news

News March 26, 2024

ఇండిపెండెంట్‌గా మాజీ సీఎం.. బీజేపీ మద్దతు

image

తమిళనాడు మాజీ CM, అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్ సెల్వం ఉనికి కోసం పోరాడుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రామనాథపురం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. BJP సైతం వ్యూహాత్మకంగా ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టకుండా పన్నీర్‌కు మద్దతు ప్రకటించింది. దీంతో ఈ స్థానం తమిళనాట హాట్‌టాపిక్‌గా మారింది. BJP మద్దతుతో పాటు, అన్నాడీఎంకేలోని చీలిక వర్గం మద్దతుతో సులువుగా గెలుస్తానని పన్నీర్ ధీమాగా ఉన్నారు.

News March 26, 2024

అదానీ గ్రూప్ చేతుల్లోకి మరో పోర్ట్!

image

దేశంలోని తూర్పు, పశ్చిమ తీరాల్లో ఇప్పటికే పలు పోర్టులను నిర్వహిస్తున్న అదానీ గ్రూప్ తాజాగా మరో పోర్టును దక్కించుకోనుంది. రూ.3,080 కోట్లతో ఒడిశాలోని గోపాల్‌పుర్ పోర్టు (GPL) కొనుగోలుకు సిద్ధమైంది. GPLలో ఎస్‌పీ గ్రూప్‌కు ఉన్న 56%, ఒడిశా స్టీవ్‌డోర్స్ లిమిటెడ్‌కు చెందిన 39% వాటాను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. కాగా ప్రస్తుతం పశ్చిమ తీరంలో 7, తూర్పు తీరంలో ఏడు పోర్టులు అదానీ పరిధిలో ఉన్నాయి.

News March 26, 2024

ఫోన్ ట్యాపింగ్‌తో నాకు సంబంధం లేదు: ఎర్రబెల్లి

image

TG: ఫోన్ ట్యాపింగ్‌తో తనకు సంబంధం లేదని, ప్రణీత్ రావు ఎవరో తెలియదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ విషయాన్ని ప్రణీత్ రావు కూడా చెప్పారని పేర్కొన్నారు. ఏం జరిగిందో విచారణలో తేలుతుందని చెప్పారు. ఇతర పార్టీలో చేరాలని ఆఫర్లు వస్తున్నా.. తనకు ఆ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

News March 26, 2024

ఒక కేజీ కజ్జికాయల ధర రూ.56 వేలు!

image

హోలీ పండుగ సందర్భంగా UPలోని ఓ స్వీట్ షాపులో తయారు చేసిన కజ్జికాయలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. లక్నోలోని ఓ వ్యాపారి 24 క్యారెట్ల బంగారు పూతతో వీటిని తయారు చేశారు. వీటిలో 6 దేశాలకు చెందిన డ్రై ఫ్రూట్స్‌ని వినియోగించారట. ఒక KGని రూ.56 వేలకు విక్రయించారు. కాగా శ్రీకృష్ణుడికి ఇష్టమైన వంటకంగా చెప్పుకునే దీనిని చాలా రాష్ట్రాల్లో హోలీ రోజున తప్పక తింటారు. ఉత్తర భారతంలో దీన్ని గుఝియా అని పిలుస్తారు

News March 26, 2024

BREAKING: కుమారుడికి ఎగ్జామ్స్.. బెయిల్ కోరిన కవిత

image

MLC కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కవిత కుమారుడి పరీక్షల నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు చెప్పారు. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సమాధానం ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని ఈడీ కోరింది. ఇరువైపులా వాదనలు విన్న రౌస్ అవెన్యూ న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

News March 26, 2024

హైకోర్టు నిర్మాణానికి రేపు సీఎం రేవంత్ శంకుస్థాపన?

image

TG: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి రేపు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ భూమి చదును కార్యక్రమాలను అధికారులు వేగవంతం చేశారు. కాగా హార్టికల్చర్ వర్సిటీకి చెందిన 100 ఎకరాలను హైకోర్టుకు కేటాయించడంపై విద్యార్థి, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే.

News March 26, 2024

2026 నాటికి అస్సాంలో కాంగ్రెస్ కనుమరుగు: సీఎం హిమంత

image

రాహుల్ గాంధీ భవిష్యత్తు అంధకారమని, ఆయన అనుచరుల పరిస్థితి కూడా అదేనని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ఎద్దేవా చేశారు. 2026 నాటికి అస్సాంలో కాంగ్రెస్ కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. ‘ఇటీవల ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీలో ఉన్న మంచి లీడర్లంతా మావైపు వస్తారు. 2026 నాటికి ఈ ఓల్డ్ పార్టీ కనుమరుగవుతుంది’ అని పేర్కొన్నారు.

News March 26, 2024

అల్లు అర్జున్ మరో ఘనత

image

అల్లు అర్జున్ మైనపు విగ్రహం దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఈ నెల 28న కొలువుదీరనుంది. ఈ కార్యక్రమం కోసం ఐకాన్ స్టార్ ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌కు చేరుకున్నారు. అక్కడి మ్యూజియంలో ఇప్పటి వరకు అమితాబ్, షారుఖ్, ఐశ్వర్యారాయ్ విగ్రహాలు ఉండగా, ఇప్పుడు తొలి సౌత్ ఇండియా హీరోగా బన్నీ విగ్రహం ఏర్పాటు చేయడం విశేషం. ప్రభాస్, మహేశ్ బాబు విగ్రహాలు లండన్‌లోని టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటైన విషయం తెలిసిందే.

News March 26, 2024

కవితను 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు అప్పగించాలన్న ఈడీ

image

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన MLC కవితను జ్యుడీషియల్ రిమాండ్‌కు అప్పగించాలని ఈడీ కోర్టును కోరింది. 15 రోజులు కస్టడీకి పంపాలని అడిగింది. ఈ క్రమంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడు. మరో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చింది. మూడో నిందితుడు బాండ్ల రూపంలో రూ.50 కోట్లు ఇచ్చాడు. ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు’ అని కవిత వ్యాఖ్యానించారు.

News March 26, 2024

బెట్టింగ్ మిగిల్చిన విషాదం.. మహిళ ఆత్మహత్య

image

బెంగళూరులో బెట్టింగ్‌ ఓ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. దర్శన్ బెట్టింగ్‌‌లో రూ.1.5కోట్లు పోగొట్టుకోగా.. బాకీ తీర్చాలని అప్పుల వాళ్లు ఒత్తిడి చేయసాగారు. దీంతో అతని భార్య రంజిత ఆత్మహత్యకు పాల్పడింది. అప్పు తీర్చకుంటే పరువు తీస్తామని వేధించినట్లు ఆమె సూసైడ్ నోట్‌లో పేర్కొంది. పోలీసులు 13 మందిపై కేసు నమోదు చేశారు. కాగా నిందితులు బలవంతంగా తన అల్లుడి చేత అప్పు చేయించారని మృతురాలి తండ్రి ఆరోపించారు.