news

News March 24, 2024

త్వరలోనే పిఠాపురంలో ప్రచారం: పవన్

image

AP: త్వరలోనే పిఠాపురం నుంచి ప్రచారం ప్రారంభిస్తానని జనసేనాని పవన్ తెలిపారు. జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌తో టీడీపీ ఇన్‌ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ, మాజీ మంత్రి రంగారావు సమావేశమయ్యారు. నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితుల గురించి పవన్‌కు వర్మ వివరించారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు.

News March 24, 2024

కష్టాల్లో లక్నో

image

రాజస్థాన్‌తో మ్యాచులో లక్నో కష్టాల్లో పడింది. 194 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆ జట్టు 8 ఓవర్లలో 60 రన్స్‌కే 4 కీలక వికెట్లు కోల్పోయింది. హుడా 26, డీకాక్ 4, బదోనీ 1, పడిక్కల్ డకౌట్ అయ్యారు. క్రీజులో రాహుల్, పూరన్ ఉన్నారు. RR బౌలర్లలో బౌల్ట్ 2 వికెట్లు పడగొట్టారు. బర్గర్, చాహల్ తలో వికెట్ తీశారు.

News March 24, 2024

రెండో పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు

image

భర్త చనిపోయిన చాలామంది ఆడవాళ్లు రెండో పెళ్లికి అయిష్టంగా ఉంటారు. అలాంటి మహిళలకు భరోసా ఇచ్చేందుకు ఝార్ఖండ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ‘విధ్వ పునర్వివాహ్ ప్రోత్సాహన్ యోజన’ పేరుతో రెండో పెళ్లి చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. రెండో పెళ్లి సర్టిఫికెట్‌తో పాటు చనిపోయిన భర్త మరణ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే.. వారి ఖాతాలో నగదు జమ చేస్తోంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్లు తీసుకునేవారికి వర్తించదు.

News March 24, 2024

‘ఫ్యామిలీ స్టార్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

image

హీరో విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబినేషన్‍లో వస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుండగా ఈ నెల 28న ట్రైలర్‌ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన రాగా మూడో సాంగ్‌ను 25వ తేదీన విడుదల చేస్తామని తెలిపారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు.

News March 24, 2024

IPL: బౌల్ట్ బంతికి బ్యాటర్ హెల్మెట్ పగిలిపోయింది

image

లక్నోతో జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ నిప్పులు చెరుగుతున్నారు. మూడో ఓవర్‌లో అతడు వేసిన తొలి బంతి లక్నో బ్యాటర్ పడిక్కల్ హెల్మెట్‌కు బలంగా తగిలింది. దీంతో హెల్మెట్ వెనకాల ఉండే నెక్ గార్డ్ విరిగి కిందపడింది. అదృష్టవశాత్తు పడిక్కల్‌కు ఎలాంటి గాయం కాలేదు. అయితే తర్వాతి బంతికే అతడిని బౌల్ట్ క్లీన్ బౌల్డ్ చేశారు. అనంతరం అతడు వేసిన ఓవర్‌లో మరో బంతి రాహుల్ హెల్మెట్‌ను బలంగా తాకింది.

News March 24, 2024

కేజ్రీవాల్ అరెస్టును కోరితెచ్చుకున్నారు: అస్సాం సీఎం

image

సీఎం కేజ్రీవాల్ అరెస్టును తానే కోరితెచ్చుకున్నారని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. ‘కేజ్రీవాల్‌కు ఈడీ తొమ్మిదిసార్లు నోటీసులు పంపింది. వాటిని అతడు బేఖాతరు చేశారు. తొలి సమన్లకే స్పందించి ఉంటే బహుశా అరెస్ట్ అయ్యేవారు కాదేమో. కొన్ని నెలల క్రితం సమన్లు వచ్చిన వెంటనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విచారణకు హాజరయ్యారు’ అని హిమంత తెలిపారు. సానుభూతి కోసమే కేజ్రీవాల్ ఇలా చేసినట్లు ఆయన అభిప్రాయపడ్డారు.

News March 24, 2024

ప్రీతి జింటాతో సెల్ఫీ

image

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కి తొలి విజయం దక్కడంతో ఆ జట్టు కో-ఓనర్, బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా సందడి చేశారు. ఆ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆమె డగౌట్‌లో తన రియాక్షన్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. ఢిల్లీపై గెలిచిన తర్వాత పంజాబ్ ఆటగాళ్లు లివింగ్‌స్టోన్‌, సామ్‌ కరన్.. ప్రీతి జింటాతో సెల్ఫీ దిగారు. ‘మా జట్టు బిగ్గెస్ట్ సపోర్టర్‌తో మ్యాచ్ విజేతలు’ అని ఆ ఫొటోను పంజాబ్ టీమ్ ట్వీట్ చేసింది.

News March 24, 2024

ముందు నో చెప్పి.. తర్వాత ఓకే అన్నారు: శ్రుతి

image

‘లియో’ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ‘ఇనిమేల్’ మ్యూజిక్ ఆల్బమ్ కోసం హీరోయిన్ శ్రుతి హాసన్‌తో నటించిన సంగతి తెలిసిందే. ఈ ఆల్బమ్ విషయమై శ్రుతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిలో నటించేందుకు ముందుగా లోకేశ్ నో చెప్పారని.. కాన్సెప్ట్ విన్నాక ఒకే చెప్పారన్నారు. ఇందులో లోకేశ్ చాలా చక్కగా నటించారని తెలిపారు. కాగా ఈ మ్యూజిక్ ఆల్బమ్ ఫుల్ వీడియో రేపు రానుంది. ఈ సాంగ్‌కి కమల్ హాసన్ లిరిక్స్ అందించారు.

News March 24, 2024

IPL చరిత్రలో ఒకే ఒక్కడు..

image

రాజస్థాన్ ప్లేయర్ సంజూ శాంసన్ అరుదైన రికార్డు నెలకొల్పారు. ఐపీఎల్‌లో వరుసగా ఐదు సీజన్లలో ఓపెనింగ్ మ్యాచులో 50+ స్కోర్ చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచారు. లక్నోతో మ్యాచులో సంజూ(82*) హాఫ్ సెంచరీ చేయడంతో ఈ ఘనత అందుకున్నారు. కాగా 2020లో CSKపై 72, 2021లో పంజాబ్ పై 119, 2022లో SRHపై 55, 2023లోనూ SRHపైనే 55 పరుగులు చేశారు.

News March 24, 2024

చంద్రబాబు నివాసం వద్ద ఆశావహుల సందడి

image

AP: ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి ఆశావహులు క్యూ కట్టారు. టీడీపీ ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థుల చివరి జాబితా త్వరలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్ రాజుకు సీటివ్వాలని మందకృష్ణ మాదిగ కోరారు. విజయనగరం పార్లమెంట్ సీటు కోసం కంది చంద్రశేఖర్ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి కోరారు. భీమిలి టికెట్ కోసం కోరాడ రాజబాబు ప్రయత్నిస్తున్నారు.