India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కర్ణాటక పోలీసులకు ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ భారీ విరాళాన్ని అందించింది. సైబర్ క్రైమ్‌పై పోరాటానికి గాను రూ.33 కోట్లను బెంగళూరు పోలీసులకు ఇచ్చింది. సంస్థ సీఎస్ఆర్ విభాగం ఈ విషయాన్ని ప్రకటించింది. అంతేకాక సీఐడీ, భారత సమాచార భద్రత మండలితో ఒప్పందాల్ని కుదుర్చుకున్నట్లు తెలిపింది. సైబర్ క్రైమ్ దర్యాప్తు కేంద్రంతో తమ అనుబంధాన్ని మరో నాలుగేళ్ల పాటు పొడిగించుకున్నట్లు వెల్లడించింది.

టెలికాం సంస్థలు త్వరలో మొబైల్ టారిఫ్ పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిశాక జూన్-అక్టోబరు మధ్య సంస్థలు 15%-17% ధరలు పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పెంపుతో ఎక్కువగా ఎయిర్‌టెల్ లబ్ధిపొందుతుందన్నారు. ఎయిర్‌టెల్‌కు యూజర్ నుంచి వచ్చే సగటు రెవెన్యూ ప్రస్తుతం రూ.208గా ఉండగా FY27కు అది రూ.286కి పెరగనుందట. కాగా 2021 DECలో 20%, 2019లో 20-40% చొప్పున టారిఫ్ పెరిగింది.

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఆ రాష్ట్ర అధికార పార్టీ డీఎంకేపై పీఎం మోదీ మండిపడ్డారు. ‘ఆ పార్టీ అహంకారంలో మునిగిపోయింది. ఆ దురహంకారాన్ని ప్రజలు హర్షించరు. విభజన రాజకీయాలే డీఎంకే మార్గం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ధ్యాస లేదు. మేం రాష్ట్రాల్లో రక్షణ నడవాలను నిర్మిస్తున్నాం. విభజనే లక్ష్యంగా పనిచేసే ఇండియా కూటమి అలా చేయగలదా? వారసత్వ రాజకీయాలే వారి లక్ష్యం’ అని స్పష్టం చేశారు.

దిగ్గజ కార్ల సంస్థ మారుతీ సుజుకీ స్విఫ్ట్ సహా పలు గ్రాండ్ విటారా వేరియంట్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. స్విఫ్ట్ కార్ల ధర రూ.25వేలు, గ్రాండ్ విటారాలోని సిగ్మా వేరియంట్ ధర రూ.19వేలు పెంచినట్లు తెలిపింది. నిర్వహణ ఖర్చు పెరిగిన నేపథ్యంలో పలు మోడళ్లకు ధరలను పెంచాల్సి వచ్చిందని సంస్థ వివరణ ఇచ్చింది. మార్చిలో అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో కలిపి 1,87,196 యూనిట్లు సేల్ అయినట్లు తెలిపింది.

లిక్కర్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను పదవి నుంచి తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇప్పటి వరకు సుప్రీంకోర్టు గానీ, హైకోర్టు గానీ ముఖ్యమంత్రిని తొలగించిన సందర్భాలున్నాయా? ఉంటే మాకు చూపించండి. ఈ అంశంపై దాఖలైన మూడో పిటిషన్ ఇది. సీక్వెల్స్ ఉండటానికి ఇదేం జేమ్స్ బాండ్ సినిమా కాదు. తొలగింపుపై గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఈ ఏడాది ఐపీఎల్‌లో 23 మ్యాచులు ముగిశాయి. అత్యధిక పరుగుల జాబితాలో ఆర్సీబీ స్టార్ కోహ్లీ(316) అగ్రస్థానంలో ఉన్నారు. ఇక రెండో స్థానంలో గుజరాత్ ఆటగాడు సాయి సుదర్శన్(191), మూడో స్థానంలో సన్‌రైజర్స్ బ్యాటర్ క్లాసెన్(186) కొనసాగుతున్నారు. అత్యధిక వికెట్ల జాబితాలో చెన్నై బౌలర్ ముస్తాఫిజుర్(9 వికెట్లు) అగ్రస్థానంలో, RR స్పిన్నర్ చాహల్ (8) రెండో స్థానంలో, పంజాబ్ బౌలర్ అర్షదీప్(8) మూడో స్థానంలో నిలిచారు.

ఐపీఎల్‌లో భాగంగా ఈరోజు జైపూర్‌లో రాజస్థాన్, గుజరాత్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది.
రాజస్థాన్ జట్టు: యశస్వి, బట్లర్, సంజూ, పరాగ్, హెట్మయిర్, జురెల్, అశ్విన్, బౌల్ట్, ఆవేశ్, కుల్‌దీప్ సేన్, చాహల్
గుజరాత్ జట్టు: గిల్, సుదర్శన్, విజయ్ శంకర్, అభినవ్, వేడ్, తెవాతియా, రషీద్, నూర్, ఉమేశ్, స్పెన్సర్, మోహిత్ శర్మ

AP: రైతులకు వ్యతిరేకంగా మాట్లాడిన మంత్రి, అతని కుమారుడు రాజకీయాల నుంచి తుడిచిపెట్టుకుపోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ‘పోలవరం అయ్యిందా అంటే ఓ మంత్రి డాన్సులు చేస్తారు. పునరావాసం అడిగితే అబ్బనీ తియ్యని దెబ్బ అంటారు. వైసీపీ పాలన పోవడం కోసం ఎన్నో త్యాగాలు చేశాం. తణుకులో అభ్యర్థిని ప్రకటించి వెనక్కి తగ్గాం. నాగబాబుకు టికెట్ ప్రకటించి కూడా బీజేపీ కోసం తప్పుకున్నాం’ అని స్పష్టం చేశారు.

ఐపీఎల్‌లో భాగంగా ఈరోజు జైపూర్‌లో రాజస్థాన్, గుజరాత్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. వర్షం పడుతుండటంతో టాస్ ఆలస్యమైంది. ప్రస్తుతం వర్షం తగ్గడంతో స్టేడియం సిబ్బంది కవర్స్ తొలగించారు. కాసేపట్లో టాస్ వేసే అవకాశం ఉంది.

AP: గ్రూప్-2 ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మెయిన్స్‌కు అర్హత పొందిన అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టింది. జూలై 28న గ్రూప్-2 మెయిన్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఫలితాల కోసం ఇక్కడ <
Sorry, no posts matched your criteria.