news

News April 5, 2024

డీమార్ట్ మార్కెట్ వ్యాల్యూ రూ.3లక్షల కోట్లు!

image

డీమార్ట్ స్టోర్‌లను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్ మార్కెట్ విలువ తిరిగి రూ.3లక్షల కోట్లకు చేరుకుంది. బీఎస్‌ఈ ఇంట్రాడేలో కంపెనీ షేరు వాల్యూ 6 శాతం పెరిగి రూ.4710.15 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. నిన్న ట్రేడింగ్ ముగిసే నాటికి కంపెనీ విలువ రూ.3,02,405 కోట్లకు చేరుకుంది. 2021 అక్టోబర్‌లో ఈ కంపెనీ మార్కెట్ విలువ తొలిసారి రూ.3లక్షల కోట్లకు చేరింది.

News April 5, 2024

రజనీ మూవీ టైటిల్ ‘కళుగు’?

image

రజనీకాంత్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబోలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. మూవీ టైటిల్‌ను ఈ నెల 22న మేకర్స్ విడుదల చేయనున్నారు. కాగా చిత్రానికి ‘కళుగు’ అనే పేరును ఖరారు చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీనికి తెలుగులో ‘డేగ’ అని అర్థం. ఈ సినిమాలో రజనీకాంత్ గోల్డ్ స్మగ్లర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

News April 5, 2024

RED ALERT: రేపు 109 మండలాల్లో తీవ్ర వడగాలులు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రేపు ఏకంగా 109 మండలాల్లో తీవ్ర వడగాలులు, 206 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఎల్లుండి 115 మండలాల్లో తీవ్ర వడగాలులు, 245 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. ఆ మండలాల లిస్టు కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. ఇవాళ చాగలమర్రిలో 44.1, చిన్నచెప్పల్లిలో 43.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News April 5, 2024

నయీం కేసుని రీఓపెన్ చేయాలి: హనుమంతరావు

image

TG: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్యాంగ్‌స్టర్ నయీం కేసుని నీరుగార్చారని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ హనుమంతరావు ఆరోపించారు. ఈ కేసులో బయటపడ్డ వందల కోట్లు, పేదల నుంచి లాక్కున్న భూములు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. నయీం అక్రమాల్లో పాలుపంచుకున్న పోలీసు అధికారులు, నాయకులు ఎవరనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. సీఎం రేవంత్ చొరవ తీసుకుని ఈ కేసుని మళ్లీ తెరిచి విచారణ జరపాలని కోరారు.

News April 5, 2024

పారిస్ ఒలింపిక్స్‌ని రష్యా టార్గెట్ చేస్తుంది: మెక్రాన్

image

ఈ ఏడాది జూలైలో జరిగే పారిస్ ఒలింపిక్స్‌ని రష్యా లక్ష్యంగా చేసుకుంటుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఆరోపించారు. తప్పుడు సమాచారం వ్యాప్తితో పాటు మరేవిధంగానైనా రష్యా చర్యలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధంలో రష్యా తప్పక ఓడిపోతుందని అన్నారు. శత్రుత్వాన్ని తాము ప్రేరేపించమని.. కానీ ఏదొక రోజు యూరోపియన్ దళాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు.

News April 5, 2024

ఎస్ఏ-2 పరీక్షల తేదీలు మార్పు

image

TG: సమ్మెటివ్ అసెస్‌మెంట్(ఎస్ఏ-2) పరీక్షల నిర్వహణ తేదీలను మారుస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15 నుంచి 22 వరకు పరీక్షల నిర్వహించనున్నట్లు తాజాగా ప్రకటించింది. తొలుత ఏప్రిల్ 8 నుంచి 19 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించి.. టైం టేబుల్‌ను విడుదల చేసింది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ పరీక్షలు జరగనున్నాయి.

News April 5, 2024

ఏప్రిల్ 5: చరిత్రలో ఈరోజు

image

1908: స్వాతంత్ర్య సమరయోధుడు బాబూ జగ్జీవన్ రామ్ జననం
1950: త్రైత సిద్ధాంత ఆదికర్త ప్రభోదానంద యోగీశ్వరులు జననం
1892: తెలుగు కవి పూతలపట్టు శ్రీరాములు రెడ్డి జననం
1942: తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు క్రాంతి కుమార్ జననం
1993: నటి దివ్య భారతి మరణం
1974: ప్రముఖ సంగీత దర్శకుడు కోదండపాణి
మరణం

News April 5, 2024

నేడు కూటమి పార్టీల సమన్వయ సమావేశాలు

image

AP: టీడీపీ, బీజేపీ, జనసేన పార్లమెంట్ స్థాయి సమన్వయ సమావేశాలు ఈరోజు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ స్థాయిలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూటమి నేతలు కార్యాచరణ రూపొందించనున్నారు. కూటమి నిర్వహణ, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారంపై చర్చించనున్నారు.

News April 5, 2024

ఈ రోజు నమాజ్ వేళలు

image

తేది: ఏప్రిల్ 5, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:55 సూర్యోదయం: ఉదయం గం.6:07
జొహర్: మధ్యాహ్నం గం.12:19
అసర్: సాయంత్రం గం.4:44
మఘ్రిబ్: సాయంత్రం గం.6:30
ఇష: రాత్రి గం.07.43
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News April 5, 2024

ఆ ప్రాంతాలపై ఈసీ ఫోకస్

image

తక్కువ ఓటింగ్ నమోదు అవుతున్న 11 రాష్ట్రాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలపై కేంద్రం ఎన్నికల సంఘం దృష్టి సారించింది. దీనికి గల కారణాలపై CEC రాజీవ్ కుమార్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బిహార్, UP, ఢిల్లీ, ఉత్తరాఖండ్, TG, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లో 2019లో 67.40శాతం ఓటింగ్ నమోదైంది. ఈ రాష్ట్రాల్లో పట్టణాల్లో అత్యంత తక్కువ ఓటింగ్ నమోదవుతున్నట్లు గుర్తించారు.