news

News May 4, 2024

LTI యాక్ట్ ఇంకా రూపకల్పన దశలోనే ఉంది: సజ్జల

image

AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌‌పై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. ‘ఈ చట్టం ఇంకా రూపకల్పన దశలోనే ఉంది. ఇంకా గెజిట్ రాలేదు.. విధివిధానాలు ఖరారు కాలేదు. అక్రమాలకు చెక్ పెట్టే విధంగా ఈ యాక్ట్ ఉంటుంది. సమగ్ర భూసర్వే పూర్తయిన తర్వాతే అమల్లోకి వస్తుంది. భూ కబ్జాలు చేసే చంద్రబాబు లాంటి వాళ్లకు ఇలాంటి చట్టాలు రావడం ఇష్టం ఉండదు’ అని ఫైర్ అయ్యారు.

News May 4, 2024

రోజుకు రూ.417 పెట్టుబడి.. రూ.కోటి రాబడి!

image

తపాలా శాఖ అందిస్తున్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ గురించి చాలామంది వినే ఉంటారు. కానీ దీనిపై అవగాహన తక్కువే. ఇందులో రిస్క్ లేకుండా చిన్న మొత్తాల్లో పొదుపు చేసి అధిక లాభాలు పొందొచ్చు. దీని కాల వ్యవధి 15 ఏళ్లు కాగా ఆ తర్వాత కూడా పొడిగించుకోవచ్చు. ఇందులో రోజుకు రూ.417 చొప్పున నెలకు రూ.12,500.. 15 ఏళ్లు కడితే రూ.40లక్షల వరకు రాబడి అందుతుంది. అదే 25 ఏళ్లకు రూ.37లక్షల పెట్టుబడికి గాను రూ.కోటి పొందొచ్చు.

News May 4, 2024

జొన్నల కొనుగోళ్ల పరిమితి 12 క్వింటాళ్లకు పెంపు

image

TG: ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో జొన్న కొనుగోళ్ల పరిమితిని ఎకరాకు 12 క్వింటాళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లుగా దిగుబడుల ఆధారంగా ఎకరానికి 8.85 క్వింటాళ్ల పరిమితితో ప్రభుత్వం జొన్నలు కొనుగోలు చేస్తోంది. మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటాలుకు ₹3180 మద్దతు ధరగా చెల్లిస్తోంది. రైతులెవరూ పంటను తక్కువ ధరకు అమ్మవద్దని, మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు.

News May 4, 2024

పట్టాదారు పుస్తకాలపై జగన్ బొమ్మ.. సజ్జల రియాక్షన్

image

AP: భవిష్యత్తులో పాస్ పుస్తకాలకు సంబంధించి ఎలాంటి అక్రమాలు జరగకుండా వాటిని రూపొందించామని సజ్జల తెలిపారు. ‘క్యూఆర్ కోడ్‌ ముద్రించి భూహక్కుదారుల పూర్తి వివరాలను డిజిటలైజ్ చేశాం. రెవెన్యూ శాఖలో ఇలాంటి ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన CM జగన్ ఫొటో ముద్రించడంలో తప్పేముంది. గతంలో ప్రతిదానిపై తన ఫొటోలు వేసుకున్న CBNకు ప్రశ్నించే అర్హత ఉందా? ప్రజలెవ్వరికీ లేని అభ్యంతరం బాబుకి ఎందుకు?’ అని మండిపడ్డారు.

News May 4, 2024

IPL: బెంగళూరు బౌలింగ్

image

గుజరాత్‌తో మ్యాచ్‌లో బెంగళూరు టాస్ గెలిచింది. కెప్టెన్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నారు.
★ బెంగళూరు: విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, విల్‌జాక్స్, మ్యాక్స్‌వెల్, గ్రీన్, దినేశ్ కార్తీక్, కరుణ్ శర్మ, సిరాజ్, యశ్ దయాల్, విజయ్ కుమార్, స్వప్నిల్ సింగ్
★ గుజరాత్: సాహా, గిల్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, లిటిల్

News May 4, 2024

తండ్రీకొడుకులకు చుక్కెదురు

image

సంచలనం సృష్టిస్తున్న సెక్స్ వీడియోల కేసులో తండ్రీకొడుకులకు చుక్కెదురైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి రేవణ్ణ, ఎంపీ ప్రజ్వల్ దాఖలు చేసిన పిటిషన్‌ను బెంగళూరులోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానం కొట్టివేసింది. మరోవైపు జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్‌పై రెండోసారి లుక్‌ఔట్ నోటీసు జారీ అయింది. ఈ నోటీసులతో ఆయన దేశంలో అడుగుపెట్టగానే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముంది.

News May 4, 2024

IPL ప్లేఆఫ్స్.. ఏ జట్టుకు ఎంత ఛాన్స్ ఉందంటే?

image

IPL మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. నిన్నటితో 51 మ్యాచ్‌లు పూర్తవగా, ప్లేఆఫ్స్‌కు వెళ్లడానికి అన్ని జట్లూ శాయశక్తులా కృషి చేస్తున్నాయి. క్రిక్లెటిక్స్ క్వాలిఫికేషన్ ప్రొజెక్షన్ ప్రకారం ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి RR, KKRకు 99% ఛాన్స్ ఉంది. SRHకు 72%, LSGకు 66%, CSKకు 50% అవకాశం ఉంది. తక్కువ పాయింట్లు ఉన్న DCకి 6%, PBKSకు 5%, GTకి 2%, RCBకి 1% ఛాన్స్ ఉండగా, MI ఎలిమినేట్ అయినట్లేనని పేర్కొంది.

News May 4, 2024

తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన వాయిదా

image

TG: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఈనెల 6, 7 తేదీల్లో రాష్ట్రానికి రావాల్సి ఉండగా, ఆమె పర్యటన వాయిదా పడింది. ఈనెల 10న ఎల్లారెడ్డి, తాండూర్, షాద్ నగర్‌లో జరిగే ప్రచార కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. అలాగే రాహుల్ గాంధీ పర్యటనలోనూ మార్పులు జరిగాయి. ఆయన ఈనెల 5న నిర్మల్, అలంపూర్ ఎర్రవల్లి చౌరస్తాలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈనెల 9న కరీంనగర్, సరూర్ నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

News May 4, 2024

సూర్యాస్తమయం వేళ సూరీడి ఫొటో

image

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లోని ఓ వ్యోమగామి సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో క్లిక్ మనిపించారు. ఈ ఫొటోను నాసా తాజాగా విడుదల చేసింది. జనవరి 18న ISS జపాన్ మీదుగా తిరుగుతున్న సమయంలో ఈ చిత్రాన్ని తీసినట్లు తెలిపింది. సగం మేర కనిపిస్తున్న సూర్యుడితో ఈ ఫొటో ఆకట్టుకుంటోంది. కాగా ISSలోని వ్యోమగాములు ప్రతిరోజూ 16 సూర్యాస్తమయాలు, సూర్యోదయాలను చూస్తారు. అలా ఓ సారి సూర్యాస్తమయం అవుతుండగా క్లిక్ మనిపించారు.

News May 4, 2024

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: TDPపై వైసీపీ ఫిర్యాదు

image

ఏపీ రాజకీయాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంచలనంగా మారింది. ఈ చట్టంపై IVRS కాల్స్ ద్వారా టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సీఈసీ.. విచారణ జరిపి తక్షణమే నివేదిక అందించాలని సీఐడీని ఆదేశించారు.