news

News April 21, 2024

IPL: సగం మ్యాచులు ముగిశాయి.. అగ్రస్థానం ఎవరిదంటే?

image

ఐపీఎల్ 2024లో లీగ్ దశలో సగం మ్యాచులు ముగిశాయి. పాయింట్స్ టేబుల్‌లో 12 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ తొలి స్థానంలో ఉండగా.. రెండు పాయింట్లతో ఆర్సీబీ అట్టడుగున ఉంది. మరోవైపు ఇప్పటివరకు ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కోహ్లీ(361), అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా బుమ్రా(13) ఉన్నారు. ఇప్పటికే పలు సంచలనాలు నమోదు కాగా.. మున్ముందు ఇంకెన్ని నమోదవుతాయో వేచి చూడాలి.

News April 21, 2024

1967 అసెంబ్లీ ఎన్నికలు.. వెరీ స్పెషల్

image

ఉమ్మడి APలోని 287 అసెంబ్లీ స్థానాలకు 1967 FEBలో జరిగిన ఎన్నికలు వెరీ స్పెషల్. అప్పుడు INC 165 స్థానాల్లో గెలవగా, ఏకంగా 68 మంది ఇండిపెండెంట్లు విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఒక ఎన్నికలో ఇంత మంది స్వతంత్రులు గెలవడం ఇదే మొదటిసారి, చివరిసారి. వారంతా INCలో చేరారు. స్వతంత్ర పార్టీ 29, CPI 11, CPM 9 చోట్ల గెలిచాయి. కాసు బ్రహ్మానందరెడ్డి CMగా, విపక్ష నేతగా గౌతు లచ్చన్న ఎన్నికయ్యారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 21, 2024

3 రోజుల్లో ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే?

image

TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 65 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మూడు రోజుల్లో నామినేషన్ల సంఖ్య 164కు చేరింది. ఇంకా ఆదిలాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కాగా నామపత్రాలు దాఖలు చేసేందుకు ఆదివారం సెలవు దినంగా ఈసీ గతంలోనే ప్రకటించింది.

News April 21, 2024

చేతిలో పేలిన సెల్‌ఫోన్.. బాలికకు తీవ్ర గాయాలు

image

AP: సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి వీడియోలు చూస్తుండగా పేలడంతో 11 ఏళ్ల బాలిక వీరలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పల్నాడు(D) ఎమ్మాజీగూడెంలో జరిగింది. ప్రమాదంలో బాలిక కుడి చేతి 2 వేళ్లు పూర్తిగా తెగిపోయాయి. పొట్ట భాగంలోనూ గాయాలయ్యాయి. తల్లిదండ్రులు వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
NOTE: ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి మాట్లాడటం, వీడియోలు చూడటం ప్రమాదకరం. ఒక్కోసారి ప్రాణాలే పోవచ్చు.

News April 21, 2024

కలెక్టర్లకు పౌరసరఫరాలశాఖ కీలక ఆదేశాలు

image

AP: ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్లకు ఏపీ పౌరసరఫరాలశాఖ కమిషనర్ అరుణ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రచారం, డబ్బు, కరపత్రాల పంపిణీ ఇతర వ్యవహారాల్లో ఎండీయూ ఆపరేటర్లు పాల్గొనకుండా చూడాలని సూచించారు. రేషన్ వాహనాల ద్వారా నగదు పంపిణీ చేస్తున్నారనే ఫిర్యాదులపై ఆయన స్పందించారు. లబ్ధిదారులకు నిత్యావసరాల పంపిణీతో పాటు ఎన్నికల నియమావళి అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News April 21, 2024

IPL: లెక్కలు మార్చేస్తున్నారు

image

IPLలో సన్‌రైజర్స్ గేరు మార్చింది. ఒకప్పుడు తక్కువ స్కోర్లను కాపాడుకునే ఈ జట్టు.. కమిన్స్ సారథ్యంలో భారీ స్కోర్లతో దూసుకెళ్తోంది. ఈ సీజన్లో ఏకంగా 3 సార్లు 250+ పరుగులు చేసిన SRH ప్రత్యర్థి జట్లకు తమ బ్యాటింగ్‌తోనే సమాధానం చెబుతోంది. తాజాగా అత్యంత వేగంగా 100 పరుగులతో పాటు పవర్ ప్లేలో అత్యధిక పరుగుల రికార్డును ఖాతాలో వేసుకుంది. దీంతో SRH లెక్కలు మార్చేస్తుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

News April 21, 2024

రేపే టెన్త్ ఫలితాలు.. WAY2NEWSలో సులభంగా తెలుసుకోండి

image

AP: టెన్త్ ఫలితాలను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. అధికారిక సైట్ RESULTS.BSE.AP.GOV.INతో పాటు WAY2NEWS యాప్‌లో రిజల్ట్స్‌ను వేగంగా, సులభంగా తెలుసుకోవచ్చు. మార్చి 18 నుంచి 30 వరకు పరీక్షలు జరగగా, రికార్డు స్థాయిలో 22 రోజుల్లోనే ఫలితాలు వెల్లడవుతున్నాయి. దాదాపు 6.3 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

News April 21, 2024

తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

image

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 73,051 మంది భక్తులు దర్శించుకోగా.. 34,599 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు సమకూరింది.

News April 21, 2024

తగ్గిన రజనీ ఆస్తులు.. కారు లేని ఉపసభాపతి!

image

AP: ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం మంత్రి రజనీతో పాటు కుటుంబ సభ్యులవి కలిపి మొత్తం ఆస్తుల విలువ రూ.85.76కోట్లు. 2019లో రూ.129.62 కోట్లు ఉన్నట్లు తెలిపారు.
➣విజయనగరం YCP MLA అభ్యర్థి, ఉపసభాపతి కోలగట్ల వీరభధ్రస్వామి కుటుంబ ఆస్తులు రూ.29.39 కోట్లు. ఆయన వద్ద సొంత వాహనం లేదు.
➣గన్నవరం YCP ఎమ్మెల్యే వంశీ మొత్తం రూ.172.36 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. 2014లో 72.50కోట్లు, 2019లో 69.08 కోట్లుగా ఉంది.

News April 21, 2024

బెంగళూరు ట్రాఫిక్.. కేరళలో ప్రచారాస్త్రం!

image

కేరళ రాజధాని తిరువనంతపురం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ MP శశిథరూర్ పోటీ చేస్తున్నారు. కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ను BJP బరిలోకి దింపింది. కాగా బెంగళూరు ట్రాఫిక్‌ సమస్యను ఇక్కడ కాంగ్రెస్ ప్రచారంలో ప్రస్తావిస్తోంది. బెంగళూరులో స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని రాజీవ్ చంద్రశేఖర్ ‘నమ్మ బెంగళూరు ఫౌండేషన్’ అడ్డుకుందని.. అలాంటి వ్యక్తి తిరువనంతపురాన్ని ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నిస్తోంది.