India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: సోషల్ మీడియా ద్వారా వైసీపీ ఇతర పార్టీల నేతలను వేధిస్తోందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. ఇందుకోసం రూ.కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. విపక్ష నేతల ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఈ అంశంపై విచారణ తప్పదని హెచ్చరించారు. ఏడాది కిందటే తాను ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని బయటపెట్టానని గుర్తు చేశారు.

AP: రాష్ట్రంలో బీజేపీ పోటీ చేసే ఆరు ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్లు సమాచారం. రాజంపేట నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, అరకు-కొత్తపల్లి గీత, రాజమండ్రి-దగ్గుబాటి పురందీశ్వరి, అనకాపల్లి-సీఎం రమేశ్, తిరుపతి-డా.వరప్రసాద్, నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ బరిలో నిలవనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. దీనిపై బీజేపీ అధిష్ఠానం త్వరలోనే అఫీషియల్ ప్రకటన చేసే అవకాశముంది.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్ RKS బధౌరియా బీజేపీలో చేరారు. బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ‘నాలుగు దశాబ్దాలుగా ఎయిర్‌ఫోర్స్‌లో సేవ చేశాను. కానీ మోదీ లీడర్‌షిప్‌లో గడిచిన ఎనిమిదేళ్లు నా సర్వీస్‌లో ఉత్తమం. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలు సాయుధ బలగాల్లో కొత్త విశ్వాసాన్ని నింపాయి’ అని బధౌరియా అన్నారు.

హోలీ పండుగ సందర్భంగా అయోధ్య బాలరాముడిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత వచ్చిన తొలి హోలీ పండుగ కావడంతో వివిధ రకాల పూలు, ఆభరణాలతో అలంకరించిన రాముడి దివ్యరూపం భక్తులను ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన ఫొటోలను శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర సోషల్ మీడియాలో పంచుకుంది.

TG: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. కేసీఆర్ హయాంలో SIB డీఎస్పీగా ఉన్న ప్రణీత్ రావును అరెస్ట్ చేసి కూపీ లాగగా.. ఏస్పీలు భుజంగరావు, తిరుపతన్న పేర్లు బయటికొచ్చాయి. తాజాగా వారినీ రిమాండ్‌కు తరలించారు. ఇంత జరుగుతున్నా.. అధికార, విపక్షాలు మౌనంగా ఉండటం గమనార్హం. అయితే సైలెంట్‌గా దీని వెనుక ఉన్న ‘పెద్ద తలకాయలను’ బయటికి లాగాలని ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తోంది.

TG: కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఆధారాలు లేకుండా అడ్డగోలుగా అసత్యాలను ప్రసారం చేస్తున్నాయని మాజీ మంత్రి KTR ధ్వజమెత్తారు. ‘తప్పుదోవ పట్టించేలా థంబ్ నెయిల్స్ పెడుతూ వార్తల పేరుతో అబద్ధాలను చూపిస్తున్నారు. ఇది వ్యక్తిగతంగా నన్ను, మా పార్టీని దెబ్బతీయాలనే కుట్రలో జరుగుతోంది. ఇప్పటికైనా ఆయా సంస్థలు తమ తీరు మార్చుకోవాలి. లేదంటే చట్ట ప్రకారం శిక్షకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నా’ అని X లో పోస్ట్ చేశారు.

TG: జగిత్యాలలో టెన్త్ అమ్మాయిల గంజాయి <<12910567>>కేసులో <<>>సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ అమ్మాయికి గంజాయి ఇచ్చి ఏడాదిగా పలుమార్లు రేప్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రేమ్, వెంకటేశ్, నితిన్ అనే ముగ్గురు నిందితులను గుర్తించి, పోక్సో, NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

రంజీ ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులు పెంచాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. BCCI ఇస్తున్న ఫీజులకు సమానంగా తాము కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో నెక్స్ట్ సీజన్ నుంచి ఆ జట్టు ప్లేయర్లు డబుల్ అమౌంట్ అందుకోనున్నారు. ప్రస్తుతం మ్యాచుల అనుభవాన్ని బట్టి ప్లేయర్లకు రోజుకు ₹20K-₹60K వరకు BCCI చెల్లిస్తోంది. ఇప్పుడు MCA ఇచ్చే మొత్తంతో కలిపి ప్లేయర్లకు రోజుకు ₹40వేల నుంచి ₹1.20లక్షల వరకు వస్తాయి.

AP: కాపుల కోసం పనిచేయడంతో రాజకీయంగా నష్టపోయినట్లు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. తనను చాలా ఇబ్బందులు పెట్టిన చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కలవడం బాధించిందన్నారు. వారిద్దరి ఓటమి కోసం తాను పనిచేస్తానని స్పష్టం చేశారు. వైసీపీలో చేరకపోయి ఉంటే పిఠాపురంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసేవాడినన్నారు. ఆ నియోజకవర్గంలో పవన్ కచ్చితంగా ఓడిపోతారని జోస్యం చెప్పారు.

హీరో మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ సినిమా టీవీల్లోకి రాబోతోంది. ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసిన ఈ మూవీ ఉగాది పర్వదినం సందర్భంగా బుల్లితెరపైకి రానుంది. ఏప్రిల్ 9న జెమినీ టీవీలో ఈ సినిమా టెలికాస్ట్ అయ్యే అవకాశముంది. ఈ మేరకు జెమినీ ఓ ప్రోమోను విడుదల చేసింది. సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం సుమారు రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.