India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న డోన్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తీవ్ర భద్రతావైఫల్యం చోటుచేసుకుంది. ప్రజలకు బాబు అభివాదం చేస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన వాహనంపైకి ఎక్కారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. కొన్ని రోజుల క్రితం సీఎం వైఎస్ జగన్‌పైనా రాయి దాడి జరిగిన సంగతి తెలిసిందే. తమ నాయకులకు మరింత భద్రతను కల్పించాలని వారి అభిమానులు కోరుతున్నారు.

APకి చెందిన సర్పంచ్ కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. USలోని ఐక్యరాజ్యసమితి సెక్రటేరియట్‌లో మే 3న నిర్వహించే సదస్సులో ప్రసంగించనున్నారు. ప.గో(D) ఇరగవరం(మ) పేకేరు సర్పంచ్‌గా ఉన్న ఆమె.. దేశంలో స్థానిక సంస్థల్లో మహిళల పాత్ర, మహిళా సాధికారతకు మార్గాలు అనే అంశంపై మాట్లాడనున్నారు. దేశం నుంచి ముగ్గురు ప్రజాప్రతినిధులకే ఆహ్వానాలు అందగా.. అందులో హేమ ఒకరు. గతంలో ఆమె లెక్చరర్‌గా పనిచేశారు.

TG: పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున నేడు మూడు నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మ.2గంటలకు హుజూరాబాద్ జనజాతర సభ, సా.4గంటలకు వరంగల్‌లోని భూపాలపల్లి సభ, చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో రా.7గంటలకు బాలాపూర్, బడంగ్‌పేట కార్నర్ మీటింగ్‌లకు, రా.9గంటలకు ఆర్కేపురం, సరూర్‌నగర్ కార్నర్ మీటింగ్‌లకు హాజరవుతారు.

KKR ప్లేయర్ ఫిల్ సాల్ట్ అరుదైన రికార్డు సాధించారు. ఒక ఐపీఎల్ సీజన్‌లో ఈడెన్ గార్డెన్‌లో అత్యధిక పరుగులు(344) చేసిన ప్లేయర్‌గా నిలిచారు. ఈ సీజన్‌లో ఈడెన్ గార్డెన్‌లో ఆడిన ఆరు మ్యాచుల్లోనే సాల్ట్ 344 పరుగులు చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో గంగూలీ(331), రసెల్(311), క్రిస్ లిన్(303) ఉన్నారు.

AP: టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మేనిఫెస్టో నేడు విడుదల కానుంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు CBN, పవన్, ఇతర బీజేపీ నేతలు మేనిఫెస్టో ప్రకటించనున్నారు. పెన్షన్లు రూ.4వేలకు పెంపు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, మెగా డీఎస్సీపై మొదటి సంతకం, వాలంటీర్ల వేతనం రూ.10వేలకు పెంపు వంటి హామీలతో NDA అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు.

మిల్కీ బ్యూటీ తమన్నా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. హాలీవుడ్ ఫిల్మ్ ‘హౌజ్ ఆఫ్ వ్యాక్స్’ సినిమా చూశాక వ్యాక్సింగ్(చర్మంపై రోమాలు తొలగించడం) చేయించుకోవడం మానేశానని చెప్పారు. ఆ సినిమాలో వ్యాక్స్‌తో పలు రకాలుగా చంపేస్తారని తెలిపారు. కాగా ఆమె నటించిన హారర్ కామెడీ మూవీ ‘బాక్’ మే 3న విడుదల కానుంది. సుందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాశీఖన్నా మరో హీరోయిన్‌గా నటించారు.

TG: నేడు టెన్త్ రిజల్ట్స్ విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. WAY2NEWS యాప్‌లో రిజల్ట్స్‌ను ప్రత్యేక స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. వాటిని ఈజీగా షేర్ చేసుకోవచ్చు. #ResultsFirstOnWay2News

TG: నేడు రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మెదక్(D) ఆందోలు నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రధాని మహారాష్ట్రలోని లాతూర్ నుంచి మధ్యాహ్నం 3:20కి బయలుదేరి సాయంత్రం 4:20 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. సభ తర్వాత 5:55 గంటలకు దుండిగల్ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తారు.

విప్లవ రచయితగా, అభ్యుదయ వాదిగా తెలుగు సాహిత్యపు దశను, దిశను మార్చిన కొద్ది రచయితల్లో శ్రీశ్రీ ఒకరు. కవితలతో మాత్రమే కాకుండా సినీ గీతాలతోనూ ఆలోచింపజేసిన మహాకవి. ఆయన కలం నుంచి జాలు వారిన ‘తెలుగు వీర లేవరా’ పాటకు జాతీయ అవార్డు దక్కింది. శ్రీశ్రీ రచించిన ‘మహాప్రస్థానం’ కవితా సంకలనం ఎప్పటికీ ఎవర్ గ్రీన్‌గా నిలిచిపోతుంది. తక్కువ అక్షరాలతోనే అనల్పార్థాన్ని సృష్టించడంలో ఆయన మేటి. ఇవాళ శ్రీశ్రీ జయంతి.

AP: సీఎం జగన్ ప్రచార పర్వం కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మూడు నియోజకవర్గాల్లో సీఎం పర్యటిస్తారని వైసీపీ ప్రధాన కార్యదర్శి రఘురాం తెలిపారు. ఉదయం 10 గంటలకు కొండేపి నియోజకవర్గంలో, మధ్యాహ్నం 12:30 గంటలకు కడప(D) మైదుకూరు నియోజకవర్గంలో, మధ్యాహ్నం 3 గంటలకు పీలేరు నియోజకవర్గంలో జరిగే సభల్లో ఆయన ప్రసంగిస్తారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.