India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ఎన్నికల పోలింగ్ జరిగే మే 13వ తేదీన అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. ‘సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు ఉంటాయి. ప్రచార సమయం ముగిశాక నియోజకవర్గాల్లో ఇతరులు ఉండకూడదు. జూన్ 1వ తేదీ సా.6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉంటుంది. 160 కేంద్ర బలగాలు, 60వేల మంది రాష్ట్ర పోలీసులు బందోబస్తు విధుల్లో ఉంటారు’ అని ఆయన వెల్లడించారు.

మహారాష్ట్రలో శరద్‌పవార్ ఆధ్వర్యంలోని NCP, ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీలను నకిలీ పార్టీలుగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఇరు పార్టీలూ జూన్ 4 తర్వాత మనుగడ కోసం కాంగ్రెస్‌లో విలీనమయ్యేందుకు సిద్ధమయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్‌లో కలిసి చావడానికి బదులుగా అజిత్ పవార్(NCP), ఏక్‌నాథ్ శిండేల(శివసేన)తో కలిసి పని చేయాలని సలహా ఇచ్చారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

HYD పరిధిలోని ఏపీ ఓటర్లు సొంతూళ్లకు వెళ్తున్నారు. సొంతూరితో పాటు HYDలోనూ ఓటున్న వీరిలో చాలామంది అసెంబ్లీ ఎన్నికల్లో BRSకు వేసినట్లు విశ్లేషణలున్నాయి. డిసెంబర్లో GHMC పరిధిలోనే కారు పార్టీకి గౌరవప్రద స్థానాలొచ్చాయి. దీంతో ఈసారి ఈ ఓటర్లు HYDలో లేకపోవడంతో మారే పోలింగ్ సరళి ఏ పార్టీకి అనుకూలిస్తుందని ఆసక్తికర చర్చ నడుస్తోంది. గ్రేటర్‌లో HYD, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల MP స్థానాలున్నాయి.

AP: ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చామని CM జగన్ తెలిపారు. కైకలూరు సభలో మాట్లాడుతూ.. ‘3వ తరగతి నుంచి టోఫెల్, 6th క్లాస్ నుంచి డిజిటల్ బోధన, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించాం. IB సిలబస్‌నూ తీసుకొచ్చాం. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చేశాం. ఇంటర్నేషనల్ వర్సిటీలతో సర్టిఫైడ్ కోర్సులు అమలు చేస్తున్నాం. ఈ విద్యా సంస్కరణలు గతంలో ఎప్పుడైనా జరిగాయా?’ అని ప్రశ్నించారు.

AP: ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల క్షేత్రం కలిగి ఉన్న ప్రాంతం తిరుపతి పార్లమెంట్. గతంలో ఇక్కడ ఏకంగా 12 సార్లు కాంగ్రెస్ నెగ్గింది. 2014 నుంచి YCP పాగా వేసింది. సిట్టింగ్ MP మద్దిల గురుమూర్తిని బరిలోకి దింపింది. పొత్తులో భాగంగా ఇక్కడ BJP బరిలో నిలిచింది. YCP గూడురు MLA వరప్రసాద్ BJPలో చేరి టికెట్ దక్కించుకున్నారు. రాయలసీమలో కీలకమైన ఈ ప్రాంతంలో బీజేపీ సత్తా చాటుతుందో? లేదో చూడాలి.
<<-se>>#ELECTIONS2024<<>>

APలో మే 13న జరిగే ఎన్నికల పోలింగ్‌కు వచ్చే వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని APSRTCకి చంద్రబాబు లేఖ రాశారు. ఆర్టీసీ బస్సులు పెంచడం వల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అటు స్వస్థలాలకు వెళ్లే ఓటర్లతో రోడ్లన్నీ రద్దీగా మారగా.. బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి.

TG: తాము అమలు చేసిన పథకాలను INC ప్రభుత్వం ఆపేస్తోందని BRS చీఫ్ KCR మండిపడ్డారు. ‘దివంగత YSR మీద కోపంతో మా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆపలేదు కదా? ఈ పథకాలకు అదనపు నిధులు కేటాయించి ముందుకు తీసుకెళ్లడంతో ప్రజలకు లబ్ధి చేకూరింది’ అని తెలిపారు. రాష్ట్రం దివాలా తీసిందని రేవంత్ చెబుతున్నారని, కానీ ఏ సీఎం కూడా అలా చెప్పకూడదని పేర్కొన్నారు. అది స్టేట్ ఇమేజ్‌ను నాశనం చేస్తుందన్నారు.

TG: సీఎం రేవంత్ ఆగస్టు 15న రుణమాఫీ చేస్తానని చెబుతున్నాడు గానీ ఈ ఏడాదేనా అనేది క్లారిటీ లేదని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. రైతు సంఘాలు కూడా ఇదే విషయాన్ని తనతో ప్రస్తావించాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడమే శాపంగా ఉందని రైతులు భావించారని పేర్కొన్నారు. ఏ ఊరుకు వెళ్తే ఆ ఊరిలో సీఎం ఒట్లు పెట్టడం హాస్యాస్పదంగా మారిందన్నారు. నీటి విషయంలో నిర్వహణ లోపించిందని.. దీంతో పంటలు ఎండిపోయాయని చెప్పారు.

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌పై ఒక మ్యాచ్‌కి సస్పెన్షన్ వేటు పడింది. RRతో మ్యాచ్ సందర్భంగా స్లో ఓవర్ రేటు(గతంలో 2 సార్లు ఫైన్ వేశారు) కారణంగా అతనిపై ఈ నిషేధంతో పాటు బీసీసీఐ రూ.30 లక్షల ఫైన్ వేసింది. దీంతో రేపు RCBతో జరగాల్సిన మ్యాచ్‌కు అతను దూరం కానున్నారు. కీలకమైన ప్లే ఆఫ్స్‌కు ముందు DCకి ఇది బిగ్ షాక్‌గా చెప్పుకోవచ్చు. పాయింట్ల టేబుల్‌లో DC ప్రస్తుతం 5వ స్థానంలో ఉంది.

AP: 59 నెలలుగా లంచాలు, వివక్ష లేకుండా పాలన చేశామని సీఎం జగన్ చెప్పారు. కైకలూరు సభలో మాట్లాడుతూ.. ‘సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందడం గతంలో చూశారా? ఈ ఐదేళ్లూ ఇంటి వద్దకే పౌర సేవలను అందించాం. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చాం. జగన్‌కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి. చంద్రబాబు సాధ్యం కాని హామీలతో మేనిఫెస్టో ఇచ్చారు. ఆయనను నమ్మితే కొండ చిలువ నోట్లో తలపెట్టడమే’ అని వ్యాఖ్యానించారు.
Sorry, no posts matched your criteria.