India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఒడిశా అసెంబ్లీ మాజీ స్పీకర్, కాంగ్రెస్ నేత చింతామణి సామంత్రాయ్(84) పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. ఆయన ప్రాతినిధ్యం వహించిన చికితీ అసెంబ్లీ స్థానంలో చిన్న కొడుకు మనోరంజన్ బీజేపీ నుంచి, పెద్ద కొడుకు రబీంద్రనాథ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో తండ్రి ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినేనని చెబుతూనే ఎవరి తరఫునా ప్రచారం చేయట్లేదని వెల్లడించారు.<<-se>>#ELECTIONS2024<<>>

ఒడిశాలో సీఎం నవీన్ పట్నాయక్‌ను, BJDని తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తుల్లో బిజయ్ మహాపాత్ర ముఖ్యుడు. బీజేపీలో కీలక పదవులు నిర్వర్తించారు. ఇప్పుడు ఆయన కుమారుడు అరవింద్ మహాపాత్ర BJD నుంచి పట్‌కురా స్థానంలో పోటీ చేస్తున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఆయన కుమారుడికి మద్దతునిచ్చారు. జీవితమంతా వ్యతిరేకించిన పార్టీకే ఆయన ప్రచారం చేస్తున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. CBI అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు 3 రోజుల కస్టడీ విధించింది. దీంతో ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ రేపటి నుంచి ఈ నెల 15 వరకు తమ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. ఇప్పటికే ఆమెను పలు అంశాలపై ఈడీ విచారించగా.. సీబీఐ కూడా మరికొన్ని అంశాలపై ప్రశ్నించనుంది.

TG: ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. రైతుల నుంచి భారీగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వరికి మద్దతు ధరపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వేసవి నేపథ్యంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో ఆయన చర్చిస్తున్నారు.

కర్ణాటకలోని హసన్‌కు చెందిన కవల అమ్మాయిలు చుక్కి, ఇబ్బనిచంద్ర తాజాగా విడుదలైన ఇంటర్(PUC) ఫలితాల్లో సమాన మార్కులు సాధించారు. వీరికి 600 మార్కులకుగానూ 571 మార్కులు వచ్చాయి. విశేషం ఏమిటంటే రెండేళ్ల కిందట పదో తరగతి ఫలితాల్లో ఈ కవలలిద్దరికీ 625 మార్కులకు 620 మార్కులొచ్చాయి. ఇది పూర్తిగా యాదృచ్ఛికమని, సమాన మార్కులు ఎలా వచ్చాయో తమకే అర్థంకావడం లేదని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

AP: అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడును తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని ఆ పార్టీ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ ఆర్థిక, అంగ బలాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారని టాక్. అందుకే ఆయనను మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక్కడ గవర సామాజికవర్గం నుంచి ఓ బలమైన నేతను బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది.

AP: మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్‌కుమార్ రెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ‘రాష్ట్రాన్ని విడగొడతానని ఢిల్లీలో చెప్పి కిరణ్ సీఎం పదవి పొందారు. అప్పట్లో హైదరాబాద్‌లో ఆఫీస్ ఓపెన్ చేసి సీఎం హోదాలో కమీషన్లు వసూలు చేశారు. ఇప్పుడు మనకు రాజధాని లేకుండా పోవడానికి ఆయనే కారణం. అలాంటి వ్యక్తి నేడు రాజంపేట ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయనను చిత్తుగా ఓడించాలి’ అని పిలుపునిచ్చారు.

ఏపీ, తెలంగాణకు 14 టీఎంసీల నీటిని కేటాయిస్తూ KRMB ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. మే నెలలో మరోసారి సమావేశం కానుంది. ప్రస్తుతం సాగర్‌లో నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై KRMB రానున్న భేటీలో చర్చించనుంది.

ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని వారుండరు. కానీ దాంట్లో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుందని.. అది చెడు కొలెస్ట్రాల్‌గా మారుతుందని కొందరు భయపడుతుంటారు. కానీ ఐస్‌క్రీమ్ ఆరోగ్యానికి హానికరం కాదని హార్వర్డ్ డాక్టరల్ విద్యార్థులు చెబుతున్నారు. ఇది కంటి చూపు, మెదడు అభివృద్ధికి దోహదపడుతుంది. ఒత్తిడి తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు కూడా తగ్గే ఛాన్స్ ఉంది.

AP: ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్, పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్ సిద్ధార్థ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. అనపర్తి, ఉండి తదితర స్థానాల్లో మార్పులపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా అనపర్తి సీటును BJPకి ఇవ్వడాన్ని TDP మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి వ్యతిరేకిస్తున్నారు. ఉండి టికెట్‌ను సిట్టింగ్ MLA రామరాజును కాదని రఘురామకృష్ణరాజుకు ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.