India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ బీజేపీ నుంచి పోటీ చేయనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆమెను బరిలోకి దించనున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఇటీవల ఆమెకు కేంద్రం పద్మశ్రీ పురస్కారం ఇవ్వడంతో.. ఆమె బీజేపీ తరఫున పోటీ చేస్తారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రామాయణ సీరియల్ నటుడు అరుణ్ గోవిల్ UPలోని మీరట్ నుంచి పోటీ చేయనున్నారు.

శ్రీలంక బ్యాటర్ కమిందు మెండిస్ చరిత్ర సృష్టించారు. ఏడు లేదా ఆ తర్వాతి స్థానంలో బ్యాటింగ్‌కు దిగి, ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచారు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 102 పరుగులు చేసిన మెండిస్, రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకాన్ని నమోదు చేశారు. దీంతో శ్రీలంక భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.

* రాజోలు – దేవ వరప్రసాద్
* తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్
* భీమవరం – పులపర్తి ఆంజనేయులు
* నరసాపురం – బొమ్మిడి నాయకర్
* ఉంగుటూరు – పత్సమట్ల ధర్మరాజు
* పోలవరం – చిర్రి బాలరాజు
* తిరుపతి – ఆరణి శ్రీనివాసులు
* రైల్వే కోడూరు – యనమల భాస్కరరావు

AP: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 18 మంది అభ్యర్థుల జాబితాను జనసేన విడుదల చేసింది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో ఉంటారని అధికారంగా ప్రకటించింది. నెల్లిమర్ల-లోకం మాధవి, అనకాపల్లి- కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్-పంతం నానాజీ, తెనాలి-నాదెండ్ల మనోహర్, నిడదవోలు-కందుల దుర్గేష్, పెందుర్తి-పంచకర్ల రమేశ్ బాబు, యలమంచిలి- సుందరపు విజయ్ కుమార్, పి.గన్నవరం-గిడ్డి సత్యనారాయణ పోటీ చేయనున్నారు.

ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. రాజమండ్రి-పురంధేశ్వరి, అనకాపల్లి-సీఎం రమేశ్, అరకు-కొత్తపల్లి గీత, రాజంపేట-కిరణ్‌కుమార్ రెడ్డి, తిరుపతి-వరప్రసాద్, నరసాపురం-శ్రీనివాస్ వర్మకు టికెట్లు దక్కాయి. తెలంగాణలోని ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి తాండ్ర వినోద్ రావు, వరంగల్ నుంచి ఆరూరి రమేశ్ పోటీ చేయనున్నారు.

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు బోగస్ అని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరిట బీజేపీ రాజకీయ క్షుద్ర క్రీడను ఆడుతోందని దుయ్యబట్టింది. ప్రతిపక్షాలను, నాయకులను వేధించేందుకు బీజేపీ సర్కార్ చేసిన మాయోపాయమని పేర్కొంది. ఈ కేసులో అరెస్టైన పలువురు బీజేపీకి విరాళాలు ఇచ్చారని.. ఇదిగో సంచలన సాక్ష్యమని ఎలక్టోరల్ బాండ్ల వివరాలను షేర్ చేసింది.

నటి ఇంద్రజ శంకర్ వివాహం చేసుకున్నారు. తన ఫ్రెండ్, డైరెక్టర్ కార్తీక్‌తో ఏడడుగులు వేశారు. చెన్నైలో జరిగిన వీరి పెళ్లికి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. కమెడియన్ రోబో శంకర్ కుమార్తె అయిన ఇంద్రజ.. విజిల్, పాగల్, విరుమాన్ చిత్రాల్లో నటించి మెప్పించారు.

పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ మహ్మద్ ఆమిర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. పాక్ క్రికెట్ బోర్డుతో చర్చల తర్వాత నిర్ణయించుకున్నానని ట్వీట్ చేశారు. ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌నకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. అంతకుముందు ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం కూడా రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించారు.

ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాజాసాబ్’. ఈ మూవీ 4 రోజుల షూటింగ్‌కి ₹4 కోట్లు ఖర్చు చేసినట్లు మారుతి తెలిపారు. ‘ఒకప్పుడు ‘ఈ రోజుల్లో’ సినిమాని ₹30 లక్షల బడ్జెట్‌తోనే తీశా. కానీ రాజాసాబ్ మూవీకి 4 రోజుల్లోనే కోట్లు ఖర్చయింది. ప్రభాస్ సినిమా కాకపోతే ఆ బడ్జెట్‌లో నేను రెండు మూడు సినిమాలు తీసేవాడిని’ అని చెప్పారు. దీంతో రాజాసాబ్ సినిమా బడ్జెట్ ₹100 కోట్ల పైనే ఉంటుందని టాక్.

TG: రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు సంచలన విషయాలు వెల్లడించారు. ‘ఉన్నతాధికారులు చెబితేనే ఎన్నికలప్పుడు వందలాది ఫోన్లు ట్యాప్ చేశాం. అందులో నేతలు, వారి కుటుంబ సభ్యులు, బంధువులూ ఉన్నారు. BRS కీలక నేత కొన్ని నంబర్లు ట్యాప్ చేయమన్నారు. మెయిన్ ట్యాపింగ్ డివైజ్‌ను ధ్వంసం చేశాం. కంప్యూటర్ల హార్డ్ డిస్క్‌లను విరిచి మూసీ నదిలో పడేశాం. కొన్ని పత్రాలు కాల్చేశాం’ అని తెలిపారు.
Sorry, no posts matched your criteria.