India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

USA టీ20 జట్టులో భారత్‌కు చెందిన ఉన్ముక్త్ చంద్ చోటు దక్కించుకోలేకపోయారు. USA తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడేందుకు అతను భారత్‌ను వీడి వెళ్లారు. అక్కడ జరిగే మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో రాణించారు. 45 ఇన్నింగ్స్‌లో 1500 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచారు. అయినా అతనికి నిరాశే ఎదురైంది. కెనడాతో జరిగే టీ20 సిరీస్‌కు అతడు సెలక్ట్ కాలేదు. దీంతో T20 WCలో అతడు ఆడే ఛాన్స్ లేదని తెలుస్తోంది.

TG: ఎంపీ ఎన్నికల తర్వాత మాజీ మంత్రి హరీశ్‌రావు బీజేపీలో చేరతారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌లో కేసీఆర్, కేటీఆర్ మాత్రమే మిగులుతారని జోస్యం చెప్పారు. తామేమీ చేరికల గేట్లు ఎత్తలేదని, ఆ పార్టీ వాళ్లే దూసుకొని వస్తున్నారని తెలిపారు. ఇది కేసీఆర్ నేర్పిన విద్యేనని, చేసిన పాపం ఆయనకే తగులుతోందని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ చిల్లర వ్యవహారమని పేర్కొన్నారు.

కోలీవుడ్ హీరోయిన్ ఆండ్రియా జెర్మియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను హారర్, హింసాత్మక చిత్రాలు చూడనని, కానీ అలాంటి సినిమాల్లో నటిస్తానని చెప్పారు. చూడటం వేరు.. నటించడం వేరని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె తమిళంలో కా- ది ఫారెస్ట్, పిశాచి-2, నో ఎంట్రీ తదితర మూవీల్లో నటిస్తున్నారు. ఇటీవలే తెలుగులో ‘సైంధవ్’లో కీలక పాత్ర పోషించారు. ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్‌గానూ రాణిస్తున్నారు.

AP: టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి మరో 3 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆ జాబితాలో జనసేన పోటీ చేసే మూడు నియోజకవర్గాలు పాలకొండ, విశాఖ సౌత్, అవనిగడ్డ ఉన్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ, జనసేన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ, బీజేపీ 10 ఎమ్మెల్యే, 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఐటీ శాఖ రూ.1823.08 కోట్ల విలువైన ట్యాక్స్ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ ట్యాక్స్ టెర్రరిజమ్‌కు పాల్పడుతోందని.. తమను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. అయినా తగ్గేది లేదని స్పష్టం చేసింది. ‘BJP కూడా ఎన్నో ఉల్లంఘనలకు పాల్పడింది. ఆ పార్టీపై ఉన్న రూ.4600 కోట్ల పెనాల్టీలకు సంబంధించి కూడా ఐటీ శాఖ నోటీసులు ఇచ్చి ఆ మొత్తాన్ని వసూలు చేయాలి’ అని డిమాండ్ చేసింది.

AP: చిలకలూరిపేట వైసీపీలో సంక్షోభం నెలకొందనే ప్రచారం సాగుతోంది. YCP MLA అభ్యర్థి మనోహర్ నాయుడికి వ్యతిరేక, అనుకూల గ్రూపులుగా పట్టణ కౌన్సిలర్లు చీలిపోయినట్లు తెలుస్తోంది. ఆయనకు సహకరించేది లేదని 12 మంది కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. వీరంతా తొలుత వైసీపీ టికెట్ పొందిన మల్లెల రాజేశ్ నాయుడికి టచ్‌లో ఉన్నట్లు టాక్. రాజేశ్‌తో పాటు వారు టీడీపీలో చేరుతారని స్థానికంగా చర్చ జరుగుతోంది.

బిహార్‌లో లోక్‌సభ సీట్ల కేటాయింపుపై ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతలు ప్రకటన విడుదల చేశారు. పూర్నియా, హాజీపూర్‌లతో సహా 26 స్థానాల్లో ఆర్జేడీ అభ్యర్థులు పోటీ చేయనుండగా, కిషన్‌గంజ్, పట్నా సాహిబ్ సహా 9 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగనున్నారు. లెఫ్ట్ పార్టీలు 5 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్(7.7) కంటే ఆర్జేడీకే(15.36) ఓటు శాతం ఎక్కువగా ఉంది.

ఎంపీ అభ్యర్థులు: విజయనగరం- అప్పలనాయుడు, ఒంగోలు- మాగుంట శ్రీనివాసులురెడ్డి, కడప-భూపేష్ రెడ్డి, అనంతపురం- అంబికా లక్ష్మీనారాయణ.
ఎమ్మెల్యే అభ్యర్థులు: చీపురుపల్లి- కళా వెంకట్రావు, పాడేరు- వెంకట రమేశ్, రాజంపేట- సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు- వీరభద్ర గౌడ్, గుంతకల్లు- గుమ్మనూరు జయరాం, కదిరి- వెంకట ప్రసాద్, భీమిలి- గంటా శ్రీనివాస్, దర్శి- గొట్టిపాటి లక్ష్మి, అనంతపురం- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్.

TG: తాను ఇంకా కాంగ్రెస్‌లో చేరలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆ పార్టీలో చేరే విషయమై రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడి తన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు దీపాదాస్ మున్షీ, రోహిత్ చౌదరీ ఆయన ఇంటికెళ్లి కలిశారు. శ్రీహరిని పార్టీలోకి ఆహ్వానించినట్లు మున్షీ తెలిపారు.

AP: సీఎం జగన్ మొన్నటి వరకు పరదాల చాటున తిరిగారని, ఇప్పుడు బయటికి వస్తే ప్రజలు పారిపోతున్నారని TDP చీఫ్ చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘ఎన్నికల్లో సానుభూతి కోసం గతంలో కోడి కత్తి డ్రామా ఆడారు. ఇప్పుడు వివేకా హత్య కేసులో చెల్లిని జైలుకు పంపాలని ఆలోచిస్తున్నారు. మద్యం, ఇసుకలో దోచుకున్న సొమ్ములు తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటెయినర్‌లో తరలిపోతున్నాయి. డబ్బుతో ఓట్లు కొనాలనుకుంటున్నారు’ అని ఆరోపించారు.
Sorry, no posts matched your criteria.