India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారత సైన్యంలో ఎంతో అనుభవజ్ఞుడైన సుబేదార్ థాన్సేయా 102 ఏళ్ల వయసులో కన్నుమూశారు. మిజోరాం రాష్ట్రానికి చెందిన ఆయన గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, మార్చి 31న తుది శ్వాస విడిచినట్లు ఆర్మీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అస్సాం రెజిమెంట్‌కు చెందిన థాన్సేయా.. కోహిమా యుద్ధంలో కీలక పాత్ర పోషించారు.

నార్త్ కొరియా మరోమారు దుస్సాహసానికి ఒడిగట్టిందని దక్షిణ కొరియా ఆరోపించింది. జపాన్ సముద్రంలోకి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని తెలిపింది. జపాన్ కోస్టు గార్డు ఆ విషయాన్ని ధ్రువీకరించింది. ఇది ఈ ఏడాది ఉత్తర కొరియా చేపట్టిన మూడో క్షిపణి ప్రయోగం కావడం గమనార్హం. దక్షిణ కొరియా తమకు ప్రధాన శత్రువని, తమ భూభాగంలో 0.1శాతాన్ని ఆక్రమించినా యుద్ధాన్ని ప్రకటిస్తామని ఉత్తర కొరియా ప్రకటించిన సంగతి తెలిసిందే.

AP: గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని ప్రజల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడి కాల్వకు నీరు విడుదల చేయాలని KRMBని ప్రభుత్వం కోరింది. ఈ నెల 8 నుంచి రోజుకు 5500 క్యూసెక్కుల చొప్పున 5 టీఎంసీలు విడుదల చేయాలంది. గత అక్టోబర్‌లో అంగీకరించిన మేరకు నీటిని విడుదల చేయాలని గుర్తు చేసింది. అటు కేటాయించిన దాని కంటే తెలంగాణ 7.391 TMCల నీటిని అధికంగా వాడుకుందని, ఇకపై నియంత్రించాలని కోరింది.

ఇప్పటికే వరుస ఓటములతో డీలాపడ్డ ముంబైని చెత్త రికార్డులు వెంటాడుతున్నాయి. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన MI కేవలం 125 పరుగులకే పరిమితమైంది. దీంతో ఈ సీజన్‌లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 15.3ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. అంతకుముందు చెన్నైతో మ్యాచ్‌లో గుజరాత్ 143/8 నమోదు చేసింది. దాన్ని ముంబై చెరిపేసింది.

AP: విజయవాడ ఈస్ట్.. రాష్ట్రంలోని హాట్‌సీట్‌లలో ఒకటి. దివంగత కాపు నేత వంగవీటి మోహన రంగా, మాజీ CM నాదెండ్ల భాస్కరరావు ఇక్కడి నుంచి గెలుపొందారు. ఇక్కడ 1983లో TDP గెలిచింది. ఆ తర్వాత 2014, 19లో వరుసగా నెగ్గిన గద్దె రామ్మోహన్ మరోసారి TDP నుంచి పోటీకి సై అంటున్నారు. YCP నుంచి దేవినేని అవినాష్ బరిలో దిగుతున్నారు. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే గెలిపిస్తాయని ఇద్దరు నేతలు ధీమాగా ఉన్నారు.
<<-se>>#ELECTION2024<<>>

‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా వచ్చిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. టాలీవుడ్‌లో సీక్వెల్ చిత్రాలు పెద్దగా ఆకట్టుకోవనే ప్రచారాన్ని ఈ సినిమా బ్రేక్ చేసింది. ఇటీవల విడుదలైన ఈ టిల్లన్న మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో బాహుబలి-2, కేజీఎఫ్-2, దృశ్యం-2, హిట్-2, బంగార్రాజు, కార్తికేయ-2 వంటి హిట్ చిత్రాల సరసన నిలిచింది. ఈ సినిమాలు కూడా సీక్వెల్‌గా వచ్చి విజయం సాధించడం గమనార్హం.

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆటగాళ్ల ఫామ్‌పై ఆ జట్టు చీఫ్ కోచ్ ఆండీ ఫ్లవర్ స్పందించారు. ‘వీలైనంత త్వరగా బ్యాటర్లు ఫామ్‌లోకి వస్తారు. స్టార్ బ్యాటర్లు ఒక్కసారి పరుగులు రాబట్టడం మొదలుపెడితే భారీ స్కోర్లు చూడొచ్చు. అందులో నాకెలాంటి అనుమానం లేదు’ అని ఫ్లవర్ తెలిపారు. కాగా RCBలో ఇప్పటివరకు బ్యాటింగ్‌లో కోహ్లీ(181 రన్స్) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. మరోవైపు బౌలర్లూ తీవ్రంగా నిరాశపరుస్తున్నారు.

AP:గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు ఈ శనివారంలోగా విడుదలయ్యే ఛాన్సుంది. ఈ పరీక్ష ద్వారా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. దీంతో APPSC నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. 2 రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే ఛాన్సుంది. నోటిఫికేషన్ జారీ, ప్రిలిమ్స్ మధ్య సన్నద్ధతకు సమయం లేకపోవడంతో ఒక్కో పోస్టుకు 100 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

ఈ IPL సీజన్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. దీంతో హార్దిక్ పాండ్య కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. కెప్టెన్‌గా వ్యూహాలను అమలు చేయడంతో హార్దిక్ ఘోరంగా ఫెయిల్ అవుతున్నారంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ‘ఇక చాలు హార్దిక్.. రోహిత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేయ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. లేకుంటే ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేమని అభిప్రాయపడుతున్నారు.

AP: గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఆర్ఎస్ సెట్-2024, ఏపీఆర్‌జేసీ, డీసీ సెట్‌లకు దరఖాస్తు గడువును ఈ నెల 5వ తేదీ వరకు పొడిగించారు. 2024- 25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు 5 నుంచి 8 తరగతుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు https://aprs.apcfss.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.
Sorry, no posts matched your criteria.