India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ఎన్నికల రోజు, ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై సిట్ బృందం నివేదిక రూపొందించి.. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు అందజేసింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిలాల్లో మొత్తం 33 చోట్ల అల్లర్లు జరిగినట్లు అందులో పేర్కొంది.
1370 మందిపై FIR నమోదు చేయగా.. 124 మందిని అరెస్ట్ చేశామని, 94 మందికి నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంది. 150 పేజీలతో కూడిన నివేదికను డీజీపీ.. కాసేపట్లో సీఈవో, సీఈసీకి పంపనున్నారు.

ఏపీలో కులాల వారీగా ఓటర్ల వివరాలు ప్రకటించినట్లుగా వైరల్ అవుతున్న పోస్ట్ ఫేక్ అని సీఈవో ముకేశ్ కుమార్ తెలిపారు. ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న డేటా తప్పని ట్వీట్ చేశారు. ఫ్యాక్ట్ చెక్ ద్వారా నిర్ధారించినట్లు పేర్కొన్నారు. తప్పుడు సమాచారంతో మోసపోవద్దని ప్రజలకు సూచించారు. అబద్ధాలు కాకుండా సత్యాన్ని ప్రచారం చేయాలని కోరారు.

ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయన్నారు ప్రధాని మోదీ. మార్కెట్లు సరికొత్త రికార్డులు నమోదు చేస్తాయన్నారు. మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే సామాన్యుల సంఖ్య పెరిగితే ఆర్థికవ్యవస్థకు బలం చేకూరుతుందని పేర్కొన్నారు. బీజేపీ భారీ మెజార్టీతో గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మెజార్టీపై అనుమానాల వల్లే స్టాక్ మార్కెట్లు మందకొడిగా సాగుతున్నాయన్న ప్రచారాన్ని తోసిపుచ్చారు.

ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌దామ్ జిల్లాలో ఉన్న కవర్ధాలో ప్రయాణికులతో వెళుతున్న వ్యాన్ లోయలో పడింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఐపీఎల్ సీజన్-17 ఫైనల్ మ్యాచ్ టికెట్లు కాసేపట్లో అందుబాటులోకి రానున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి పేటీఎం ఇన్‌సైడర్‌లో వీటిని విక్రయించనున్నారు. రూపే కార్డ్ ఉన్న వారు మాత్రమే వీటిని కొనుగోలు చేయొచ్చు. టికెట్ కనిష్ఠ ధర రూ.3 వేలుగా ఉంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ నెల 26న ఫైనల్ జరగనుంది.

గుజరాత్‌లో ఉగ్ర కలకలం రేగింది. అహ్మదాబాద్‌లో నలుగురు ISIS ఉగ్రవాదులను ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని శ్రీలంకకు చెందినవారిగా గుర్తించారు. దీంతో దేశంలోని పలు ఎయిర్‌పోర్టుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.

కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయా బాదిగ నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాలిఫోర్నియాలో జడ్జి బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా నిలిచారు. ఏపీలోని విజయవాడకు చెందిన జయ హైదరాబాద్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం US వెళ్లిన జయ, బోస్టన్ యూనివర్సిటీలో ఎంఏ, శాంటా క్లారా యూనివర్సిటీలో లా పూర్తి చేశారు. 2009లో కాలిఫోర్నియా బార్ ఎగ్జామ్ క్లియర్ చేశారు.

లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ కస్టడీని పొడిగించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును కోరింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్ మే 10న మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన జుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని ఈడీ కోర్టును ఆశ్రయించింది.

హీరోయిన్ యామీగౌతమ్ మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త ఆదిత్యధర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. బాబుకు ‘వేదవిద్’ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. దీంతో ఆమెకు నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. యామీ-ఆదిత్య 2021లో పెళ్లి చేసుకున్నారు. తెలుగులో గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కల్యాణ్ చిత్రాల్లో ఆమె నటించారు. ఇటీవల విడుదలైన ‘ఆర్టికల్ 370’ సినిమాలోనూ యామీ కీలక పాత్ర పోషించారు.

లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాధారణ ప్రజలతోపాటు రాజకీయ, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ముంబైలో బాలీవుడ్ స్టార్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
Sorry, no posts matched your criteria.