India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బీజేపీ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సినీ నటి కంగనా రనౌత్‌పై సోషల్ మీడియాలో పెట్టిన అభ్యంతరకర <<12924073>>పోస్ట్<<>>పై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఇందుకు కారణమయిన కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనతేపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. అయితే తన సోషల్ మీడియా ఖాతాల నుంచి వేరెవరో ఆ పోస్ట్ పెట్టారని.. దాన్ని తాను తొలగించినట్లు సుప్రియా తెలిపారు.

AP: కాకినాడలో పూజారులపై దాడిని ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు. అర్చకులను కాలితో తన్నడం, కొట్టడం హేయమైన రాక్షస చర్య అని మండిపడ్డారు. ‘అర్చకుడంటే దేవుడు, భక్తుడికి మధ్య అనుసంధాన కర్తగా భావిస్తాం. వారి కాళ్లకు మొక్కే సంప్రదాయం మనది. వైసీపీ నేతల మదానికి ఇది నిదర్శనం’ అని ఫైర్ అయ్యారు.

భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి అరుదైన రికార్డుకు చేరువయ్యారు. ఇవాళ రాత్రి 7 గంటలకు అఫ్గానిస్తాన్‌తో జరిగే మ్యాచు ఆయనకు 150వది. దీంతో భారత్ తరఫున 150 అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచులు ఏకైక ఆటగాడిగా ఆయన నిలవనున్నారు. అలాగే ఈ మైలురాయిని చేరుకున్న 40వ ప్లేయర్‌గా నిలవనున్నారు. ఛెత్రి తన కెరీర్‌లో ఇప్పటివరకు 93 గోల్స్ చేశారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. చరణ్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌లో జోష్ నింపేందుకు మేకర్స్ మూవీ నుంచి ‘జరగండి’ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్‌ను విడుదల చేశారు. రేపు ఉదయం 9 గంటలకు సాంగ్ విడుదలవుతుందని ప్రకటించారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

AP: అన్ని సర్వేలు చూశాకే తనకు BJP అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చిందని సీఎం రమేశ్ తెలిపారు. ‘మా పార్టీలో పాత, కొత్త నేతల వివాదం లేదు. బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. నేను అనకాపల్లికి వస్తున్నాననే వైసీపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ పొత్తును చూసి ఆ పార్టీ భయపడుతోంది. GVL నరసింహారావు విశాఖ టికెట్ ఆశించడంలో తప్పులేదు. ఆయన అసంతృప్తి వ్యక్తం చేయలేదు. పార్టీ కోసం పనిచేస్తానన్నారు’ అని పేర్కొన్నారు.

AP: వృద్ధాప్య, వితంతు పెన్షన్ల పంపిణీపై అధికారులు కీలక ప్రకటన చేశారు. ‘ఆర్థిక సంవత్సరం ముగింపు, నిరంతర సెలవుల దృష్ట్యా ఏప్రిల్ 3 నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతుంది’ అని పేర్కొన్నారు. కాగా ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ల పంపిణీ జరుగుతోన్న విషయం తెలిసిందే.

మాంసాహారంతో పాటు పాల పదార్థాలూ తినకుండా ఉండే వారిని వీగన్స్ అంటారు. అయితే ఇలాంటి వారిలో బాడీమాస్ ఇండెక్స్ తగ్గుతోందని.. దీంతో ఎముకలు విరిగే ప్రమాదం ఎక్కువని శాస్త్రవేత్తలు తెలిపారు. కాల్షియం స్థాయులు తగ్గడమే ఇందుకు కారణమంటున్నారు. మాంసాహారులతో పోలిస్తే వీరికి చిన్న దెబ్బలు తగిలినా తుంటి, కాలి ఎముక విరిగే ఛాన్స్ ఎక్కువట. సో.. వీగన్స్ శరీరంలో జరిగే మార్పుల్ని పరిశీలించుకుంటూ ఉండాలని సూచిస్తున్నారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అందరికీ సుపరిచితమే. ఆయనది ప్రేమ వివాహమే. ఇండోర్‌లో ఓ ఫిల్మ్ షూట్ సమయంలో అనురాధతో ప్రేమలో పడ్డారట. ఆమెతోనే ఉండాలనుకొని సెమిస్టర్ పరీక్ష రాయకుండా ఉండిపోయారు. ఆ తర్వాత ప్రేమలో మునిగిపోయి హీరో లెవల్లో అనురాధకు ప్రపోజ్ చేశారట. వీరిద్దరి వివాహం 1985 జూన్ 17న పెద్దల సమక్షంలో వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత వీరు చదువుకోవడానికి బోస్టన్ యూనివర్సిటీకి వెళ్లారు.

దేశ వాణిజ్య రాజధాని ముంబై బిలియనీర్లకు అడ్డాగా మారింది. ఈ ఏడాది కొత్తగా 26 మంది బిలియనీర్లు చేరడంతో వారి సంఖ్య 92కు పెరిగినట్లు హురున్ గ్లోబల్ రిచ్ నివేదిక వెల్లడించింది. దీంతో బీజింగ్(91)ను వెనక్కి నెట్టి ఆసియాలోనే నంబర్-1, ప్రపంచంలో మూడో స్థానానికి ముంబై చేరింది. న్యూయార్క్‌లో అత్యధికంగా 119 మంది, లండన్‌లో 97 మంది బిలియనీర్లు ఉన్నారు. ముంబైలోని బిలియనీర్ల ఆస్తుల విలువ $445 బిలియన్లు.

లద్దాక్‌లో ప్రముఖ ఇంజినీర్, సంస్కరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న నిరాహార దీక్ష 21వ రోజుకు చేరింది. వాంగ్‌చుక్ ఆధ్వర్యంలో హక్కుల కోసం స్థానికులు పోరాడుతున్నా కేంద్రం స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రకటించినట్టు నేడు ఆయన దీక్ష విరమించే అవకాశం ఉంది. వాంగ్‌చుక్ స్థానంలో స్థానికులు విడతల వారీగా దీక్ష చేపట్టనున్నారు. ఆయన కోలుకున్నాక మళ్లీ నిరాహార దీక్ష చేపట్టే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.