India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు ఖరారైనట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవకు.. సీఎం రేవంత్ ఒకప్పుడు సన్నిహితుడు. దీంతో ఆయన అభ్యర్థిత్వానికి అధిష్ఠానం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నెల 12న దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. మరోవైపు స్థానికేతరుడికి ఎలా టికెట్ ఇస్తారంటూ కొంత మంది నేతలు ప్రశ్నిస్తున్నట్లు టాక్.

AP, తెలంగాణలో వచ్చే 3,4రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. TGలోని మంచిర్యాల, నిర్మల్, NZB, ADB, ఆసిఫాబాద్, సిరిసిల్ల, KNR, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. APలో కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించింది. నిన్నటి నుంచే ఇరు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గడంతో ప్రజలు ఎండ నుంచి ఉపశమనం పొందారు.

TG: నీళ్లు లేక పంటలు ఎండిపోతున్న వేళ ప్రభుత్వానికి CPM పార్టీ లేఖ రాసింది. ఏ రిజర్వాయర్లో ఎన్ని నీళ్లున్నాయో చెప్పాలని కోరింది. ఈ మేరకు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. మేడిగడ్డ కుంగిన నేపథ్యంలో పంటలకు నీరందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పంటలు ఎండిపోకుండా కాపాడటంతో పాటు ఇప్పటికే నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసింది.

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో 10 మందికిపైగా BRS నేతలు కీలకంగా వ్యవహరించినట్లు రాధాకిషన్ రావు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. తనకు కీలక పోస్ట్ ఇవ్వడం, రిటైరైనా మరో మూడేళ్లపాటు తన టర్మ్‌ను పొడిగించుకోవడం వెనుక ఉన్న గత ప్రభుత్వ పెద్దల పేర్లను చెప్పినట్లు సమాచారం. బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించేందుకు దాదాపు 200 ప్రశ్నలను పోలీసులు సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.

ఏపీ పాలిసెట్-2024 దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 5న గడువు ముగియాల్సి ఉండగా, 10వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్ష ఈనెల 27న జరగనుంది. పరీక్ష తేదీలో మార్పు ఉండదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.

AP: కొత్తల్లుడు ఇంటికొస్తే రకరకాల వంటకాలు చేసిపెట్టే అత్తామామలను చూస్తుంటాం. కానీ ఉగాది పండగ సందర్భంగా తొలిసారి ఇంటికొచ్చిన మునిమనుమడి కోసం ఓ తాత, అమ్మమ్మ 108రకాల వంటకాలు చేశారు. ఏలూరు జిల్లా మర్లగూడెంకు చెందిన దుర్గారావు ఫ్యామిలీ పిండివంటలు, మధుర ఫలాలు, వివిధ రకాల తినుబండారాలు, మీగడ, వెన్నపూస, డ్రై ఫ్రూట్స్, బిస్కెట్లు, చాక్లెట్లు తదితర పదార్థాలు సిద్ధం చేసి, మునిమనుమడికి గారాబంగా తినిపించారు.

TG: లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ కసరత్తులు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా అందులో కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే, 2-3రోజుల్లో వారి పేర్లను వెల్లడించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లి.. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీతో చర్చిస్తారు. ఆ తర్వాత అభ్యర్థులను ఫైనల్ చేస్తారట.

TG: రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు, చెరువులు ఎండిపోయాయి. అయితే.. నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల సరిహద్దులోని డిండి రిజర్వాయర్ మాత్రం నిండుకుండలా నీటితో కళకళలాడుతోంది. దీంతో సందర్శకుల తాకిడి పెరిగింది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా గతేడాది ఈ జలాశయాన్ని నింపారు. దీని పూర్తి స్థాయి నీటిమట్టం 2.45 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.95టీఎంసీల నిల్వ ఉంది. ప్రస్తుత యాసంగిలో దీని నుంచి ఆయకట్టుకు నీరు వదల్లేదు.

AP: TDP అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ప.గో జిల్లా తణుకులో సా.4గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం తూ.గో జిల్లా నిడదవోలులో రాత్రి 7 గంటలకు నిర్వహించే సభలో రాష్ట్ర BJP చీఫ్ పురందీశ్వరితో కలిసి పాల్గొననున్నారు. రేపు డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తారు. సా.4 గంటలకు అంబాజీపేట సభలో, రాత్రి 7కి అమలాపురం సభలో ప్రసంగిస్తారు.

TG: రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లను జూన్ నెలాఖరు వరకు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 7,149 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 5,923 కేంద్రాలను ప్రారంభించినట్లు పౌరసరఫరాల సంస్థ వర్గాలు తెలిపాయి. ఒక్క మే నెలలోనే 57% పంట కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.