India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ్టి ఐపీఎల్ మ్యాచ్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఉప్పల్ వేదికగా రాత్రి SRH, CSK జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌ను సీఎం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యక్షంగా వీక్షించనున్నట్లు సమాచారం. సీఎం హోదాలో రేవంత్ మొదటిసారి ఉప్పల్ స్టేడియానికి వెళుతున్నారన్న వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా 9 ఏళ్ల క్రితం సీఎం హోదాలో ఇండియా, శ్రీలంక మ్యాచ్‌కు కేసీఆర్ వెళ్లిన విషయం తెలిసిందే.

RBI రెపో రేట్(6.5%) తగ్గించకపోవడంతో హోమ్ లోన్లపై వడ్డీ రేట్ కూడా యథాతథంగా ఉండనుంది. దీంతో హోమ్ లోన్లు తీసుకున్న, కొత్తగా తీసుకోవాలనుకుంటున్న వారికి ఊరట లభించలేదు. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇండియా – 8.30%, HDFC బ్యాంక్ – 8.35%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 8.40%, బ్యాంక్ ఆఫ్ బరోడా – 8.40%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ – 8.45%, ICICI బ్యాంక్ – 9.5% నుంచి హోమ్ లోన్లపై వడ్డీ వసూలు చేస్తున్నాయి.

వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమిదే విజయమని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. 2004కు ముందు కూడా ఎన్డీఏదే అధికారమని ప్రచారం చేసుకున్నారని, కానీ కాంగ్రెస్ అధికారం చేపట్టిందని గుర్తు చేశారు. ఎన్నికల తర్వాతే కూటమి తరఫున ప్రధానమంత్రి ఎవరనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేవారు.. వాటిని రక్షించే శక్తుల మధ్య పోరు జరుగుతోందన్నారు.

TG: కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రైతులకు నష్టం కలగడానికి ఆ పరిస్థితులే కారణమని చెప్పారు. ప్రాజెక్టులపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గీతన్న, నేతన్నకు అండగా ఉండే బాధ్యత తనదన్నారు.

ఐపీఎల్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. రేపు జైపూర్ వేదికగా RCB, RR మ్యాచ్ జరగనుండగా టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. తమ అభిమాన ప్లేయర్లను ప్రత్యక్షంగా చూడాలనుకున్న ఫ్యాన్స్ టికెట్ల కోసం గత రాత్రే దుప్పటి, దిండు పట్టుకుని స్టేడియం వద్దకు వచ్చారు. ఉదయం క్యూ లైన్ ఎక్కువగా ఉంటుందని భావించి వారు ఇలా వచ్చారు.

AP: రాష్ట్రంలో పెన్షనర్ల మరణాలు ప్రభుత్వ హత్యలేనని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించారు. హత్యలు చేసిన సీఎం జగన్‌కు అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని చెప్పారు. తూగో జిల్లా నల్లజర్లలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం పదవి నుంచి జగన్ తక్షణమే తప్పుకోవాలని డిమాండ్ చేశారు. పింఛన్ల విషయంలో వైసీపీ కుట్ర ప్రజలకు అర్థమైందన్నారు.

యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్-2004 రాజ్యాంగ విరుద్ధమంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మదర్సా బోర్డు ఏర్పాటు సెక్యులరిజం సూత్రాలను ఉల్లంఘిస్తోందని హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనది కాదని పేర్కొంది. మార్చి 22న హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మదర్సాల్లో కార్యకలాపాలను మళ్లీ చేపట్టవచ్చని స్పష్టం చేసింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా మూవీ షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలను హీరోయిన్ దిశా పటానీ ట్విటర్‌లో పంచుకున్నారు. ఇటలీలో జరిగిన సాంగ్ షూట్‌లో ప్రభాస్, నాగ్ అశ్విన్‌తో సరదాగా గడిపిన సన్నివేశాలను ఫొటోల్లో చూపారు. అయితే, సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు వార్తలొస్తుండటంతో సాంగ్ అయినా రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

TG: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలు నమ్మి ఓట్లేసిన ప్రజలు మోసపోయారని మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. 4 నెలల పాలనలోనే నానా తిప్పలు పడ్డారన్నారు. ‘రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఆ లబ్ధి పొందినవాళ్లు కాంగ్రెస్‌కు, లేదంటే BRSకు ఓటేయండి. వరి పండిస్తే రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి పట్టించుకోలేదు. ఈ ఎన్నికల్లో చురక పెడితేనే పనులు జరుగుతాయి’ అని పేర్కొన్నారు.

AP: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో వడగాలులు తీవ్రమయ్యాయి. రాయలసీమలో ఉష్ణోగ్రతలు ఏకంగా 43 డిగ్రీలు దాటాయి. దీంతో వాతావరణ శాఖ రాయలసీమ, దక్షిణ కోస్తా, నెల్లూరు, ప్రకాశం, పల్నాడుకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.