India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

*1870: చలనచిత్ర దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే జననం.
*1891: కవి గాడేపల్లి వీరరాఘవశాస్త్రి జననం.
*1910: కవి శ్రీశ్రీ జననం.
*1945: జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ మరణం.
*1987: టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ జననం.

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘కల్కి’. విడుదలకు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ చిత్రం ‘డ్యూన్’కు ఇది కాపీనా? అని అడిగిన ప్రశ్నకు దర్శకుడు నాగ్ అశ్విన్ ఆసక్తికర రిప్లై ఇచ్చారు. ఈ సినిమాలో ఉన్న ఇసుకను చూసి అలా భావించి ఉండొచ్చని నవ్వేశారు. కల్కిని వేరే హాలీవుడ్ చిత్రాలతో పోల్చడం కొత్తేమి కాదన్నారు. గతంలోనూ పలు సినిమాలతో పోల్చారని పేర్కొన్నారు.

AP: రెబల్ అభ్యర్థులపై టీడీపీ అధిష్ఠానం చర్యలకు దిగింది. నామినేషన్ల విత్‌డ్రా గడువు ముగిసినా వెనక్కి తగ్గని నేతలను సస్పెండ్ చేసింది. అబ్రహం(అరకు), మీసాల గీత(విజయనగరం), సూర్యచంద్రరావు(పోలవరం), శ్యాంకుమార్(అమలాపురం), రాజశేఖర్(సత్యవేడు)పై వేటు వేసింది. అధిష్ఠానం టికెట్ ఇవ్వకపోవడంతో వీరంతా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. దీంతో వీరిపై పార్టీ చర్యలు తీసుకుంది.

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

తేది: ఏప్రిల్ 30, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:35
సూర్యోదయం: ఉదయం గం.5:51
జొహర్: మధ్యాహ్నం గం.12:13
అసర్: సాయంత్రం గం.4:41
మఘ్రిబ్: రాత్రి గం.6:36
ఇష: రాత్రి గం.07.52
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

AP: కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఏపీ చీఫ్ షర్మిల అన్నారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఆమె మాట్లాడారు. రైతులకు అన్యాయం చేసిన వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. ఐదేళ్లు పాలించిన జగన్ గుడ్డి గుర్రాల పళ్లు తోమారా అని ప్రశ్నించారు. ఇప్పటికీ 2.25 లక్షల ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయన్నారు. నాసిరకం మద్యంతో 25 శాతం మంది చనిపోతున్నారని చెప్పారు.

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

తేది: ఏప్రిల్ 30, మంగళవారం
బ.షష్ఠి: ఉదయం 07:05 గంటలకు
ఉత్తరాషాడ: తెల్లవారుజాము 4:09 గంటలకు
దుర్ముహూర్తం: 1.ఉ.08:17 నుంచి 09:08 గంటల వరకు
2.రా.10:55 నుంచి 11:41 గంటల వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 12:31 నుంచి 02:05 గంటల వరకు

రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌కి ఎదురుదెబ్బ ఖాయం: అమిత్ షా
TG:సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల సమన్లు
TG: CM, డిప్యూటీ సీఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: KCR
AP:పిఠాపురంలోనూ గ్లాస్ సింబల్ కుట్ర: జనసేన
AP:చంద్రబాబు వద్ద చాలా డబ్బులున్నాయి.. తీసుకోండి: జగన్
AP:చెత్త పన్ను రద్దు చేస్తా: చంద్రబాబు
AP:చంద్రబాబుకు పెన్షనర్ల ఉసురు తగులుతుంది: సజ్జల
IPL.. ఢిల్లీపై KKR విజయం

ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అథారిటీ 14 పతంజలి ఉత్పత్తుల లైసెన్స్‌లను సస్పెండ్ చేసింది. తప్పుదారి పట్టించే ప్రకటనల కేసుకు సంబంధించి పతంజలి దివ్య ఫార్మసీ తయారు చేస్తున్న 14 ఉత్పత్తుల లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. రామ్‌దేవ్, సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ చెప్పిన <<13113234>>క్షమాపణలకు<<>> సంబంధించిన అంశంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
Sorry, no posts matched your criteria.