులు పోస్టు చేస్తూ.. సెటైర్లు వేస్తున్నారు. పార్టీ మారక ముందు అలా.. మారిన తర్వాత ఇలా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

TG: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. నిన్న ఆరు జిల్లాల్లో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల, మెదక్ జిల్లాల్లో వడదెబ్బతో ఇద్దరు మరణించారు. మరోవైపు ఇవాళ, రేపు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో వర్షం పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది.

AP: రాష్ట్రంపై భానుడి ప్రతాపం కొనసాగుతోంది. నిన్న పలు చోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. అత్యధికంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు, వైఎస్ఆర్ కడప జిల్లా చాపాడులో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు 47 మండలాల్లో తీవ్ర వడగాలులు, 151 మండలాల్లో వడగాడ్పులు వీచే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు వీలైనంత వరకు నీడపట్టునే ఉండాలని సూచించింది.

AP: జనసేనకు గాజు గ్లాసును కామన్ గుర్తుగా కేటాయిస్తూ EC ఆదేశాలతో ఆ పార్టీకి బిగ్ రిలీఫ్ లభించింది. దీంతో రాష్ట్రంలో జనసేన పోటీ చేయని చోట్ల ఇతరులకు ఈ గుర్తు కేటాయించే అవకాశం ఉండదు. జనసేన 21 అసెంబ్లీ, 2 MP స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మిగతా స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును తమకు కేటాయించాలని కొందరు ఈసీని కోరారు. అయితే దీనిని వ్యతిరేకిస్తూ ECకి జనసేన లేఖ రాయగా.. అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది.
Sorry, no posts matched your criteria.