India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP:ఎమ్మిగనూరు YCP MLA అభ్యర్థి బుట్టా రేణుక ఆస్తుల వేలానికి LIC హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఆమె భాగస్వామిగా ఉన్న బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మరికొన్ని సంస్థల ఆస్తులను మే 6న వేలం వేయనుంది. కొన్నేళ్ల క్రితం LIC హౌసింగ్ నుంచి వ్యాపార అవసరాల కోసం రూ.340 కోట్ల రుణం తీసుకోగా.. నష్టాలు రావడంతో బకాయిలు పేరుకుపోయాయి. దీంతో LIC వేలం ప్రకటన ఇవ్వగా, దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని ఆమె తెలిపారు.

లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రుల హవా క్రమంగా తగ్గిపోయింది. 1991 నుంచి పోటీ చేసిన వారిలో 99% మంది డిపాజిట్లు కోల్పోయారు. 1951-52లో 6.9% మంది స్వతంత్రులు ఎంపీలుగా గెలిచారు. 1957లో 8.7%, 1962లో 4.2%, 1984లో 0.30%, 2019లో 0.11% మంది మాత్రమే గెలుపొందారు. 1951-52లో 533 మంది పోటీ చేయగా 37 మంది గెలిచారు. 2019 ఎన్నికల్లో 8,000 మంది పోటీ చేయగా నలుగురే ఎన్నికయ్యారు. <<-se>>#Elections2024<<>>

IPLలో GTపై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన శశాంక్ సింగ్ దేశవాళీ క్రికెట్‌లో ఛత్తీస్‌గఢ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2015లో ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీలో అరంగేట్రం చేశారు. 2019లో ఛత్తీస్‌గఢ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. IPLలో DC(2017), RR (2018-19), SRH(2022), PBKS(2024)కు ఆడారు. ఒక లిస్ట్-A మ్యాచులో 150 రన్స్, 5 వికెట్లు తీసిన తొలి భారత క్రికెటర్‌గా గతేడాది రికార్డు సృష్టించారు.

కేంద్ర ప్రభుత్వ టీవీ ఛానెల్ దూరదర్శన్(DD)పై కేరళ సీఎం పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాలకు కేరాఫ్‌గా నిలిచిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రాన్ని దూరదర్శన్‌లో ప్రసారం చేయడం సరికాదన్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ మత ఘర్షణలకు దారితీస్తుందని Xలో పోస్ట్ చేశారు. BJP, ఆరెస్సెస్‌కు ప్రచార యంత్రంగా DD మారొద్దంటూ హితవు పలికారు. మరోవైపు శుక్రవారం ఈ మూవీని ప్రసారం చేసేందుకు డీడీ సిద్ధమైంది.

లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలు నుంచి విడుదలైన AAP ఎంపీ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి(TG)తో పాటు స్టాలిన్(TN), భగవంత్‌మాన్(PB) వంటి బీజేపీయేతర సీఎంలను కేంద్రం అరెస్టు చేయిస్తుందని ఆరోపించారు. వారందరితో సీఎం పదవులకు రాజీనామా చేయించేందుకు BJP సిద్ధమవుతోందన్నారు. దేశంలో నియంతృత్వం మొదలైందనడానికి ఢిల్లీ, ఝార్ఖండ్ సీఎంలను జైలుకు పంపడమే నిదర్శమని ఆయన అన్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న బర్త్ డే కావడంతో అభిమానులు, ఇండస్ట్రీకి చెందిన వారు ఆమెకు విషెస్ తెలియజేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే, బర్త్ డే సందర్భంగా ‘పుష్ప-2’ సినిమాలోని ఆమె లుక్‌తో పోస్టర్‌ను రిలీజ్ చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డేకి మూవీ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నందున.. ఈరోజు ఆమె లుక్ రివీల్ చేయాలని కోరుతున్నారు.

గుజరాత్‌తో మ్యాచ్‌లో మెరుపు బ్యాటింగ్‌తో పంజాబ్‌ను గెలిపించిన శశాంక్‌ని వేలంలో PBKS వద్దనుకుంది. వేరొక శశాంక్‌ను కొనబోయి.. ఇతడిని రూ.20లక్షలకు కొనేసింది. అప్పట్లో అది చర్చనీయాంశమైంది. కాగా.. ‘సరైన శశాంక్ సింగే జట్టులోకి వచ్చాడు’ అని అప్పుడు PBKS యాజమాన్యం కవర్ చేసుకుంది. అయితే.. అలా వద్దనుకున్న ఆటగాడే ఇప్పుడు పెద్ద దిక్కుగా మారి కష్టాల్లో ఉన్న జట్టును 29బంతుల్లో 61రన్స్‌తో రాణించి గెలిపించారు.

TG: నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రైతు సత్యాగ్రహ దీక్షలు చేయనుంది. కరవు వల్ల పంటలు నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని దీక్షకు దిగనుంది. క్వింటా వడ్లకు రూ.500 బోనస్, రూ.2 లక్షల లోపు రుణమాఫీ, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. జిల్లా కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు దీక్ష చేపట్టనుంది.

TG: వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలకు సంబంధించి 12 జిల్లాల్లో ఓటర్ల తుది జాబితాను ఈసీ విడుదల చేసింది. మొత్తం 4,61,806 మంది ఓటర్లను గుర్తించగా.. వీరిలో పురుషులు 2.87 లక్షల మంది, మహిళలు 1.74 లక్షల మంది, ఇతరులు ఐదుగురు ఉన్నారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 83,606 మంది, అత్యల్పంగా సిద్దిపేటలో 4,671 మంది ఉన్నారు. ఈ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇక్కడ <

AP: గత ఎన్నికల్లో వైసీపీలో చేరి ఆ పార్టీ తరఫున విస్తృత ప్రచారం చేశారు నటుడు అలీ. ఆయనకు అధిష్ఠానం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవినిచ్చింది. అయితే గత ఎన్నికల సమయంలో గుంటూరు ఈస్ట్ సీటు కోసం అలీ ప్రయత్నించగా సాధ్యపడలేదు. ఈ ఎన్నికల్లోనైనా సీటు దక్కుతుందని భావించినా నిరాశే ఎదురైంది. వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన అనంతరం నుంచి అలీ సైలెంట్ అయిపోయారు. ఎన్నికల ప్రచారంలోనూ ఎక్కడా కనిపించడం లేదు.
Sorry, no posts matched your criteria.