India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TS: సిరిసిల్ల జిల్లా కందికట్కూర్ గ్రామంలో విషాదం జరిగింది. సాయితేజ అనే 14 ఏళ్ల విద్యార్థి గుండెపోటుతో పాఠశాల ఆవరణలోనే ప్రాణాలు వదిలాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ బాలుడికి పుట్టుకతోనే గుండెకు రంధ్రం ఉంది. ఆపరేషన్ తప్పనిసరిగా చేయించాలని డాక్టర్లు చెప్పినా ఆర్థిక స్తోమత సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు వైద్యం చేయించలేకపోయారు. ఈ క్రమంలో నిన్న స్కూల్ ఆవరణలోనే గుండెపోటుతో చనిపోయాడు.

TG: రాష్ట్రంలో రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణం కంటే 2-3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని తెలుపుతూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ఆరుబయట పనిచేసేవారు, పగటి పూట ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తలమడుగు, జైనథ్ మండలాల్లో గరిష్ఠంగా 42.3 డిగ్రీలు రికార్డయ్యాయి.

హీరో అక్కినేని నాగచైతన్య, డైరెక్టర్ కార్తీక్ దండు కాంబినేషన్‌లో త్వరలో ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. థ్రిల్లర్ కథతో రానున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చైతూ ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నారు. కాగా కార్తీక్ దండు గత ఏడాది ‘విరూపాక్ష’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

TG: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది. అయితే TETకు అప్లై చేసుకునే ప్రభుత్వ టీచర్లు కచ్చితంగా విద్యాశాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. లేదంటే నిబంధనలు ఉల్లంఘించినట్లుగా పరిగణిస్తామన్నారు. కాగా, ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లు HMలుగా పదోన్నతి పొందాలంటే టెట్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.

AP: ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పిల్లలను వాడుకోవద్దని రాజకీయ పార్టీలకు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సూచించింది. 18 ఏళ్ల లోపు బాలలను సార్వత్రిక ఎన్నికల కార్యక్రమాల్లో వినియోగించవద్దని కమిషన్ ఛైర్మన్ అప్పారావు అన్నారు. ఉల్లంఘిస్తే ఈసీ కఠిన చర్యలు తీసుకుంటుందని గుర్తు చేశారు. కొద్ది రోజులుగా కొందరు అభ్యర్థులు బాలలను ఎన్నికల పనులకు ఉపయోగిస్తున్నట్లు కమిషన్ దృష్టికి వచ్చిందన్నారు.

రాష్ట్రంలో పంట నష్టాన్ని పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. వచ్చే నెల మొదటివారంలో ఆయన నల్గొండ, భువనగిరి, ఆలేరులో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి రూట్ మ్యాప్‌ను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. రైతులతో ముచ్చటించి వారి ఇబ్బందుల్ని కేసీఆర్ స్వయంగా తెలుసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

AP: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకోనుంది. ప్రధాన పార్టీల అధినేతలు ప్రచార రంగంలోకి దిగనున్నారు. నేటి నుంచి ‘మేమంతా సిద్ధం’ యాత్రకు సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఇడుపులపాయలోని వైఎస్ సమాధి నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 21 రోజుల పాటు సాగనుంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నేటి నుంచి ‘ప్రజాగళం’ పేరిట ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఈ నెల 30నుంచి జనసేనాని పవన్ రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభిస్తారు.

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన SBI.. డెబిట్ కార్డు మెయింటనెన్స్ ఛార్జీలను పెంచింది. వివిధ రకాల కార్డులపై ఏడాదికి రూ.75 మేర ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డులపై ఏడాదికి రూ.125 ఛార్జి చేస్తుండగా, APR 1 నుంచి రూ.200 కానుంది. యువ, గోల్డ్, కాంబో, ప్లాటినం, ప్రైడ్, ప్రీమియం బిజినెస్ కార్డుల ఛార్జీలూ పెరిగాయి.

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా లైనెన్స్‌డ్ ఆయుధాలను పోలీసులు స్వాధీనపరచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే మణిపుర్‌లోని కుకీ-జో పౌరసమాజ సంస్థ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. స్థానికంగా మైతీలతో తమకున్న ఉద్రిక్తతల కారణంగా తుపాకులు ఇవ్వడం కుదరదని తెగేసి చెబుతోంది. మణిపుర్ హింస సమయంలో 4వేలకు పైగా తుపాకుల్ని పోలీసుల వద్ద నుంచి దుండగులు తస్కరించిన సంగతి తెలిసిందే.

TG: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఏప్రిల్ 6 లేదా 7న కాంగ్రెస్ ‘జనజాతర’ సభ నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఇచ్చే గ్యారంటీ హామీలను ఈ సభలోనే ప్రకటిస్తామన్నారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సభకు హాజరై ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఎంపీ అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేసేందుకు ఆయన ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు.
Sorry, no posts matched your criteria.