India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విమాన ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో టికెట్ ధరలకు రెక్కలు రానున్నాయి. ఇప్పటికే పలు రూట్లలో ధరలు గతనెలతో పోలిస్తే 39% పెరిగినట్లు తెలుస్తోంది. ఈ ధరలు మరో 20-25% పెరగొచ్చనేది నిపుణుల అంచనా. పైలెట్ల నిరసనతో విస్తారా ఫ్లైట్లు క్యాన్సిల్ అవడం, ఇంజిన్ సమస్యలతో 70 ఇండిగో విమానాల రద్దు, సంక్షోభంతో గో ఫస్ట్ విమానాలు తగ్గడం ఇందుకు కారణాలట. సమ్మర్ సీజన్ కావడమూ మరో కారణమంటున్నారు.

IPLలో భాగంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో SRH 20 ఓవర్లలో 182/9 రన్స్ చేసింది. టాపార్డర్ వికెట్లు త్వరగా కోల్పోయిన సమయంలో తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి 37 బంతుల్లో 64 రన్స్ చేసి SRH స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మిగతా ప్లేయర్లు కూడా తక్కువ స్కోరుకే ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 4 వికెట్లు తీసి SRHను దెబ్బ కొట్టగా.. హర్షల్ పటేల్, కర్రన్ చెరో 2 వికెట్లు, రబడ ఒక వికెట్ తీశారు.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎండీ, సీఈఓ సురీందర్ చావ్లా తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం దాఖలు చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని సంస్థ తెలిపింది. ‘వ్యక్తిగత కారణాలతో ఈ నెల 8న చావ్లా తన రాజీనామాను సమర్పించారు. ఈ ఏడాది జూన్ 26 నుంచి ఆయన పదవి నుంచి అధికారికంగా తప్పుకొంటారు’ అని స్పష్టం చేసింది. గత ఏడాది జనవరిలో చావ్లా పేటీఎంలో చేరారు.

మలయాళ స్టార్ మోహన్‌లాల్‌పై బాలీవుడ్ నటి విద్యాబాలన్ ప్రశంసలు కురిపించారు. ఆయనతో కలిసి నటించిన ‘చక్రం’ సినిమా షూటింగ్‌లో చాలా జీవిత పాఠాలను నేర్చుకున్నానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘లాల్ గొప్ప వ్యక్తి. షూటింగ్ గ్యాప్‌లోనూ సినిమా గురించే ఆలోచిస్తారు. సిబ్బందితో కలిసి సెట్‌లో చిన్న పనులు చేసేందుకూ వెనుకాడరు. వ్యక్తిగతంగా కాక ఒక టీమ్‌గా ముందుకు సాగడమే ముఖ్యమని ఆ సమయంలో అర్థం చేసుకున్నా’ అని తెలిపారు.

హర్ష దర్శకత్వంలో గోపీచంద్ నటించిన భీమా మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఏప్రిల్ 25 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటించారు.

APలో గత 5 ఏళ్లలో జగన్ తప్ప ఎవరూ బాగుపడలేదని TDP అధినేత చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ విరాళాల కోసం వెబ్‌సైటును ప్రారంభించిన ఆయన.. ‘ప్రతి ఒక్క వర్గం నష్టపోయింది. దేశం సరైన దిశలో వెళ్తుంటే.. ఏపీ రివర్స్‌లో వెళ్తోంది. జగన్‌పై జనంలో అసహనం కనిపిస్తోంది. APని ఇలా చేసిన YCPకి ఒక్క సీటు కూడా రాకూడదు. ప్రతి ఇంటిపై కూటమి జెండాలు ఎగురవేయాలి. రేపట్నుంచి నేను, పవన్ ప్రచారంలో పాల్గొంటాం’ అని వెల్లడించారు.

యూపీ ఎన్నికల ప్రచారంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అలీగఢ్ లోక్‌సభ సీటు నుంచి బరిలో ఉన్న పండిట్ కేశవ్ దేవ్ అనే అభ్యర్థి మెడలో చెప్పుల దండ వేసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనకు ఎన్నికల సంఘం చెప్పుల జత సింబల్‌ను కేటాయించడంతో, ప్రచారంలో ఈ వినూత్న పద్ధతిని ఎంచుకున్నట్లు దేవ్ చెబుతున్నారు. ఈ నెల 19 నుంచి జూన్ 1 మధ్యలో ఏడు దశల్లో యూపీలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

వేసవి తాపంతో అల్లాడిపోతున్న ప్రజలకు స్కైమెట్ చల్లటి కబురు తెచ్చింది. ఈ ఏడాది రుతుపవనాలు సమయానికే వచ్చేస్తాయని తెలిపింది. ఎల్‌నినో పరిస్థితులు వేగంగా లానినోలా మారుతుండటంతోనే ఈ మార్పు చోటుచేసుకుంటోందని వివరించింది. జూన్-సెప్టెంబరు కాలంలో వర్షపాతం 96శాతం నుంచి 104శాతం మధ్య నమోదవుతుందని వెల్లడించింది. సాధారణంకంటే ఎక్కువ వర్షపాతం కురవొచ్చని అంచనా వేసింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయర్ హసరంగ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆయన స్థానంలో శ్రీలంక స్పిన్నర్ విజయకాంత్ వియస్కాంత్ జట్టులో చేరుతున్నట్లు SRH మేనేజ్మెంట్ ప్రకటించింది.

AP: జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి సైతం భారత చైతన్య యువజన పార్టీ తరఫున అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా కనిపించిన ఆమె, జనసేన పార్టీ సభ్యురాలిగానూ ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అగ్రనేత నారా లోకేశ్‌పై మంగళగిరిలో తమన్నా కంటెస్ట్ చేయడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.